Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అబార్షన్ కు అందుబాటు మార్గాలెన్నో...!

1. క్యూరిటేజ్ - ఇండియాలో ఇటీవలి వరకు ఇది మాత్రమే వైద్య పరంగా ఆమోదించిన పద్ధతి. ఈ పద్ధతిలో శస్త్రచికిత్స ద్వారా అనవసరమనుకున్న పిండాన్ని ఒక పరికరంతో తొలగిస్తారు. తల్లి కాబోయే స్త్రీ గర్భాశయాన్ని పెద్దది చేసి బేబీని దాని నుండి తీసేస్తారు. ఇది 14 వారాల గర్భం లోపే సురక్షితం. అంతకు మించితే ప్రాణ హాని వుంటుంది.
2. పిల్ వాడకం - ఇది ఇటీవలే వాడుకలోకి వచ్చింది. బాగా ఆచరణకి వచ్చింది. గర్భం తీసేయాలంటే రెండు రకాల మాత్రలుంటాయి. గర్భ నిరోధ సాధనం ఏదీ వాడకుండా గర్భం వస్తుందన్న భయం వుంటే ఒక దానిని 48 గంటల్లో తీసుకోవాలి. మరో మాత్ర హార్మోన్ టాబ్లెట్. దీనిని రుతుక్రమం మిస్ అయిన వెంటనే లేదా గర్భం దాల్చిన 49 రోజులలోగా తీసుకోవాలి. అయితే, వీటిని రెగ్యులర్ గా వాడటం సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. వైద్యుడి సలహా లేనిదే ఈ పిల్స్ తీసుకోకండి.
3. వాక్యూమ్ ఆస్పిరేషన్ - ఈ అబార్షన్ పద్దతి చాలా కాలం నుండే వుంది. జననాంగ భాగం నుండి బిడ్డ సంచిలోకి ఒక ట్యూబ్ పంపుతారు. ఆ ట్యూబ్ కు గల పదునైన అంచులు లోపలి వున్న బేబీని ముక్కలుగా కోసేస్తుంది. ఆట్యూబ్ ద్వారానే ముక్కలను బయటకు తెప్పిస్తారు. ఇది గర్భం ధరించిన 12 వారాల వరకు మాత్రమే సాధ్యం.
4. సర్జికల్ అబార్షన్ - ఈ పద్ధతి గర్భవతి అయిన తర్వాత ఏమైనా సమస్యలు వచ్చి పెద్ద ప్రాణానికి హాని అనుకుంటే చేస్తారు. ఇది చాలా వరకు సిజేరియన్ వంటిదే. అయితే ఈ పధ్ధతిలో బేబీ చనిపోయి బయటకు వస్తుంది. దీనిని శాశ్వత హిస్టరెక్టమీ గా కూడా భావించవచ్చు. ఎందుకంటే దీనిలో పాడైపోయిన గర్భాశయాన్ని, అండాలను కూడా తొలగిస్తారు. ఇది అత్యవసర లేదా తప్పని పరిస్ధితులలో మాత్రమే వైద్యులు చేయటానికి అంగీకరిస్తారు. మీకు ఏర్పడే పరిస్ధితులను బట్టి వైద్యుని సలహాపై మీరు ఆచరించాల్సిన అబార్షన్ కొరకు సమాచారంగా పరిగణించండి.



Click it and Unblock the Notifications
