మహిళకు మరో ఆనందం... !

By B N Sharma

Things To Do If Pregnant!
మహిళ ప్రెగ్నెంట్ అయిందంటే...మరో జీవితాన్ని మొదలెట్టిందన్న మాటే. ఒక తల్లిగా అదనపు భాధ్యత ఏర్పడుతుంది. గర్భం ఆశిస్తే ...ఆనందమే. కాని అనుకోకుండా ఏర్పడితే భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నీ సమస్యలే. అటువంటపుడు సలహా సంప్రదింపులు అవసరమవుతాయి. కనుక కొన్ని మార్గ దర్శకతలు పరిశీలించండి.

మహిళ తీసుకొనాల్సిన 5 ప్రధాన జాగ్రత్తలు -

1. వైద్యుడి ద్వారా గర్భాన్ని నిర్ణయం చేసుకోండి. పగలు, రాత్రి మిమ్మల్ని కనిపెట్టి వుండేందుకు ఒక మిడ్ వైఫ్ ను నియామకం చేసుకోండి. తర్వాతి డాక్టర్ చెక్ అప్ గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో గతంలో తల్లివైపు కాన్పుల చరిత్ర, మీ ఆరోగ్యం పరిశీలించండి. బ్లడ్ ప్రెషర్, గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రిస్తూ, అవసరమైన వ్యాక్సిన్ వేయించుకోండి.
2. ఫోలిక్ యాసిడ్ తీసుకోండి - గర్భవతైన మొదటి త్రైమాసికంలో కనీసం 400 ఎంసిజి ఫోలిక్ యాసిడ్ ప్రతిరోజూ తీసుకోండి. బేబీకి లోటు రాకూడదనుకుంటే ఇది అత్యవసరం. ఇది విటమిన్ టాబ్లెట్ లు లేదా కొన్ని రకాల పండ్లు, కూరలలో లభ్యమవుతుంది.
3. చెడు అలవాట్లు వదలండి - స్మాకింగ్, డ్రింకింగ్ వంటివి నిలుపు చేయండి. లేదంటే బిడ్డ త్వరగా పుట్టి సమస్య వస్తుంది.
4. బరువు సరిచూసుకోండి - బిడ్డ బరువు కాక, అదనంగా బరువు పెరగటం ఎప్పటికపుడు నియంత్రించుకోవాలి. బరువు పెరిగితే షుగర్, బ్లడ్ ప్రెషర్ వంటివి వచ్చి హార్ట్ సమస్య కూడా వచ్చే ప్రమాదం వుంది. బరువు పెరగకుండా, తగుమాత్రం నడక, సులభ వ్యాయామాలు వంటివి చేయండి.
5. ఆరోగ్యకర ఆహారం తినండి - ప్రతిరోజూ ఆహారంలో పండ్లు, వెజిటబుల్స్, ప్రొటీన్లు, కాల్షియం వుండేలా జాగ్రత్తపడండి. వారానికోసారి చేప ఆహారం తింటే బేబీ కండ్లు, బ్రెయిన్ బాగా ఎదుగుతాయి. షార్క్, స్వార్డ్ ఫిష్ వంటివి తినకండి.

ఈ అయిదు ప్రధాన జాగ్రత్తలు తీసుకుంటే, మహిళకు మరో జీవితంగా చెప్పేగర్భవతి దశ ఆనందంగా సాగిపోతుంది.

Story first published: Monday, November 28, 2011, 14:35 [IST]
Desktop Bottom Promotion