Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ప్రెగ్నెంట్ మహిళలకు ఇచ్చుకొనే కొన్ని గిఫ్ట్ ఐడియాస్...
ప్రస్తుత కాలంలో సాధారణంగా సంతోషకరమైన ఏ సందర్భం వచ్చినా, (పుట్టిన రోజు, పెళ్ళిరోజు, మొదలగునవి) రకరకాల బహుమతులను ఇచ్చి వారి పట్ల తమకున్నా ప్రేమ, అప్యాయతను చాటుకొంటారు. అదేవిధంగా కొత్తగా తల్లి అయినప్పుడు కూడా కొంత మంది(భర్త, స్నేహితులు, అత్తమామలు, తోటి వారు)కొన్ని బహుమతులు ఇచ్చి వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. అయితే బహుమతలు ఆయా సందర్భాన్ని బట్టి బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి బహుమతలు ఇవ్వాలనే ఆలోచన అవసరం లేకుండా సందర్భాన్ని బట్టి ఎప్పింక చేసుకోవడమే.

అయితే అందరికీ బహుమతులు ఇవ్వడం ఒక ఎత్తైతే కొత్తగా తల్లి అయిన వారికి బహుమతలు ఇవ్వడం కొంచెం కష్టమే. ఎందుకంటే వారు మామూలుగా ఉన్నప్పుడు కంటే 10 కేజీల బరువు ఎక్కువగా, హార్మోనుల మార్పు వల్ల శరీరంలో మార్పులు ఏర్పడుతాయి. కాబట్టి ఎటువంటి బహుమతి తీసుకోవాలో ఇబ్బంది పడుతుంటారు. ఒక వేళ బేబీ షవర్ బహుమతులు కొనాలనుకొన్నప్పుడు ఏవి కొనాలనేది ఖచ్చితంగా తెలియకపోవచ్చు. కాబట్టి ప్రెగ్నెంట్ మహిళలకు ఇవ్వదగిని కొన్ని రకాల బహుమతులు లిస్ట్ మీకోసం కొన్ని...
బేబికి దుస్తులు: గర్భిణీకి బహుమతలు ఇవ్వదలచుకొన్నప్పుడు తనకు పుట్టబోయే బేబికి మంచి దుస్తులను గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు చాలా సంతోషపడుతుంది. అందంగా, చిన్న చిన్నగా క్యూట్ గా ఉండే దుస్తులు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. వీటిని బేబీ పుట్టిన తర్వాత కూడా ఇవ్వొచ్చు. బేబికి దుస్తులు కొనేపటప్పుడు బ్రైట్ కలర్ దుస్తులను ఎంపిక చేసుకోవడం వల్ల చాలా అందంగా ఉంటుంది.
అందమైన-సాఫ్ట్ గా ఉన్న బొమ్మలు: ఇటువంటి బహుమతులను చాలా మందికి నచ్చకపోవచ్చు. అయితే గర్భిణీగా ఉన్నప్పుడు ఇస్తే తప్పకుండా సంతోషంగా తీసుకోవడమే కాకుండా. పుట్టబోయే తనబిడ్డకు, గర్భిణీగా ఉన్నప్పుడు తల్లికీ సంతోషాన్ని కలుగజేస్తాయి.
వెచ్చగా ఉండే(అనిపించే) లో దుస్తులు: ఇంట్లో ఎవరైనా గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెకు ప్రత్యేకమైన వాతావరణం కల్పించడం చాలా అవసరం. అటువంటప్పడు చాలా మంది మహిళలు ప్రినేటల్ సమయంలో వారి అకారాన్ని చూపించుకోవడానికి అసౌకర్యంగా భావిస్తారు. కాబట్టి గర్భిణీ మహిళలకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ప్రెజెంట్ చేయవచ్చు. వాటిని ఆమె తప్పకుండా ఇష్టపడి, ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగి ఉంటుంది.
ప్రెగ్నెన్సీ బుక్స్: చాలా మంది చదువుకొన్న మహిళలు గర్భావస్తలో ప్రెగ్నెన్సీ గురించి చదువుకొని చాలా కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్ది శరీరంలో కలిగే మార్పులు, తల్లి, శిశువుకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత గర్భిణీ స్త్రీకి కలిగి ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బుక్స్ ను ప్రెజెంట్ చేయొచ్చు.
మామ్స్ డైరీ: సాధారణంగా చాలా మంది మొదటి సారి గర్భం ధరించే గర్భిణీ మహిళలు ఆ సమయంలో డైరీని మెయింటైన్ చేస్తారు. ప్రతి నెలలో వారి శరీరంలో ఇంటర్నల్ గాను, ఎక్సటర్నల్ గాను కలిగి మార్పలు, అనుభూతులు గురించి రాసుకొంటారు. కాబట్టి విజువల్ ఆల్బమ్ కలిగిన ప్రెగ్నెన్సీ బుక్ ను ప్రెజెంట్ చేయొచ్చు.
జువెలరీ: మీరు అతి త్వరలో తండ్రి కాబోతుంటే కనుక, మీ భార్య మీకు ప్రపంచంలో విలువ కట్టలేని బహుమతనిచ్చేటప్పుడు ఆమెకు ఓ అందమైన గిఫ్ట్ ను ఇచ్చి ఆమెను సంతోష పెట్టడం కూడా మీ భాద్యతే. మహిళలు ఎక్కువగా జువెలరీస్ ను ఇష్టపడుతారు కాబట్టి అటువంటి వాటిల్లో ఏదైనా మీరు బహుమతులు ఇవ్వొచ్చు...



Click it and Unblock the Notifications