For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చే అబార్షన్లు!

By B N Sharma
|

Unsafe Abortions
అభం శుభం తెలియని బాలిక అమాయక జీవితంలోంచి బరువు భాధ్యతలు, జీవిత వాస్తవాల విలువలు అపుడపుడే తెలుసుకునే యువతి దశలో అడుగిడుతుంది. లైంగిక జీవనానికి అలవాటు పడే సమయంలో ఈ రకమైన అబార్షన్లు ఆమెకు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తాయి. అంతేకాదు అబార్షన్ కనుక శిక్షణ పొందిన వైద్యులు నిర్వహించకుంటే జీవితమంతా ఆమె వైద్యపర రసమస్యలతో గడపాల్సిందే. ప్రపంచంలో లక్షలాదిమంది యువతులకు నేడు జరుగుతున్న వాస్తవం. వారిలో చాలామంది అనారోగ్యం కారణంగా మరణిస్తున్నారు కూడాను.

సరి అయిన అవగాహన లేక నేటి యువతులు అసుక్షిత అబార్షన్లకు గురైపోతున్నారు. ఒక ప్రాధమిక నివేదిక మేరకు 6,00,000 గర్భవతుల మరణాలలోను 13 శాతం అసురక్షిత అబార్షన్ల కారణంగానని కూడా తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 మిలియన్ల అసురక్షిత అబార్షన్లు జరుగుతున్నట్లు రికార్డులు చెపుతున్నాయి. మరో ఆశ్చర్యకర విషయంగా, ఈ అబార్షన్లు అత్యధికంగా భారతదేశంలోనే జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వైద్యపర సమస్యలున్నాయని తెలిసి కూడా గర్భవతులు తమ గర్భాలను అసురక్షిత మార్గాల ద్వారా విచ్ఛిన్నం చేసుకోటానికి ప్రయత్నించటం వారికిగల అవగాహనా లోపమే. శాస్త్రీయపరంగా కనుక అబార్షన్ చేసినట్లయితే అది ఎంతో తేలిక దానినే మెడికల్ టర్మినల్ ఆప్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. కాని సమాజానికి భయపడి చాలామంది నేడు అసుక్షిత విచ్ఛిన్న విధానాన్ని ఆచరిస్తున్నారు.

ప్రభుత్వాలు ఈ దిశగా తమ దృష్టిని కేంద్రీకరించి చట్టాలలో సవరణలు తీసుకురావలసిన భాధ్యత వారిపై వుంది. చట్టాలున్న దేశాలలో సరి అయిన అవగాహన కల్పించాల్సిన అవసరం వుంది. మనదేశంలో చాలామంది స్త్రీలు అబార్షన్లు అన్ని దశలలోను చట్టబద్ధం కానివిగానే అర్ధం చేసుకుంటున్నారు. అన్నిటికంటే కూడా ముందు సమాజం గర్భవిచ్ఛిన్నాలకు ఆమోదం ఇవ్వాలి.నేడు జరిగే చాలా గర్భ ధారణలు పెళ్ళికి ముందు జరుగుతున్నవే.కనుకే సమాజంలో ఈ రకమైన అభిప్రాయాలున్నాయి.

పెద్దలు తమ కుటుంబ మాన మర్యాదలు పోతాయేనే భయాలతో రహస్యంగా అసుక్షిత పద్ధతులలో గర్భ విచ్ఛిన్నాలకి మార్గాలు అవలంబిస్తున్నారు. ప్రభుత్వాలు తక్షణమే వీటికి చట్టపర పరిష్కార మార్గాలు ఆలోచించాలి. బిడ్డకు జన్మనివ్వటం స్త్రీ యొక్క జన్మహక్కని ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేయాలి.

English summary

Unsafe abortions causing loss to the mankind | మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చే అబార్షన్లు!

Thus, it is the responsibility of each and every government of the world to tackle this problem urgently, as urgently as it would deal with terrorism, before we lose many more lives. Let the ability to procreate be a pride for the womankind and not a curse!
Story first published:Tuesday, August 23, 2011, 11:11 [IST]
Desktop Bottom Promotion