For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాదక ద్రవ్యాలతో మహిళల కాన్పులు!

By B N Sharma
|

Labour Pain Reduced With Narcotics – Good Or Bad?
బిడ్డ పుట్టడం అంటే మహిళకు శారీరకంగా బాధాకర ప్రక్రియ. అయినప్పటికి ఆమెకు అంతులేని ఆనందాన్నిస్తుంది. బిడ్డ బయటకు రాగేనే భయంకరమైన కాన్పు నొప్పి తగ్గిపోతుంది. కాని ఆ బాధను భరించే శక్తి అందరి మహిళలకు వుండదు. సమస్య ఏమైనప్పటికి, కాన్పు నొప్పులను తగ్గించే మార్గాలు అనేకం వున్నాయి. వాటిలో ఒకటి తల్లికి కాన్పు సమయంలో మాదక ద్రవ్యాలను ఇవ్వటం. సాధారణంగా ఇవి నరాల వ్యవస్ధపై పనిచేస్తాయి. బాధ తగ్గి తల్లి కొంత విశ్రాంతి పొందుతుంది.

మత్తు ఇంజెక్షన్లు పిరుదులకు, తొడలకు ఇస్తారు. కొన్ని సార్లు ఐవి ట్యూబుద్వారా కూడా ఇస్తారు. ఎలా ఇచ్చినా నొప్పి తగ్గుతుంది. నొప్పులు వచ్చేదానికి కొద్దిపాటి ముందే ఇస్తే సరైన సమయానికి నొప్పి తెలియకుండా వుంటుంది. ఇది అసహజమైనప్పటికి, దీని వలన కొన్ని లాభాలు, నష్టాలు కూడా వున్నాయి. ప్రధానంగా నొప్పి తెలియదు. బిడ్డ బయటకు వచ్చే ప్రక్రియలో వీటి ప్రభావం వుండదు. అంతేకాదు ఈ మత్తు మందులు మహిళలు ఆందోళన పడకుండా కూడా చేస్తాయి.

నష్టాలు పరిశీలిస్తే, వికారం, దురద, కళ్ళు తిరిగినట్లుండటం, శ్వాసలో మాంద్యం మొదలైనవి వస్తాయి. మందు పరిమాణం ఎక్కువైతే, తల్లి, పిల్ల ఇద్దరూ కూడా మత్తులోకి జారుకుంటారు. సరైన సమయంలో కనుక మత్తు ఇవ్వక పోతే, బేబీ శ్వాస, గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. బిడ్డ మరికొన్ని ఇతర సమస్యలకు కూడా గురవుతుంది.

బిడ్డ పుట్టేటపుడు సాధారణంగా డెమెరాల్, న్యూబియన్, మార్ఫిన్ స్టాడల్, ఫెంటానీ అనే మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. లాభ నష్టాల బేరీజు వేసుకుంటే, బిడ్డ సహజంగా పుడితే మహిళకు, పట్టిన బిడ్డకు ఎంతో మంచిదని చెప్పవచ్చు.

English summary

Labour Pain Reduced With Narcotics – Good Or Bad? | మాదక ద్రవ్యాలతో మహిళల కాన్పులు!

Some of the common narcotics that are used during childbirth are demerol, nubain, morphine, stadol and fentanyl. Consider the pros and cons of using narcotics during childbirth, as medicine-free childbirth is one of the most natural thing that happens to a woman.
Story first published:Wednesday, September 28, 2011, 9:54 [IST]
Desktop Bottom Promotion