Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
గర్భణీ మహిళలు కాఫీ, టీలు తాగకూడదా...?

గర్భం ధరించక మునుపు రోజుకు 5 లేదా 6 కప్పుల కాఫీ లేదా టీలు సేవిస్తుంటే వాటిని మానేయాలి. లేకుంటే అవి పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే వీటిని అధికంగా తీసుకోవడం వలన ఆకలి చచ్చిపోతుంది. మరో కారణమేంటంటే... సైడ్ ఎఫెక్ట్ కలిగి మీ శరీరం నుంచి నీరు, క్యాల్షియం బయటకు వెళ్ళిపోతుంది. దీంతో మీలో తెలియని నీరసం పుట్టుకొస్తుందంటున్నారు వైద్యులు.
కాఫీ, టీలు సేవిస్తుంటే మీరు సరిగా నిద్రపోలేరు. నిద్రలేమితో బాధపడుతుంటారు. వీటి కారణంగా శరీరంలో ఇనుము(ఐరన్) శాతం తగ్గిపోతుంది. శిశువు ఎదుగుదలకు పూర్తిగా అవరోధం కలుగుతుంది. శిశువు గుండె బలహీనంగా మారడంతోపాటు గుండె కొట్టుకోవడంలో క్రమం తప్పుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కాఫీ, టీలకు బదులుగా ప్రతి రోజు ప్రకృతి పరమైన పండ్లు తీసుకోండి లేదా పండ్ల రసాలను సేవిస్తుంటే మీ ఆరోగ్యంతోపాటు శిశువు ఆరోగ్యం బాగుంటుంది. దీంతో శిశువు ఎదుగుదల మరింత బాగుంటుందంటున్నారు వైద్య నిపుణులు. గర్భం ధరించిన తర్వాత ప్రతిరోజు ఒక పండు తింటుంటే మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతారని వైద్యులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications