For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వంత అండంతో గర్భం సాధ్యమా?

By B N Sharma
|

నలభై సంవత్సరాల పైబడి గర్భం ధరించే వారికి గర్భానికి సంబంధించిన చాలా సమస్యలు వస్తాయి. నేటి కాలంలో, కుటుంబ సమస్యలు, ఉద్యోగాలు కారణంగా గర్భవతులవ్వటానికి కొంత వయసు మీరిపోతోంది. కాని ఆ విధంగా వయసు పైబడి గర్భం ధరించటం అందునా వారి స్వంత అండాలతో గర్భం ధరించటం అసాధ్యం అంటున్నారు నిపుణులు. ఎవరైనా నలభై సంవత్సరాలపైబడి గర్భధారణ పొందుతున్నారంటే ఎన్నో ఫెర్టిలిటీ ట్రీట్ మెంట్లకు గురి కావలసి వస్తోంది. అయితే దీనివలన కొన్ని లాభాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు -

 Pregnancy At Forty With Own Ovary!

1. నలభై సంవత్సరాలపైన లేటు గర్భ ధారణే కావచ్చు కాని నిపుణులు, ఆర్ధిక నిపుణులు, రిలేషన్ షిప్ కౌన్సెలర్లు దీనివలన చాలా ప్రయోజనాలున్నాయని కూడా చెపుతున్నారు. ఏమీ తెలియని వయసులో కంటే కూడా అన్నీ తెలిసిన వయసులో గర్భం ధరించటం ఎంతో మంచిదిగా వీరు భావిస్తున్నారు.

2. నలభై సంవత్సరాల పైన మహిళ అన్ని విషయాలలోను పరిపక్వత చెంది వుంటుంది. ఆర్ధికంగా స్ధిరపడి తన భవిష్యత్తుపై మంచి అవగాహన కలిగి వుంటుంది. ఉద్యోగంలో స్ధిరత్వం, ఆర్ధిక స్ధిరత్వం వుండటం వలన పిల్లల పెంపకం పెద్ద సమస్య కాబోదు. ఆమెకు పిల్లల పెంపకం తేలికగానే ఉంటుంది. సరైన సమాచారం కొరకు అప్పటికే ఆమె తన తోటి వారిని ఎందరినో సంప్రదించి సమాచారం పొంది ఉంటుంది.

3. అన్నిటికంటే పెద్ద లాభం అప్పటికే వారు తమ బంధువుల లేదా స్నేహితుల పిల్లల పెంపకాలు చూసి తమ పిల్లలకు అనువైన పెంపకాన్ని ఎంచుకుంటారు. తల్లిపాలు, బిడ్డ ఆహారం మొదలైనవి తెలుస్తాయి. పిల్లల పోషకాహారంపై స్వంత నిర్ణయాలు తీసుకోగలరు. అదే రకంగా వారు పెరిగి పెద్దవారైనప్పటికి వారికి అవసరమైన ఆధునిక చదువులు సమకూర్చగలుగుతారు.

4. చిన్న వయసులో పిల్లలు పుడితే, వారిని పెంచటంలో అనుభవ లేమి వుండి సరిగ్గా పెంచలేరు. అంతే కాక, నలభైలలో వుండే జంటలు వారిమధ్య బిడ్డకు సంబంధించిన మంచి అవగాహనలు కలిగి వుంటారు.

5. నలభై ఏళ్ళ మహిళ సాధారణంగా తన ఉద్యోగంలో అనుభవం సంపాదించి ఒక దశకు చేరుకుంటుంది. అవకాశం ఉంటే తాను ఒక ప్రమోషన్ సైతం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఎంతో సౌకర్యం కనుక ఇంటి భాధ్యతలకు మరింత సమయం కేటాయించగలదు. తన కింద పనిచేసే టీము వుంటారు. కనుక బిడ్డ పెంపకంపై ఉద్యోగ ప్రభావం పెద్దగా వుండకపోవచ్చు.

ఆలస్య లేదా వయసు మళ్ళిన గర్భధారణలు ఎంతో జాగ్రత్తతో వ్యవహరించాలి. అయితే దీనివలన కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు కూడా వున్నాయి. గర్భవిచ్ఛిన్నం తర్వాత మరోమారు గర్భం ధరిస్తున్నట్లయితే నిపుణులు సలహాలను పొందండి.

English summary

Pregnancy At Forty With Own Ovary! | నలభై ఏళ్ళకు గర్భం వస్తే?


 Women at the age of 40 would have accomplished success and had the taste of being a senior at workplace. They wouldn't worry much about work as their team can function through their assistance. By the time she attains forty years of age she may get a promotin or two also and it will be very convenient for her to look welfare side of her family.
Story first published: Monday, July 23, 2012, 12:24 [IST]
Desktop Bottom Promotion