Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గర్భనిరోధక సాధనాలతో మరింత ఆనందిద్దాం!

1. నువ్వు ఎంతో అందంగా వున్నావ్ - ఈ మాటలు చెపితే చాలు అవి ఎలా చెప్పినా సరే ఆమె ఆనందిస్తుంది. ఒకసారి కాదు అవసరం అనుకుంటే పది సార్లు చెప్పండి.
2. నీ శారీరక రూపం చాలా బాగుంటుంది - ప్రతి యువతి తన శారీరక రూపం గురించి భయపడుతూంటుంది. పిరుదులు లావని, స్తనాలు చిన్నవని, పొట్ట పెరిగిందని అనుకుంటూ వుంటుంది. అందుకని అన్నీ సవ్యంగా వున్నాయని, నాకు బాగున్నాయని తెలుపండి.
3. నీ ప్రవర్తన నేనెంతో ఇష్టపడుతున్నానని తెలుపండి. ఆమె ప్రవర్తన కొన్ని ఉదాహరణలు చెపుతూ ప్రశంసించండి.
4. నీలో ఒక ప్రత్యేకత వుంది అనండి. ఆమె తప్పక తాను ప్రత్యేకంగా భావించేలా చేయండి. ఆమె భావాలను ఉన్నతంగా చేయండి.
5. మనం కలిసి వున్నంతవరకు ఎక్కడైనా సరే ఆనందమే అనండి. సరైన భాగస్వామి దొరికితే మీరు జీవితంలో గెలిచినట్లే. కనుక ఇపుడు అటువంటి పార్టనర్ దొరికింది కనుక, బహిరంగంగా చెప్పేయండి. ఇలా చెప్పేస్తే ఆమె తప్పక తనవంతుగా నూటికి నూరు శాతం మీకు ఆనందం ఇచ్చేస్తుంది.
6. నీతో స్నేహం తర్వాత నేను బాగా అభివృధ్ధి చెందానని తెలుపండి. ఈ విషయం చెపితే ఆమె చాలా గర్వంగా భావించి మరల మిమ్మల్ని అభినందిస్తుంది. రాబోయే రోజుల్లో మీతో మరింత సన్నిహితంగా గడిపి ఆనందింపజేస్తుంది.
7. నీతో ఎంత మాట్లాడినా తనివి తీరటంలేదు....అనండి. ఇది మీ సంభాషణలో చివరి అస్త్రంగా వాడేయండి. నీవు లేకుంటే నాకు తోచదు అనండి. నీవు లేకుంటే నాకు జీవితమే లేదని కూడా చెప్పండి. మీరు ఈ విషయాలను మనసా వాచా, కర్మణా గుండెలలోతులలోంచి చెపుతున్నానని ఆమెకు తెలుపండి. అంతే ఇక మీ జీవితానికి ఆమే మీ జీవిత రధసారధి.
8. మరింత దగ్గరైన ఆమెకు ప్రేమికుల రోజైన ఈ రోజున పవిత్రంగా మనం ఒకటవుదామని, తగిన గర్భ నిరోధక సాధనాలతో ఆనందిద్దామని నమ్మించి భావిజీవితానికి పునాదులు వేసుకోండి.
అయితే, మరీ నాటకీయంగా, అధిక మోతాదులో ఆమెతో సంభాషిస్తే సంబంధం బెడిసికొడుతుందని కూడా గుర్తుంచుకోండి. కనుక తెలివిగా అవసరానికి తగినట్లుగా, మనస్ఫూర్తిగా సంభాషించండి.



Click it and Unblock the Notifications