Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భారతీయ మహిళకు గర్భధారణ సమాచారం

వీరికి ఈ అంశంపై ఎలా విద్య నేర్పించాలనేది పరిశీలిస్తే....
రెగ్యులర్ చెక్ అప్ లు ప్రధానమని తెలుపాలి. దీనివలన ముందుగా రాబోయే ఆరోగ్య సమస్యలు అధిగమించవచ్చు. తల్లికి ఈ సమయంలో వచ్చే మానసిక మార్పులు, ఆమె తీసుకోవలసిన పోషకాహారం, విటమిన్లు, శరీరంలో వచ్చే మార్పులు తెలుపాలి. ఈ సమాచారం ముందుగా తెలిస్తే ఆమెకు గర్భ ధారణలో వచ్చే అనేక సమస్యలు తీరిపోతాయి.
సోనోగ్రఫీ ప్రాముఖ్యత తెలుపాలి. తక్కువ బరువుతో బిడ్డ పుట్టటం, గర్భవిచ్ఛిన్నం వంటివి నివారించవచ్చు. ఈ పరీక్ష సుమారుగా 20 వారాల గర్భం తర్వాత చేస్తారు. ఈ సమయంలో, డాక్టర్లు గర్భ సంచి ఆరోగ్యకరంగా వుందా? గర్భాశయంలో బేబీ ఆరోగ్యకరంగా ఎదుగుతోందా అనేవి పరిశీలిస్తారు.
ఐరన్ కొరత గురించి మహిళకు తెలుపాలి. చాలామంది మహిళలకు ఐరన్ కొరత ఏర్పడుతుంది. ప్రెగ్నెన్సీలో మీ శరీరంలోని రక్తం పెరుగుతుంది. కనుక హేమోగ్లోబిన్ తయారవాలంటే అధిక ఐరన్ కావాలి. పోషకాహారం ఏం తీసుకోవాలి, ప్రత్యేకించి ఐరన్ కు ఏం తినాలి వంటివి ఆమెకు తెలుపాలి దీనివలన ఆరోగ్య సమస్యలు రాకుండా వుంటాయి. ఐరన్ అధికంగా వుండే గుడ్డు, పచ్చటి ఆకు కూరలు, ఎండు ఫలాలు, బీన్స్, గింజధాన్యాలు బాగా వీరు తినాి.
సిజేరియన్ ఆపరేషన్ గురించి ఈ ఆపరేషన్ తో బిడ్డ ఎలా పుడతాడనేది వారికి తెలియజెప్పాలి. ఆపరేషన్ అనంతరం ఇన్ ఫెక్షన్లు రాకుండా ఎలా జాగ్రత్తపడాలనేది తెలుపాలి. దీనివలన ఆమెలో రక్తహీనత కలుగకుండా చూడాలి. గర్భిణీ స్త్రీ సరైన ఆహారాలు, వ్యాయామం ఆచరించితే సిజేరియన్ ఆపరేషన్ అవసరం ఉండదు. సహజంగా యోని ద్వారానే ప్రసవం కావచ్చు.
గర్భవతి వ్యాయామాలు చేయటం అత్యవసరం. వీటితో ఆమె సహజ కాన్పు పొందగలదు. వ్యాయామాలు చేస్తే ఆమె సంతోషంగా వుండి ఆమెలోని ఎనర్జీ స్ధాయి పెరుగుతుంది. వెన్ను నొప్పి, మలబద్ధకం, ఒత్తిడి వంటివి దూరం అవుతాయి. కనుక ఆమెకు ప్రతిరోజూ ఆచరించగల ఒక చక్కటి వ్యాయామ, ఆహార ప్రణాళిక ఇవ్వాలి.



Click it and Unblock the Notifications