Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతులకు సాధారణంగా వచ్చే సమస్యలు వాటి పరిష్కారాలు!

వికారం, వాంతులు - ఈ సమస్య వున్నవారు ఉదయం అతి మెల్లగా పడకపైనుండి లేవాలి. లేచిన వెంటనే ద్రవపదార్ధాలు కాకుండా పొడిగా వుండే పదార్ధాలు లేదా బిస్కట్ వంటివి తీసుకోవాలి. ఎపుడు కావాలంటే అపుడు కావలసినంత వివ్రాంతి, నిద్ర తీసుకోవాలి. ఆహారం కొద్దిగాను, తరచుగాను తీసుకోవాలి. ద్రవాలు అధికంగానే తీసుకోండి. తినటం మానరాదు. ఇది పరిస్ధితిని మరింత తీవ్రం చేస్తుంది.
జననాంగ నొప్పులు - దీనికిగాను ఆమె తప్పక వైద్యులను లేదా ఫిజియో ధిరపిస్టులను సంప్రదించి బెల్టు ధరించాలి
అజీర్ణం - ఒకే సారి అధిక భోజనం కాకుండా, కొద్ది మొత్తాలలో తరచుగా తినాలి. భోజన సమయంలో నిదానంగా నమిలితినాలి. ఆహారం తీసుకునే సమయంలో ద్రవాలు అధికంగా తీసుకోరాదు. భోజనం తర్వాత వంగటం లేదా కింద పడుకోవటం చేయవద్దు. ప్రతి రాత్రి భోజనం బెడ్ టైమ్ కు రెండు గంటలముందు తినాలి.
గుండెమంట - చల్లటి పాలు ఒక గ్లాసెడు తాగితే పరిష్కారమే. గుండె మంట రాకుండా అధిక, నూనెలు కల ఆహారాలు రాత్రి డిన్నర్ లో మానండి. యాంటాసిడ్ టాబ్లెట్ లు వైద్యుల సలహా లేకుండా వాడకండి.
మలబద్ధకం - గింజలు, పండ్లు, కూరగాయలు వంటి వాటి ద్వారా పీచు అధికంగా తీసుకోండి. తగినంత నీరు తాగితే ఈ సమస్య వుండదు.
నీరు పట్టటం - గర్భిణీ స్త్రీకి నీరు పడుతుంది. దీనికిగాను ఆమె ఆహారంలో అధిక ఉప్పు మానాలి. రోజూ కాళ్ళు మసాజ్ చేసుకుంటే మేలు.
స్ట్రెచ్ మార్కులు - విటమిన్ ఇ అధికంగా వుండే ఆహారం తినాలి. పొట్టపై ఏర్పడే గుర్తులకు నూనె రాసి సున్నితంగా మర్దన చేయాలి.
తిమ్మిర్లు - మడమ, కాళ్ళు వంటివి ప్రతిరోజూ మెల్లగా వ్యాయామాలు చేస్తే రక్త సరఫరా మెనరుగుపడి తిమ్మిర్లవంటివి తగ్గుతాయి.
వెన్ను నొప్పి - వెన్ను నొప్పి రాకుండా పలుచటి చెప్పులు ధరించాలి. సరైన పొజిషన్ లో కూర్చొనుట, నిలబడుట, పడుకొనుట వంటివి చేయాలి. బరువులు ఎత్తరాదు. వేడి నీటి స్నానం సున్నిత మసాజ్ వంటివి వెన్ను నొప్పి తగ్గిస్తాయి.
అధిక రక్తపోటు - రెగ్యులర్ వ్యాయామం చేయాలి. పోషకాహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తినాలి. ఉప్పు అధికంగా వుండే పచ్చళ్ళు అప్పడాలు, ఇతర ఆహారాలు తినరాదు.
అపస్మారకం - కూర్చున్నా లేక పడుకున్నా మెల్లగా లేవండి. నిలబడివున్నపుడు తెలివి తప్పితే, వెంటనే కూర్చోండి. ఒక పక్కకు తిరిగి పడుకోండి. మీరు వెల్లకిలా వెన్నుపై ఎపుడూ పడుకోరాదు.
తరచుగా వచ్చే మూత్రం - నీరు బాగా తాగండి. తక్కువతాగితే మూత్రాశయానికి ఇన్ఫెక్షన్ రావచ్చు.
దురదలు - వదులుగా వుండే దుస్తులు కాటన్ వి ధరించండి.
వేడిగా వుంటే - మీ గది చల్లగా వుంచుకోండి. తరచుగా స్నానం చేయండి. వదులైన కాటన్ దుస్తులు ధరించండి.
మొలలు - పీచు అధికంగా వుండే ఆహారం తినండి. తగినంత నీరు రోజూ తాగండి. మలబద్ధకం పోతుంది. మొలలు సమస్య కావు.
నిద్ర - కొన్నిమార్లు రాత్రులందు మంచి నిద్ర పట్టదు. అటువంటపుడు ఒక తలగడను మీ పొట్ట కింద వుంచి పక్కకు తిరిగి పడుకోండి.
చర్మం మరియు జుట్టులో మార్పులు - ఎండకు అధికంగా గురికాకండి. సన్ స్క్రీన్ వాడండి. ఒమేగా 3 ఫా్యటీ యాసిడ్లు తీసుకోండి. బిడ్డ పుట్టిన తర్వాత మీ ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది.
అలసట - దీనికి పరిష్కారం విశ్రాంతి మాత్రమే. ఎక్కడ కూర్చున్నా కాళ్ళు పైనపెట్టి కూర్చోండి. నిద్ర ఎపుడు వచ్చినా పడుకోండి. కుటుంబంలో మీరు ఒక రాణిలా మర్యాదలు పొందండి.
ఉబ్బిన మడమలు, కాళ్ళు, వేళ్ళు - అధిక సమయాలు నిలబడకండి. సౌకర్యమైన చెప్పులు ధరించండి. కొన్ని దిండ్లపై మీ పాదాలు పెట్టి రోజూ కనీసం ఒక గంట సేపు సేద దీరండి.
ఏ సమస్యకైనా సరే వెంటనే వైద్యుల సలహా పొందటం మంచిదని గుర్తించండి.



Click it and Unblock the Notifications