Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పురుషులకు గర్భం అనుభవాలు?

ఒకసారి తన మహిళ గర్భవతి అని తెలియగానే పురుషుడు పొందే అనుభవాలు పరిశీలించండి.
సానుభూతి గర్భం - తన పార్టనర్ గర్భవతిగా వున్నపుడు, పురుషుడు కూడా వికారం, బరువు పెరగటం, మనోభావాల మార్పు వంటివి పొందుతాడు.దీనినే సానుభూతి గర్భం అంటారను. పురుషులు, తనకు పుట్టబోయే బిడ్డకు మనసులో తీవ్ర అనుబంధం కలిగి తాను శారీరకంగా అతనిని పొందలేకపోతున్నాననే భావన కలిగి వుంటారు. తన పార్టనర్ లాగానే తాను కూడా ఆందోళనలో అధికంగా తింటూ బరువు పెరుగుతాడు. డెలివరీలో సైతం అతని మనోభావాలు కూడా సాధారణంగా కంటే వేరుగా వుంటాయి. మహిళతో పాటు, తాను కూడా సిక్ అయిపోయిన రీతిలో ప్రవర్తిస్తాడు.
మహిళ ఒకసారి తాను గర్భవతిని అని చెప్పిందంటేచాలు, అతనికి కూడా ఆ లక్షణాలు మనో భావాలలో ప్రతిబింబిస్తూంటాయి. బిడ్డకు అవసరమైన అన్ని చర్యలు తాను చేపడుతూంటాడు. అతని డెలివరీ, పెంపకం, అన్నిటిని ప్రణాళిక చేస్తాడు. అంతేకాదు, బిడ్డ పుడితే వ్యయం అధికం కనుక, ఉద్యోగ మార్పుకై ప్రయత్నిస్తాడు. లేదా ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలని, ఒక కారు కొనాలని వంటివి కూడా ప్లాన్ చేస్తాడు. గర్భ నిర్ధారణ జరిగిందంటే చాలు వారి చుట్టూ వున్న ప్రపంచం మారిపోతుంది.
విషయాలు తెలుసుకోవడం - బిడ్డ పుటుక గురించిన సమాచారం అంతా సేకరిస్తాడు. పురుషులు తమ అనుభవాలలో గర్భవతి కి వచ్చే మానసిక లక్షణాలన్ని కూడా అనుభవిస్తారు. అంతేకాదు, పురుషులు కూడా మహిళలవలే, బేబీ తమ గర్భంలో వున్నట్లు భావించి, వివిధ రకాల రుచులు తినాలని కూడా ప్రయత్నిస్తారు.
రోగి మరియు తండ్రి - గర్భం నెలలు అధికమవుతున్నకొలది అతను గర్భం ధరించినట్లు భావిస్తూ, పడక కూడా వేసే అవకాశం వుంటుంది. బిడ్డ జన్మిస్తే, తాను తండ్రిగా ఎలా వుండాలనే రిహార్స ల్ సైతం వేసుకుంటాడు. ఇక తన మహిళకు ఆహారం ఇవ్వడం, నిద్రించేందుకు సహకరించటం, మెడిసిన్లు వేసుకోవటానికి సలహాలివ్వడం, వంటివి చేస్తాడు. కనుక మహిళలు సైతం ఇతని సహాయ సహకారాలను, ఆందోళనను బాగా ఆనందిస్తారు.
మనో వేదన, అసూయ - పుట్టబోయే బిడ్డ అవసరాలను ఎలా తీర్చాలా? అనే భాధ్యతపై అతను ఎంతో వేదన చెందుతాడు. అంతేకాదు, తన కడుపులోని బిడ్డపై తన మహిళ చూపుతున్న ప్రేమానురాగాలు తనపై చూపటం లేదని కూడా అసూయ చెందుతాడు. అప్పటివరకు ఎంతో స్వేచ్ఛగా గడిపిన అతను రాబోయే భాధ్యతలకు బెంగపెట్టుకుంటాడు. తనపై తన మహిళ చూపుతున్న ప్రేమకు మరొకరు పోటీగా వస్తున్నారనేది కూడా భావిస్తాడు.
ఎంతో ప్రత్యేకమైన ఈ గర్భవతి జీవిత దశలో పురుషులు కూడా ఎన్నోఅనుభవాల మార్పులకు గురవుతారు. తండ్రి అవటం అనేది పురుషుడిని ఎంతో మార్పు చేస్తుంది. అతను గతంలోకంటే మరింత భాధ్యతగా, ప్రేమగా వుండేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications