Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గర్భంలోని శిశువు ఎదుగుదల ఎలా?

గర్భవతికి ప్రతివారం శారీరకంగా కొన్ని మార్పులు వస్తూనేవుంటాయి. బేబీ కూడా వారానికో రీతిలో ఎదుగుదల చూపుతూనే వుంటుంది. మహిళ, ఆమె బిడ్డ ఆరోగ్యంగా వుండాలంటే కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భం నిర్ధారణ అవగానే ప్రతివారూ డెలివరీ తేదీ ఎపుడు కాగలదంటూ అడిగేస్తూంటారు. ఈ విషయంలో మీ వైద్య జాగ్రత్తలు చూసే డాక్టర్ షుమారుగా ఏ తేదీకి కాన్పు జరుగుతుందనేది మీరు చివరిసారిగా అయిన పిరీయడ్ బట్టి చెపుతుంది. కాన్పు షుమారుగా మీ పిరియడ్ అయిన మొదటి తేదీ నుండి 40 వారాలకు అవుతుంది.
అయితే అప్పటికి మీ కడుపులోని బేబీకి 38 వారాలు మాత్రమే వుంటాయి. మీ చివరి పిరీయడ్ అయినప్పటినుండి రెండు వారాలపాటు, బేబీ గుడ్డు దశలోనే వుంటుంది. మీకు ఈ రకంగా అంచనా వేయబడిన కాన్పు తేదీ షుమారుగా మాత్రమే అని గుర్తుంచుకోండి. చాలామంది పిల్లలు 38 నుండి 42 వారాలలోపు పుడతారు. చాలా కొద్ది మంది మహిళలు మాత్రమే డాక్టర్లు నిర్ణయించిన షుమారు తేదీలకు కాన్పు పొందుతారు.
ఇక గర్భిణీ తొమ్మిదినెలల కాలంలోను 1వ వారం నుండి 12 వ వారం వరకు మొదటి త్రైమాసికం, 13 నుండి 26 వరకు రెండవ త్రైమాసికం, 27 నుండి కాన్పు అయ్యే వరకు మూడవ త్రైమాసికంగా లెక్కించాలి. మూడవ త్రైమాసికం చివరలో మహిళ ప్రసవం అయిపోతుంది. ప్రధానంగా చివరి నాలుగు వారాలు ఆమెకు ఎంతో శ్రమ కలిగిస్తాయి.



Click it and Unblock the Notifications