Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
గర్భస్రావ అత్యవసర చికిత్సకు చిట్కాలు

గర్భస్రావానికి చికిత్స వ్యక్తికి వ్యక్తికి మధ్య మారుతూంటుంది. ప్రతి గర్భస్రావం విభిన్నంగా వుంటుంది. పరిస్ధితిని బట్టి చికిత్సలు చేయవలసి వుంటుంది. అయితే, గర్భస్రావ చికిత్సకు ప్రామాణిక చికిత్సా పద్ధతి అంటే, ఎలా వుంటుందనేది పరిశీలించండి.
గర్భస్రావ చికిత్సా మార్గాలు
1. సాధారణ గర్భస్రావాలు చాలావరకు చికిత్స లేనివిగా వుంటాయి. విఛ్చిన్నమైన పిండం శరీరంనుండి రక్తం రూపంలో బయటకు పోయేటంతవరకు మీరు వేచి వుండాలి. ఇది వినటానికి కఠినంగా వున్నప్పటికి, ఈ విషయంలో ఎవరూ చేయగలిగింది లేదు. వేచి వుండటం మాత్రమే. రక్తస్రావం కనుక అధికంగా కాకుంటే, అపుడు మీరు మందులు లేదా ఆస్పత్రి కి వెళ్ళడం వంటివి చేయనవసరం లేదు.
2. ప్రెగ్నెన్సీలో రక్తస్రావం అనేది గర్భస్రావం లక్షణంగా భావించనవసరం లేదు. మీరు వెంటనే డాక్టర్ ను సంప్రదించి అది గర్భస్రావమా కాదా అనేది నిర్ధారించుకోండి.
3. కొన్నిసార్లు, రోజులతరబడి రక్తస్రావం అయినప్పటికి, విచ్ఛిన్న పిండం పూర్తిగా బయటకు రాదు. చనిపోయిన పిండం ముక్కలుగా మీ గర్భంలో వుంటే, మీకు ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశం వుంటుంది. ఈరకమైన అసంపూర్ణ గర్భస్రావంలో వైద్య సహాయంతో మందులు వేసి నలేదా దానిని ముక్కలుగా కత్తిరించి బయటకు తీయటమే.
4. మీ గర్భస్రావం కనుక నొప్పితో కూడినదై వుంటే, పెయిన్ కిల్లర్లు వాడి నొప్పి తగ్గించుకోండి. ఆస్పత్రి చేరితే, వారి పర్యవేక్షణలో వుంటారు. అధిక రక్తస్రావం అయినప్పటికి ఇంతే చేయాలి. గర్భస్రావం తర్వాత రక్తహీనతకు కూడా మీరు పరీక్ష చేయబడతారు. ఆగకుండా రక్తం వస్తుంటే, రక్తం ఎక్కించవలసిన అవసరం కూడా వస్తుంది.
5. ఈ సమయంలో వైద్యలు కనీసం ఒక వారం నుండి పదిరోజులు విశ్రాంతి సూచిస్తారు. గర్భం ధరించిన ముందురోజులలోనే గర్భస్రావం అయితే, మీకు ప్రమాదం అధికంగా వుండదు.
6. ఈ సమయంలో మీరు మీ పార్టనర్ తో శారీరక సంబంధ చర్యలు చేయరాదు. మీ కటి ప్రదేశానికి కొద్ది వారాలు పూర్తి విశ్రాంతి నివ్వాలి. మీ కడుపులో పడిన గాయం నయమవ్వాలి.
7. ఈ సమయంలో మీరు కొన్ని మందులకు కూడా దూరంగా వుండవలసి వస్తుంది. ఇవి సాధారణంగా ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, మొదలైనవి. ఇవి మీ రక్తాన్ని మరింత పలుచబడేస్తాయన్న కారణాన, రక్తస్రావం అధికం అవుతుందన్న కారణంగా వీటిని వాడవద్దంటారు.
గర్భస్రావానికి శారీరక చికిత్స చాలా సులభం. కాని మానసిక నిరాశకు చికిత్స చాలా కష్టమైనది.



Click it and Unblock the Notifications
