Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భం పోతే మరో గర్భం ఎపుడు ధరించాలి?

ఒకసారి గర్భం పోయినవారికి మరోమారు గర్భవతి అవుతున్నానంటే కొద్దిపాటి భయం వుంటుంది. ముందు గర్భం పోయిన తర్వాత వచ్చిన సమస్యలన్నీ తగ్గాయా లేదా ధృఢపరచుకోవాలి. గర్భ విచ్చిన్నం తర్వాత అయ్యే రక్త స్రావం పూర్తిగా తగ్గిందా లేదా చూడండి. గర్భం ఒక సారి పోయిన తర్వాత కొంతకాలంపాటు మహిళ రతి పట్ల ఆసక్తి చూపదు. కనుక ఆ అంశంగా కూడా కొంతకాలం వేచివుండాలి. ఆమెతో చర్చించి పూర్తి అంగీకారంతో మరోమారు గర్భవతి అయ్యేటందుకు ప్రయత్నించాలి.
గర్భం పోయిన తర్వాత రుతుక్రమం సాధారణమయ్యేవరకు రతిక్రీడ ఆచరించకపోవటం మంచిది. శరీరం బలహీనమైనపుడు వెంటనే గర్భం ధరించటం మంచిదికాదు. ఒక వైపు గర్భం పోయిందన్న ఆందోళన మరోవైపు వెంటనే మరో బిడ్డ కావాలన్న ఆత్రుతలుంటాయి. అయితే, శరీర ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి. రుతుక్రమం సాధారణ స్ధితికి వచ్చిన తర్వాత, అండం విడుదల కూడా సాధారణంగా వుంటుంది కనుక తగు జాగ్రత్తలతో అపుడు మాత్రమే మరో గర్భం ధరించటం మంచిదిగా చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications