Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గర్భవతి ధరించే దుస్తులు ఎంత ఆహ్లాదంగా వుండాలి?

అసలు గర్భవతి సౌకర్యవంతమైన దుస్తులు ఎందుకు ధరించాలి?
మొదటగా, ఆమెకు హాయిని గొల్పేటందుకు! ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో అసౌకర్యాలుంటాయి. కనీసం ఆమె వేసుకున్న దుస్తులైనా ఆమెకు హాయినివ్వాలి. మొదటి త్రైమాసికంలో ఉదయం వేళ వాంతులు చేసుకోవడం తలనొప్పి మొదలైనవి వుంటాయి. కొంత అజీర్ణం కూడా వుంటుంది. అటువంటపుడు నడుముచుట్టూతా టైట్ గా వుండే దుస్తులు అసౌకర్యంగా వుంటాయి. పొట్ట ఇబ్బంది పెడుతూ వుంటుంది. చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో వేడిగా వుందంటారు. హార్మోన్లు అధికంగా ఖర్చు అయిపోతూంటాయి. శరీరం వేడెక్కపోతూంటుంది. కనుక మరింత వేడిని కలిగించే దుస్తులు ఎంతో అసౌకర్యానికి గురిచేస్తాయి. రెండో త్రైమాసికం వచ్చేసరికి కొద్దిపాటి బరువు పెరుగుతారు. లావైన శరీరానికి మూడో త్రైమాసికం వరకు అంటే డెలివరీ వరకు సరిపోయే దుస్తులు అవసరముంటుంది.
గర్భవతి స్త్రీ ఏ రకమైన దుస్తులు ధరించాలి?
సాధారణంగా గర్భవతి ధరించేది ఏ ఆకారమూ లేని ఒక గౌను వంటిది. ఆ మాదిరిగానే వుండాల్సిన అవసరం లేదు. మరి కొంచెం సౌకర్యవంతమైన ఫ్రాకులు, స్కర్టులు, లూజు గౌనులు మొదలైనవి విస్తరిస్తున్న పొట్టపై తేలికగా సౌకర్యవంతంగా వుండేవిగా వుండాలి. అధికంగా లూజు వున్నవి వాడకండి. అవి తగినట్లు మీకు ఫిట్ కాకపోయినా అసౌకర్యం వుంటుంది. కొంచెం అజాగ్రత్తగా వుంటే తొలగిపోయే ప్రమాదం వుంది. పేంట్లు బదులుగా స్కర్టులు, గౌనులు మొదలైనవి వాడండి. బరువు పెరిగే కొలది తొడలు ఒకదానికి ఒకటి ఒరుసుకొని ర్యాషస్ వచ్చే అవకాశం కూడా వుంది. స్కర్టులు వేస్తే గాలి తగిలి హాయిగా వుంటుంది. చీర కట్టేటట్లయితే, పెట్టికోట్ తాడు టైట్ గా కట్టకండి. రక్తప్రసరణ సాఫీగా జరగాలి. గర్భవతి వేసే దుస్తులు ఒక సారి వేస్తే ఎంతో హాయిగా వుందనిపించేలా వుండాలి.



Click it and Unblock the Notifications