Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
గర్భం అంటే పురుషుడికి భయమా?

గర్భం ధరించడమనే భయాన్ని టోకోఫోబియా అంటారు. కొంతమందికి పాములంటే, బల్లులంటే భయం. ఇది కూడా అటువంటి అర్ధం లేని భయమే. కొంతమంది మహిలలు తమకు 40 సంవత్సరాల వయసు వచ్చేవరకు గర్భాన్ని వాయిదా వేస్తూనే వుంటారు. కొంతమందికి ప్రాణ భయం వుంటే...చాలా మందికి మరల తమ శారీరక అందం తిరిగిరాదనే బెంగ కూడా వుంటుంది. మరి కొందరికి అమ్మ అయితే...తమ పార్టనర్ ఇక ఇష్టపడడని లేదా పుట్టబోయే బేబీ తమ జీవన శైలి మార్చేస్తుందని కూడా భయపడతారు.
దీనికంతటికి పరిష్కారం...సరైన సలహాలు కావాలి.
ఇక్కడే...సరిగ్గా మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ సహాయం ప్రధానంగా అవసరమవుతుంది. గర్భ ధారణ నుండి బిడ్డ పెరిగి పెద్దవాడయ్యేటంత వరకు ఆమెకు పురుషుడు అండగా వుండి అన్ని అంశాలలోను ధైర్యం కలిగించాలి. బిడ్డలు పుట్టి సంతోషంగా వున్న వారిని ఉదాహరణలుగా చూపాలి. పుస్తకాలు, టెలివిజన్ ఛానెల్స్ మొదలైన వాటిద్వారా అందులోని వారు అనుభవిస్తున్న ఆనందాలను వివరించాలి. గర్భం ధరించటమనే భయం అర్ధం లేనిదని, అదే కనుక శరీరానికి చెడును కలిగించేది అయితే, కోట్లాదిమంది పిల్లలను కనటానికి ఎందుకు సిద్ధ పడతారనే లాజిక్ తో వివరణ నిచ్చి ఆమె భయాన్ని పోగొట్టాలి.
గర్భవతి అయిన దశ నుంచి తల్లి దశ వరకు గల ఆనందాలను ఆమె అనుభవించేలా చేయాలి. నేను అందుకు సిద్ధంగా వున్నానా? నా శరీరం అందుకు సహకరిస్తుందా? ఈ విషయం అతనికెలా చెప్పాలి? అనేవి ప్రతి మహిళ తాను గర్భవతి అయిన తర్వాత ఎదుర్కొనే ప్రశ్నలు. అంతే కాదు కొంతమేరకు ఆందోళన పడటం కూడా సహజమే. అటువంటపుడు మహిళ పరిస్ధితిని ఏ రకంగా చక్కదిద్దుకోవాలో పరిశీలించండి!
రక్త పరీక్ష - గర్భం ధృవ పరచుకునేటందుకై రక్త పరీక్ష చేయించండి. గైనకాలజిస్టు ను సంప్రదించి కొన్ని సలహాలను తీసుకోండి. సమస్యలేవైనా వుంటే రక్త పరీక్షలో వెల్లడవుతాయి.
ఒకరికొకరు అభినందించుకోండి - గర్భం ధరించారని తెలియంగానే పురుషుడు కూడా సంతోష పడతాడు. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. సహకరించుకోండి. పురుషులు పైన పడుతున్న భాధ్యతలకు భయపడతాడు. గర్భాన్ని కొనసాగించాలనుకుంటే ఇద్దరూ ఆనందంగా కొనసాగండి.
వేక్సినేషన్ - చలికాలమైతే గర్భవతులకు ఫ్లూ, ఇతర ఇన్ ఫెక్షన్లు వచ్చి బిడ్డకు సోకే ప్రమాదముంది. కనుక వేక్సినేషన్ చేయించండి.



Click it and Unblock the Notifications