Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లావుగావుంటే... పిల్లలు పుట్టరా?

పొట్టలో కొవ్వు అధికంగా పేరుకుంటే దానినే లావెక్కటం లేదా అధికబరువు సంతరించుకోవడం అంటారు. శరీరం లావు అయిందంటే అది వారి శారీరక రూపాన్ని పాడు చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే, లావెక్కితే శరీరంలో సున్నితంగా వుండే హార్మోన్ల సమతుల్యతకూడా దెబ్బతింటుందని పరిశోధకులు చెపుతున్నారు. వాటిలో సంతానం కలుగకపోవటమనేది ఒకటి. మహిళలైనా, పురుషులైనా లావెక్కితే అది వారిలో సంతానలేమిని కలుగజేస్తుందనేది ఎలానో పరిశీలించండి.
శరీరంలో లావెక్కిన కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడితే అది పురుషులలోను, స్త్రీలలోను ఫలదీకరణ లేకుండా చేస్తుందంటారు వైద్యులు. శరీరంలోని ఆండ్రోజన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్లు సాధారణంగా మహిళ రుతుక్రమాన్ని నియంత్రిస్తాయి. మహిళ గర్భవతి అవ్వాలంటే ఈ హార్మోన్లు సమానంగా వుండటం అత్యవసరం. అండాశయంలో కొవ్వు నిల్వలు పేరుకుంటే అవి పిండం ఎదగటాన్ని నిరోధించి అబార్షన్ అయ్యేలా కూడా చేస్తాయని వైద్యులు చెపుతున్నారు.



Click it and Unblock the Notifications