Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పిండం ఎదుగుదలకు సరైన ఆహారాలు!

గర్భవతి ప్రతిరోజూ మంచి పోషకవిలువలు కలిగిన సరైన ఆహారాన్ని సరైన మొత్తంలో తీసుకోవాలి. ఆమె తీసుకొనే ఆహారం, ఆమెకే కాక, పుట్టబోయే బిడ్డకు సైతం ఆరోగ్యాన్నిస్తుంది. తేలికగా డెలివరీ అవుతుంది. బేబీ పుట్టిన తర్వాత మరల మహిళ కోలుకోవాలంటే కూడా, గర్భస్ధ దశలో తినే పోషక విలువల ఆహారం పాత్ర అధికంగానే వుంటుంది. గర్భవతి అయిన తర్వాత బరువు ఎక్కువకావటం సహజమే.
అయితే, ఈ బరువు బిడ్డ బరువుకు తగినట్లుగా వుందా లేదా అనేది ఎప్పటికపుడు ఆమె చెక్ చేయించుకోవాలి. ఇలా చేస్తే, బిడ్డ పుట్టిన తర్వాత కూడా మహిళకు అధికబరువు సమస్యలుండవు. సాధారణంగా బిడ్డ కడుపులో వున్నపుడు మహిళ 9 నుండి 14 కిలోలవరకు అధికంగా బరువు ఎక్కే అవకాశం వుంటుంది. సరైన బరువు పొందిన మహిళకు గర్భస్ధ దశ ఎంతో తేలికగా ఉంటుంది. అంతేకాక ఆమెకు తగిన వ్యాయామం, ఆహారాలతో ఏరకమైన ఆరోగ్య సమస్యలు లేకుండా సహజ కాన్పు కూడా అయ్యట్లుగా ఉండగలదు.
గర్భవతి ప్రతిరోజూ తినే పోషకాహారంలో ఫోలిక్ యాసిడ్ తగినంత పరిమాణంలో తప్పని సరిగా వుండాలి. ఫోలిక్ యాసిడ్ లోపిస్తే కడుపులో వున్న బిడ్డకు శారీరక అంగవైకల్యాలు, లేదా ఇతర లోపాలు సంభవించే ప్రమాదం వుంది. ఫోలిక్ యాసిడ్ సాధారణంగా ఆచుపచ్చని ఆకు కూరలలో కావలసినంత దొరుకుతుంది. ప్రతిరోజూ తాజాగా వున్న ఆకు కూరలు వండి తింటే ఆమెకు ఈ సమస్య వుండదు. అంతే కాక ప్రొటీన్ అధికంగా వుండే మాంసాహారాలు, చికెన్, చేప, బీన్స్, పాలు, గుడ్లు మొదలైనవి కడుపులో వున్న బేబీకి కండరాలు, జుట్టు, చేతి గోళ్ళు, ఎముకలు, బ్రెయిన్ టిష్యూలు, రక్తం మొదలైనవి ఏర్పడటానికి బాగా సహకరిస్తాయి. గర్భవతి బిడ్డ ఎముకల ఎదుగుదల, పటిష్టతలకు గాను ప్రతిరోజు సుమారు 1200 గ్రాముల కాల్షియం తప్పక తీసుకోవాలి. తాజా పాలు ఉత్పత్తులు, పాలు బాగా తీసుకుంటే ఎముకలకు అవసరమైన కాల్షియం అందుతుంది. బిడ్డ బరువు ఆరోగ్యకరంగా వుంటుంది.
బిడ్డ బరువు తగినంతగా వుంటే, డెలివరీ తర్వాత బిడ్డకు వచ్చే ఆరోగ్య సమస్యలు వుండవు. కాబోయే తల్లి సమతుల ఆహారం తీసుకొని తాను ఆరోగ్యంగా వుంటూ, పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని అందించాలి. తినే ఆహారంలో ఐరన్ అధికంగా వుండే బెల్లం, పచ్చని ఆకు కూరలవంటివి తీసుకోవాలి. ఐరన్ మాత్రలు కూడా వేసుకోవాలి. బిడ్డ కడుపులో వున్నపుడు ఆమెకు 350 కేలరీల అదనంగా వుండవచ్చని వైద్యులు చెపుతారు. బేబీ పుట్టిన తర్వాత మరో మారు శరీరం వేగంగా పూర్వపు రూపం సంతరించుకోవాలంటే మంచి పోషక విలువలు కల ఆహారం గర్భవతి మొదటినుండి తీసుకోవాలి.



Click it and Unblock the Notifications