Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
మహిళలూ పని తగ్గించండి - విశ్రాంతి పెంచండి!

స్నాక్స్ గా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. ఏది తిన్నప్పటికి కొద్ది మొత్తాలలో రోజులో తరచుగా తినాలి. గర్భవతి మహిళ వివిధ రకాల ద్రవాహారాలను కూడా తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను పెంచటమే కాక, వాంతులను వికారాలను, సాధారణంగా ఈ సమయంలో మహిళలు పొందే మార్నింగ్ సిక్ నెస్ ను దూరం చేస్తుంది. డాక్టర్ వ్రాసిన మందులను లేదా విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ లు వంటివి రోజులో తప్పక తీసుకోవాలి.
ప్రతిరోజూ తగినన్ని పాలు, పాల ఉత్పత్తులు తాగాలి. పాలకు బదులు పన్నీర్ తీసుకున్నప్పటికి మంచి పోషకాహారంగా వుంటుంది. ఆహారంలో ప్రొటీన్ అధికంగా వుండాలి. మంచి ప్రొటీన్లు వుండే మాంసాహారం, అన్ని రకాల గింజలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, సోయాబీన్ తినాలి. ప్రతిరోజూ రెండు లేదా మూడు పండ్లు తినాలి. అవి నిమ్మ, ఆరెంజ్, అరటిపండు, మామిడి పండు, రేగిపండు వంటివాటిగా వుండాలి. ఆహారంలో పచ్చని ఆకు కూరలు, రంగురంగుల కూరగాయలు చేర్చండి.
ప్రెగ్నెంట్ మహిళ చేయకూడని పనులు అంటే....పచ్చి ఆహారాలు, సగం వండిన గుడ్లు, కూరగాయలు, మాంసం, వెన్నతీయని పాలు, జున్ను వంటివి తినరాదు. వీటివలన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం వుంది. ఆల్కహాల్, మత్తుమందులు వదలాలి. కేఫైన్ వీలైనంతవరకు తగ్గించాలి. రోజుకు 300 మి.గ్రా. కంటే కేఫైన్ తీసుకోరాదు. పొగ తాగటం లేదా తాగే వారి పక్కన వుండటం వంటివి చేయరాదు. ప్యాకేజ్ ఆహారాలు తినరాదు. వీటిలో వుండే నిలువ పదార్ధాలు బేబీకి హాని చేస్తాయి.
బొప్పాయి పండు తినరాదు, దీనిలోని పేపైన్ ఎంజైమ్ గర్భానికి సంకోచ వ్యాకోచాలు కలిగించి గర్భ విచ్ఛిన్నం చేస్తుందని రీసెర్చిలో తేలింది. విటమిన్లు, ఇతర ఔషధాలు తీసుకునముందు డాక్టర్ ను సంప్రదించాలి. గర్భం ధరించింది మొదలు, బిడ్డను ప్రసవించేటంతవరకు మహిల ఫోలిక్ యాసిడ్ అధికంగా వుండే ఆహారాలు తీసుకోవాలి. అవసరమైతే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడాలి. ఇది బిడ్డ బరువు పెంచుతుంది. పుటుక లోపాలను సరిదిద్దుతుంది. ఫోలిక్ యాసిడ్ పచ్చని కూరగాయలు, గింజధాన్యాలు, ఇతర పప్పులలో వుంటుంది. ఐరన్, కాల్షియం అధికంగా వుండే పదార్ధాలు తినాలి.



Click it and Unblock the Notifications