Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతికి స్పా చికిత్సలు ఎంత సురక్షితం?

స్పా లో చేసే చికిత్సలు ఎలా వుంటాయి?
వెంట్రుకల తొలగింపు
మీ కనుబొమ్మలు, బికిని లైన్ వివిధ చికిత్సలతో షేప్ చేస్తారు. పై పెదవికి, కాళ్ళకు శరీర ఇతర భాగాలలోను గల అవాంఛనీయ వెంట్రుకలు తొలగిస్తారు. వెంట్రుకలు తీయాలంటే ప్రెగ్నెన్సీ సమయంలో వేక్సింగ్ మరియు ఎలక్ట్రోలిసిస్ చికిత్సలు సూచించదగినవి.
ఈ చికిత్సలతో మీకు తేలికగా వుంటుంది. ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్ గా వున్నపుడు మీ శరీరం ఎంతో సున్నితమవుతుంది. ఏ మాత్రం ఒత్తిడి కలిగినా బాధగా వుంటుంది. గర్భవతులు బ్లీచింగ్ మరియు డెపిలేటరీలు చేయించుకోరాదు. రసాయనాలు మీ శరీరంలోకి పీల్చబడతాయి. కనుక బ్లీచింగ్ వంటి వాటికి వీలైనంత దూరంగా వుండాలి.
ఫేషియల్స్
స్పా ఫేషియల్స్ సాధారణ చర్మ సమస్యలను తొలగించేందుకు సహకరిస్తాయి. మొటిమలు, దురద, మంట, ర్యాషెస్ మరియు స్ట్రెచ్ మార్కులు సాధారణంగా వుండే చర్మ సమస్యలు.గర్భవతికి హార్మోన్లు మారి ఆమె చర్మం మరింత సున్నితమవుతుంది కనుక చాలా జాగ్రత్త తీసుకోవాలి. అవసరమనుకుంటే ముందుగా అక్కడవాడే రసాయనాలను శాంపిల్ టెస్ట్ చేయించాలి. చిన్నపాటి పరీక్షలతో అవి అమెకు సరిపడతాయా? లేదా అనేది తెలిసిపోతుంది. సరిపడకపోతే, మంట పెడుతుంది. ఇక అపుడు ఆమె వాటిని విడనాడటం మంచిదిగా గ్రహించాలి.
హీట్ ట్రీట్ మెంట్లు - మడ్ బాత్, హాట్ వ్యాక్స్, మరియు సీవీడ్ రాప్ వంటివి కొన్ని సార్లు అధిక ఉష్నోగ్రతలను ఆమె శరీరంలో ఉత్పన్నం చేస్తాయి. కనుక మీ శరీర టెంపరేచర్ పెరగకుండా వీటిని చేయించుకోకపోవడం మంచిది. ఈ ఉష్ణోగ్రతలకు గర్భవతి శరీరం గురయితే, ఆమెకే కాదు కడుపులోని ఆమె పిండానికి సైతం హాని కలిగిస్తుంది. ఈ ట్రీట్ మెంట్లు సాధారణంగా 100 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత కలిగివుంటాయి. ఇక ఆమె లోపలి శరీర భాగాల ఉష్ణోగ్రత 100.7 ఫారెన్ హీటు డిగ్రీలవరకు చేరి హాని కలిగిస్తుంది.
ఈ చికిత్సలు ఆమె శరీరంలో టెంపరేచర్ పెంచటమే కాక, అధిక రక్తపోటును కూడా కలిగిస్తాయి. ఫలితంగా గర్భవతి మహిళ డీహైడ్రేషన్ కు కూడా గురయ్యే ప్రమాదం వుంటుంది. కొన్ని సమయాలలో అత్యవసర చికిత్సలు కూడా అవసరమవుతాయి. ఈ రకమైన శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరిగి డీహైడ్రేషన్ కలిగితే అది కడుపులోని బిడ్డకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగించే అవకాశం కూడా వుంటుంది. కనుక గర్భవతి మహిళ తాను స్పా చికిత్సలు చేయించుకునే ముందు తన వైద్యులను తప్పక సంప్రదించాలి. వారి ఆమోదంతో చికిత్సలు చేయించుకోవాలి.



Click it and Unblock the Notifications