Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతి ఆరోగ్యకర ఆహారానికి కొన్ని సూచనలు!

_ మీరు తినే ఆహారంలో కూరగాయలు, పండ్లు అధికంగా వుండేలా చూడండి. వాటి రంగులు దట్టంగా వుంటే విటమిన్లు అధికంగా వున్నట్లే.
- అవసరమైన ప్రొటీన్లను చికెన్, మాంసం, చేపలు, టోఫు లేదా తక్కువ కొవ్వు కల డైరీ ఉత్పత్తులనుండి పొందండి. మీరు శాకాహారి అయితే, ప్రొటీన్లు, విటమిన్ల అవసరాలు ఎలా అందించాలనేది తప్పక తెలుసుకోవాలి.
- మీకవసరమైన కార్బోహైడ్రేట్లు, గింజధాన్యాలనుండి అంటే, బ్రౌన్ రైస్, గోధుమ వంటివాటినుండి పొందండి. తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వలు వంటివాటిలో పోషకాలు వుండవు. అవి పాలిష్ పట్టబడి వుంటాయి. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
- కేలరీలు అధికంగా వుండే సోడాలు, కూల్ డ్రింకులు వంటివి అధికంగా తాగకండి. ఇవి ఆరోగ్యానికి హానికలిగిస్తాయి.
- ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తినకండి.
- ఆకలి వేసినపుడు, మీరు ఏది తింటే కడుపునింపి ఆరోగ్యం కలిగిస్తుందో వాటిని సరిగా ఆలోచించి తినండి.
- తినకూడని ఆహారాలను ఇష్టంగా తినేటపుడు, కొద్ది కొద్దిగా ఎక్కువ సమయం తినండి. దానివలన ఆ పదార్ధం తక్కువ తినే అవకాశం వుంటుంది.
-ఒత్తిడి, ఆందోళన, అలవాటు, బోర్ కొట్టినపుడు లేదా స్నేహితులకొరకు మీరు ఆహారాలను తినవద్దు. వీరి అవసరాలకు గాను ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. మీ చేతులు ఎపుడూ పనిపై వుంచండి. నడక, మంచి సంగీతం వినడం, వంటివి చేయండి.
- తినేటపుడు ధ్యాస మీ ఆహారంపై పెట్టండి. టెలివిజన్ చూస్తూ లేదా పుస్తకం చదువుతూ తింటే ఆహారం మీ వంటికి పట్టదు. మీరు తినినట్లు వుండదు.



Click it and Unblock the Notifications