Latest Updates
-
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది!
గర్భవతి మహిళలలో ఒత్తిడి తగ్గాలంటే?

యోగాలో రకాలు
ఆసనాలు - ఆసనాలు అంటే శారీరక భంగిమలు. ఈ భంగిమలు వేస్తే కండరాల సరళత పెరుగుతుంది. శరీరం, మైండ్ రెండూ సమతుల్యత సాధించి శ్వాస ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు అనేక శారీరక, మానసిక, మరియు ఇతర మార్పులు పొందుతారు. ఒత్తిడి అధికంగా వుంటుంది. కనుక వీరికి యోగాసనాలు మంచివి. ఆసనాలు వెన్నెముకను బలపరుస్తాయి. శరీరాన్ని సరళంగా వుంచుతాయి. యోగా లో ఆసనాలు ఒత్తిడికి మంచివి.
ప్రాణాయామ - ఈ రకమైన యోగా గర్భవతి మహిళ శ్వాసకు మంచిది. అది అందరకూ తెలిసని మెళకువే. ప్రయోజనాలు అనేకం. కాబోయే తల్లికి శారీరక, మానసిక హాయినిస్తుంది. ఈ శ్వాస క్రియలో తాజా గాలిని లోపలికి తీసుకోవడం, బయటకు వదిలేయటం చేస్తారు. మీరు దీనికిగాను ఒక ముక్కు రంధ్రాన్ని మూసి, మరొక రంధ్రంతో గాలి పీల్చాలి. తెరచిన ముక్కు రంధ్రం మూసివేసి, మూసిన ముక్కును తెరచి గాలి వదలటం చేయాలి. ఆందోళన తగ్గించి నరాల వ్యవస్ధను బలపరుస్తుంది. ఇది ఒత్తిడికి బాగా పనిచేస్తుంది.
ధ్యానం - ఈ రకం యోగా తో గర్భిణీ మహిళ పూర్తి రిలాక్సేషన్ పొందుతుంది. ఒత్తిడి తగ్గేందుకు చాలా మంచిది. ఆందోళన, భయం, నరాల సమస్యలు తగ్గుతాయి. గర్భవతులు దీనిని ఆచరిస్తే సాధారణ కాన్పు జరుగుతుంది. మైండ్ ప్రశాంతంగా వుంటుంది. ఆందోళన స్ధాయి తక్కువవుతుంది. కాన్పు ఆరోగ్యకరంగా అవుతుంది.
యోగ నిద్ర - ఇది ఒక నిద్ర. గర్భవతులు తప్పక ఆచరించాలి. నిద్ర గాఢంగా వుంటుంది. కనుక కాబోయే తల్లికి ఎంతో మంచిది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. గర్భవతి ఎంతో ఆనందంగా వుంటుంది. డెలివరీ తేలికగా సహజంగా అవుతుంది. గర్భవతి చేసే యోగా బిడ్డ పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. యోగాలో తల్లి మైండ్ లో ఆలోచనలు, సరళంగా, పాజిటివ్ గా వస్తూంటాయి. ఒత్తిడిని అధిగమించేందుకు ఎంతో సహకరిస్తుంది.
ఇవి గర్భిణీ స్త్రీకి యోగా ఇచ్చే ప్రయోజనాలు. కనుక గర్భిణీ మహిళ వీటిని తప్పక ఆచరించి, సహజ కాన్పు పొంది బిడ్డను ప్రసవించాలి.



Click it and Unblock the Notifications
