Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కడుపులో బిడ్డపై చెడు ప్రభావాలను చూపించే కాస్మోటిక్స్...

ప్రస్తుత ఆధునిక కాలానికి తగినట్లు గర్భిణీ స్త్రీలు కూడా వివిధ రకాల క్రీమ్‌లు, పెర్ఫ్యూమ్ లు, వంటి కాస్మాటిక్స్ ను వినియోగిస్తున్నారు. అయితే ఇది తల్లికే తెలియకుండా గర్భంలోకి వెళ్లి గర్భంలో పెరిగే పసికందుపై ప్రభావం చూపిస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది. అందులోనూ ముఖ్యంగా తల్లి కడుపులో పెరుగుతున్నది మగబిడ్డ అయితే, ఆ బిడ్డపై ఎక్కువ దుష్పలితాలు చూపిస్తున్నాయట. జ్ఞాపకశక్తి తగ్గుదల, శరీర అవయవాల పెరుగుదల ఇత్యాది అంశాలపై ప్రభావితం చూపిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది.
ఎనిమిదో వారం నుంచి 12వ వారం వరకు గల మధ్యకాలంలో గర్భంలో పెరిగే పిండంలో అవయవాల పెరుగుదల కనిపిస్తుందని, ఇలాంటి సమయంలో కొన్ని హార్మోన్లు పిండంపై ప్రభావం చూపడం వల్లే జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి లోపాలు కనిపిస్తాయని తేలింది. ఇవి ఎక్కువగా మగ పిల్లల్లోనే కనిపిస్తాయని పేర్కొంది. ఈ సమయంలో తల్లి ఉపయోగించే అలంకరణ వస్తువులు బిడ్డ యొక్క హార్మోన్ల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయట.
టెస్ట్రోస్‌రోన్ అనే హార్మోన్ మగవారిలో పునరుత్పత్తిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమైంది. దీనిపైనా ఈ సౌందర్య పదార్థాలు ప్రభావం చూపిస్తాయని ఈ సర్వే పేర్కొంది. ఈ సౌందర్య వస్తువులను మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అందువల్ల గర్భందాల్చిన మహిళలు ప్రసవం అయ్యేంత వరకు సౌందర్య క్రీములకు కాస్త దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications