Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతయ్యేందుకు శరీరాన్ని సిద్ధం చేయండి!

పొగతాగే అలవాటున్నట్లయితే దానిని తక్షణమే వదిలేయాలి. దీనివలన మొదటి త్రైమాసికంలోనే గర్భ విచ్ఛిన్నం జరిగే ప్రమాదముంది. స్మాకింగ్ అనేది యాక్టివ్ అయినా పాసివ్ అయినా దాని ప్రభావం మహిళ ఫెర్టిలిటీపై అధికంగా వుంటుంది. ఆల్కహాల్ తీసుకునేవారైతే దానిని కూడా మానటం మంచిది. బేబీ ఎదుగుదలపై దీని ప్రభావం అధికం. ఆఖరుకు బీరు, వైన్ వంటివి కూడా పిండానికి మంచిదికాదు. పరిశోధనలమేరకు గర్భిణీలు ఆల్కహాలు సేవిస్తే, బిడ్డ సైజు చిన్నదిగా వున్నట్లు తేలింది.
కాఫీలు కూడా బాగా తగ్గించాలి. కాఫీ ఒక కప్పు వరకు తాగవచ్చు. అధికమయితే గర్భ విచ్చిన్నానికి దోవతీయవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లరసాలు, పాలు వంటివి తీసుకోండి.
శరీర బరువు సరి చూసుకోండి. బరువు అధికంగా వున్నా, లేక తక్కువగా వున్నా కూడా తల్లికి గర్భస్ధ శిశువుకు సమస్యే. కనుక, మీ ఎత్తుకు తగ్గ బరువు సమంగా వుండేలా చూసుకోండి.
శారీరకంగా ధృఢంగా వుంటే గర్భాన్ని నిర్వహించటం, బిడ్డను ప్రసవించటం తేలికగా వుంటుంది. మీకు వ్యాయామాలు అలవాటు లేకుంటే ప్రతి దినం ఒక గంట వ్యాయామం చేయటం మొదలుపెట్టండి. మీ వెన్నెముక బలపడటానికి, నడుము నొప్పులు లేకుండా వుండటానికి తోడ్పడుతుంది.
శారీరక బలానికిగాను కొన్ని విటమిన్ టాబ్లెట్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం వున్నటువంటివి తీసుకుంటే బేబీ ఆరోగ్యం బాగుంటుంది. గర్భం ధరించే ముందుగానే శారీరక పరీక్ష చేయించుకోండి. పెద్ధలకు హాని కలిగించని అంశాలు గర్భంలోని పిండానికి లేదా పుట్టే పిల్లలకు హాని కలిగించవచ్చు. రక్త పరీక్షాలు చేయించుకోవడం సూచించదగినది. డాక్టర్ ను సంప్రదించి మీ ఉద్దేశ్యాన్ని తెలుపండి.
మీకు తెలియకుండా శరీరంలో ఏవైనా లోటుపాట్లు వుంటే వాటిని గమనించండి. వంశీకులనుండి వచ్చే సమస్యలు వుంటే ముందుగా తెలుసుకోండి. వంశపారంపర్యంగా వచ్చే సమస్యలను మీరు లేదా మీ భాగస్వామి డాక్టర్లతో ముందుగా సంప్రదించి తగిన పరిష్కారం కనుగొనండి. కనుక, గర్భం ధరించాలనుకుంటే ఈ అంశాలు గుర్తుపెట్టుకొని ముందస్తు జాగ్రత్తలను పాటిస్తే, గర్భ ధారణ సమయంలోను, బిడ్డ పుట్టిన తర్వాత అంతులేని ఆనందం మీ సొంతం కాగలదు.



Click it and Unblock the Notifications