Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
గర్భవతి మహిళ గాఢ నిద్ర!

1. విశ్రాంతి బాగా తీసుకోండి. ఎంత అధిక సమయం వీలైతే అంత అధికంగా మీ బెడ్ టైమ్ కు చేర్చండి.
2. ప్రతిరోజు రాత్రులందు ఒక సమయంలో నిద్రిస్తే మీకు, బిడ్డకు కూడా చాలా ప్రయోజనంగా వుంటుంది.
3. తల, మెడ ఎత్తులో వుండి పడుకునేలా చేసుకోండి.
4. మానసికంగా ఎటువంటి పీడకలలు మైండ్ కి రాకుండా చూడండి. దీనికి గాను మీకు గల భయాలు మీ పార్టనర్ కు తెలిపి హాయిగా రిలాక్స్డ్ గా వుండండి. రాత్రులందు డిన్నర్ అధికంగా చేయకండి.
5. మీ మోకాళ్ళకు పొట్టకు మధ్య అదనపు తలగడ వుంచండి. పడుకునే భంగిమ సౌకర్యంగా వుంటుంది.
6. మీరు పెట్టుకునే తలగడ పొడవుగా వుండి పొట్టనుండి మో కాళ్ళవరకు విస్తరించి సౌకర్యాన్ని కలిగించాలి. ఈ రకమైన తలగడ ప్రత్యేకించి మార్కెట్లలో లభ్యం అవుతుంది.
7. ఎడమవైపుకు తిరిగి పడుకోండి. గర్భాశయానికి కడుపులోని పిండానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. గుండెకు కూడా రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
8. గర్భిణీ స్త్రీ నెలలు నిండుతున్నాయంటే సరిగా నిద్రించలేదు. కనుక మంచి నిద్ర పట్టేంతవరకు టి.వి. చూడటం, వీనులవిందైన మ్యూజిక్ వినటం వంటివి చేయాలి.
9. గర్భిణీ స్త్రీలకు కాళ్ళలో నొప్పులు వస్తాయి. కొన్నిమార్లు రక్తప్రసరణ సరిగా లేక కొంకర్లు పోతాయి. అటువంటపుడు కాళ్ళను తిన్నగా పెట్టుకోవడం, బెడ్ పై పరుండినపుడు మోకాళ్ళను వంచి రక్తప్రసరణ బాగా జరిగేలా చూడాలి. బరువైన పనులు చేయరాదు. ప్రతిరోజూ వ్యాయామం, పోషక విలువలు కల ఆహారం వీరికి ప్రధానావసరాలు.



Click it and Unblock the Notifications
