For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శాశ్వత గర్భ నిరోధక సాధనాలు

By B N Sharma
|

Permanent Contraception
అతిగా పెరిగే జనాభా ప్రపంచానికి పెద్ద సవాల్ గా మారింది. ప్రత్యేకించి ఇండియా, చైనాలు ఈ సమస్యను తీవ్రంగా భావిస్తున్నాయి. జనాభాను అరికట్టడానికి మానవ సంక్షేమ సంస్ధలు వివిధ రకాల గర్భ నిరోధక మార్గాలను ప్రోత్సహిస్తున్నప్పటికి సమస్యకు పరిష్కారం దగ్గరలో లేదు. ఈ అంశాన్ని పరిష్కరించాలంటే ప్రజలే శాశ్వత గర్భ నిరోధక మార్గాలను పాటించాలి. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలున్న వారు ఈ గర్భ నిరోధక పద్ధతిని పాటించవచ్చు.

ఈ శాశ్వత గర్భ నిరోధకత పురుషులకు, మహిళలకు కూడా అందుబాటులో వుంది. వీటిలో రెండు పద్ధతులను గమనిద్దాం. మహిళలకు శాశ్వత గర్భ నిరోధక చర్యగా ట్యూబెక్టమీ అందుబాటులో వుంది. ట్యూబెక్టమీ ప్రక్రియలో ఫలదీకరణను నిలిపివేస్తారు. మహిళల ఫాలోపియన్ ట్యూబ్ ను బ్లాక్ చేయడం లేదా సీల్ చేయటం వంటిది చేస్తారు. అపుడు మహిళ సహజంగా వదిలేటటువంటి అండం ఫలదీకరణకు ఆమె యుటిరస్ భాగాన్ని చేరదు. ఈ పద్ధతిని విస్తృతంగా పాటిస్తున్నారు. దీనిని సాధారణంగా లోకల్ ఎనస్తీషియా ఇచ్చి చేస్తారు. మహిళలు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డను ప్రసవించి ఇక ఆపై పిల్లలు అవసరం లేదనుకుంటే ఈ పద్ధతి ఆచరిస్తున్నారు. సిజేరియన్ లో ఆమె ఎనస్తీషియా ఇవ్వబడుతుంది కనుక అదే సమయంలో ఈ ట్యూబెక్టమీ చేసేయడం మరింత తేలిక కాగలదు. ట్యూబెక్టమీ ఆపరేషన్ 99 శాతం గ్యారంటీగా పనిచేస్తుంది. 1 శాతం అరుదుగా విఫలమై మరల గర్భం ధరించిన వారు కూడా వున్నారు. ఈసర్జరీ శాశ్వత గర్భ నిరోధకంగా అమలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ చేసినప్పటికి, స్త్రీ కనుక మరోమారు గర్భం ధరించాలంటే, ఫాలోపియన్ ట్యూబులను మరోమారు అతుకు పెట్టి కుట్లు వేసి అనుకూలం చేస్తున్నారు.

మగవారికి శాశ్వత గర్భ నిరోధక మార్గం వేసక్టమీ ఆపరేషన్. ఈ ఆపరేషన్ చేయటం ద్వారా పురుషుడి వీర్య కణాలు అరికట్టడానికిగాను వాసా డిఫరెన్షియా కత్తిరించి సీలు వేస్తారు. దీనికి గూడా లోకల్ ఎనస్తీషియా ఇస్తారు. ఈ వేసక్టమీ సర్జరీ అతి తేలికైనది, సురక్షితం కూడాను. పురుషుడు ఆపరేషన్ అయిన వెంటనే ఆస్పత్రిలో విశ్రాంతి కూడా పొందనవసరం లేదు. వెంటనే ఇంటికి వెళ్ళి పోవచ్చు. ఒక్క వారం రోజుల లోపు తన దినసరి పనికి కూడా వెళ్ళి పని చేసుకోవచ్చు.

వేసక్టమీ ఆపరేషన్లు విఫలమయ్యే అవకాశం అసలు లేదు. ఈ ఆపరేషన్ ద్వారా పురుషులు మహిళలకు గర్భం చేయటమనేది జరగదు. అయితే, వేసో వేసక్టమీ అనే మరో ఆపరేషన్ ద్వారా వీరు తమ స్త్రీలకు గర్భం చేయగలరు. కాని ఇది చాలా ఖర్చుతో కూడుకొనిన పని. ప్రస్తుతం ఈ రెండు గర్భ నిరోధక మార్గాలు మన దేశంలో వివాహమైన జంటలకు శాశ్వత గర్భ నిరోధక పరిష్కారంగా పరిగణించవచ్చు.

English summary

Permanent Contraception Methods For Men & Women | శాశ్వత గర్భ నిరోధక సాధనాలు

These are two main methods of contraception that are commonly adopted.There are very less chances of this procedure failing. Vasovasostomy is a reversal procedure, which enables men to impregnate their partner. Considering the high cost of this surgery, it is not common in practice.
Story first published:Tuesday, August 16, 2011, 16:17 [IST]
Desktop Bottom Promotion