Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.!
నేను గర్భం ధరించాను! ఎలా ?

స్వామికి తమ ప్రెగ్నెన్సీ తెలియపరచేందుకు కొన్ని మార్గాలు పరిశీలించండి.
చిన్ని దుస్తులు - నేను గర్భవతినయ్యానని మీ పార్టనర్ కు ప్రత్యేకంగా తెలుపాలనుకుంటే, మీరు చిన్ని దుస్తులు, చిన్ని బూట్లు వంటివి కొనండి. వాటిని అందంగా ప్యాక్ చేసి మీ పురుషుడు ఆఫీస్ నుండి రాగానే అతని చేతిలో పెట్టండి. ఆ ప్యాక్ అతనినే మీ ముందు తెరువనీయండి. అతని భావాలు పరిశీలించండి. తప్పకుండా అతను ఎంతో ఆనందపడతాడు.
ఆహారం - మీ పురుషుడు ఆహారం తినేటపుడు, బేబీ కేరట్స్ లేదా బేబే కార్న్ వంటివి పెట్టండి. టీ లేదా కాఫీ వంటివి చిన్ని కప్పులో పోసి ఇవ్వండి. లేదా ఒక కేక్ తయారు చేసి, దానిపై కొత్త డ్యాడీకి బహుమానం అంటూ అతనికి ఇవ్వండి. ఈ మార్గాలు మీ పార్టనర్ కి సైలెంట్ గా మీరు గర్భవతి అయినట్లు తెలుపుతాయి.
బొమ్మలు, బెలూన్లు - మీరు గర్భవతిని అని తెలియగానే, షాపింగ్ కు వెళ్ళండి, కొన్ని బొమ్మలు, బెలూన్లు కొనండి మీ గదిని వాటితో అలంకరించండి. మీ పార్టనర్ ఇంటికి రాగానే వాటిని చూపి ఏం జరిగిందో తెలుపమనండి. అతను తండ్రి కాబోతున్నాడన్న ఆనందం అతని ముఖంలో బాగా కనపడుతుంది.
షాపింగ్ కు తీసుకెళ్ళండి - కొత్త డ్యాడీని షాపింగ్ అంటూ బయటకు తీసుకెళ్ళండి. పిల్లల వస్తువుల దుకాణంలో అతనికి నచ్చిన బేబీ దుస్తులు కొనండి. నేను గర్భవతినయ్యాను అంటూ అతనికి చెవిలో చెప్పండి. అతని ఆనందం పరిశీలించండి.
పిల్లల బొమ్మల పోస్టర్లు, ఊయల - ఒక ఊయల మీ గదిలో వేయండి, బేబీ పోస్టర్లు కొన్ని గది గోడలకు అలంకరించండి. ఊయల మీ బెడ్ పక్కనే వేయండి. రూమ్ లాక్ చేయండి. మీ పార్టనర్ కళ్ళకు గంతలు కట్టి మీ రూమ్ లోకి తీసుకు వచ్చి గంతలు అలానే ఉంచి చేతితో ఊయల పట్టించి అదేమిటో చెప్పమనండి. గంతలు తీసివేసి పోస్టర్లు చూపి....నేను గర్భవతినయ్యానని చెపుతూ అతని ఆనందం పరిశీలించండి.
నేను గర్భవతిని అయ్యాను.....అనే మాటలు మీ పార్టనర్ కు చెప్పే సమయాన్ని మీరు ఆనందించాలి. ఆ క్షణాలు జీవితంలో మీకు ఒక ప్రత్యేకతగా ఉండాలి.



Click it and Unblock the Notifications