For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండంటి బిడ్డ కొరకు...మార్చండి జీవనశైలి!

By B N Sharma
|

Lifestyle Changes During Pregnancy
మహిళ గర్భవతి అవ్వాలంటే తన శరీరం కొరకు పుట్టబోయే బిడ్డ కొరకు ఎంతో శ్రధ్ధ చూపుతుంది. సేఫ్ డెలివరీ అవ్వాలంటే కొన్ని జీవన విధానాలు మార్చాల్సిందే. దీనికిగాను, పుట్టబోయే బిడ్డకు నష్టం వాటిల్ల కూడదనుకుంటే. కొన్ని ఇష్టాలు కూడా వదులుకోవాల్సిందే. గర్భవతై పండంటి బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వాలనుకునే మహిళలు పాటించాల్సిన ప్రధాన జాగ్రత్తలు చూద్దాం!

వ్యాయామాలు - వ్యాయామాలు చేసి ఫిట్ గా వుండండి. వ్యాయామం, ఒత్తిడి, నొప్పులు తగ్గించి శరీర బిగువును అధికం చేస్తుంది. మీరు గర్భవతి అయ్యేటందుకు అవసరమైన శారీర సమర్ధతనిస్తుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత స్విమ్మింగ్, వాకింగ్ వంటి తక్కువ శ్రమ కల వ్యాయామాలు మాత్రమే చేయాలి.

ఒత్తిడిని తొలగించండి - ఏ రకమైన ఒత్తిడి కలిగినా దానిని మరచిపొండి. కడుపులోని బేబీ గురించే ఆలోచించండి. ఆందోళనలుంటే, సన్నిహితులతో చర్చించి పరిష్కరించుకోండి. ఆశావహాంగా వుంటే, పుట్టే బిడ్డ సరి అయిన బరువుతో పుడతాడు.

విశ్రాంతి. - దూర ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయవద్దు. దీనికై డాక్టర్ సలహాను పాటించండి. మీరు వెళ్ళే ప్రాంతంలో ఎమర్జెన్సీ ఏర్పాట్లకై పరిశీలించండి. ప్రతి గంట లేదా రెండు గంటలకొకసారి నడవండి. బాడీని తేలిక చేసుకోండి. ఎపుడూ నీరు, చాక్లెట్ల వంటివి రెడీ గా మీతో వుంచుకోండి. ఎప్పటికపుడు సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి.

కొన్ని అలవాట్లు వదలండి - స్మాకింగ్, డ్రింకింగ్ వంటివి వదలండి. మీరు కొద్దిగా తాగినా సరే కడుపులోని పిండానికి హాని కలుగుతుంది. శారీరక లోపాలు, మానసిక లోపాలు ఏర్పడతాయి. పొగ తాగటం వలన అబార్షన్ అయ్యే ప్రమాదం కూడా వుంది. మీరు ప్రెగ్నెంట్ అయ్యే ముందే... ఈ రెండు అలవాట్లను తప్పక వదలాలి.

English summary

Why Lifestyle Changes During Pregnancy? | పండంటి బిడ్డ కొరకు...మార్చండి జీవనశైలి!

When a woman plans pregnancy, it is usual for her to develop motivation to look after her body for the baby. Lifestyle changes during pregnancy becomes a necessity for a safe delivery. This generally includes giving up some of your favorite likes to assist your body for nurturing the baby and protect it from developing birth defects.
Story first published:Monday, September 26, 2011, 11:28 [IST]
Desktop Bottom Promotion