Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సంతానలేమితో బాధపడేవారు గర్బం పొందే చిట్కాలు!
ప్రస్తుత రోజుల్లో గర్భం ధరించడం అంటే అంత సులభం కాదు. ఎందుకంటే జీవనశైలిలో అనేక మార్పలు చోటు చేసుకొన్నాయి. జంక్ ఫుడ్, నిద్రలేమి, పార్టీలు, మద్యపానం ఇటువంటి ఎన్నో దాంపత్య జీవితానికి అవరోధం కలిగిస్తూ, సంతనం పొందలేకపోతున్నారు. అందుకే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ సంతనం అంత సులభంగా జరగడం లేదు. దంపతుల్లో ఎటువంటి మేజర్ ఆరోగ్య సమస్యలు లేనప్పుడు ఒక్క సంవత్సరంలో సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకు ముఖ్యంగా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ, పురుషులు తీసుకొనే ఆహారం విషయంలో ఇద్దరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిఫెర్టిలిటి ఆహారాలకు ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడం వల్ల మీరు సంతానం పొందడానికి ఒక ఉతమైన మార్గం.
త్వరగా గర్భం పొందడానికి ఉపయోగపడే ఆహారాల్లో పుష్కలమైన పోషకాంశాలు ఉండే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాడి. అంతే కాదు మీరు తీసుకొనే ఫెర్టీలిటీ ఆహారాలు సరిగా తయారు చేసే విధానం కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ క్రింది పట్టికలో ఇచ్చిన ఆహారాలతో ప్రయోగం చేసిన కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వివిధ రకాల ఫెర్టిలిటి ఫుడ్స్ లో సీఫుడ్, కేలా, బాదా, మష్రుమ్ మొదలగునవి ఎక్కువగా ఉపయోగించాలి. ఈ ఫెర్టిలిటి ఫుడ్స్ ముఖ్యమైన న్యూట్రీషియన్స్ అంటే విటమిన్ డి, విటిమన్ ఇ, ఎ వంటివి పుష్కలంగా ఉన్నాయి . అంతే కాదు, వీటిలో ఇంకా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి మహిళల్లో గర్భం పొందడానికి బాగా సహాయపడుతాయి . గుడ్డు మరియు పుట్టగొడుగులలో ఉన్నజింక్ పుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంపొంధించడానికి సహాయపడుతాయి.
మరి త్వరగా గర్భం పొందడానికి అటువంటి బెస్ట్ ఫెర్టిలిటీ ఫుడ్ కొన్ని మీరు తెలుసుకోవడం కోసం...

మష్రుమ్ ఆమ్లెట్:
ఈ రిసిపి ఇటు పురుషులకు అటు స్త్రీలలో సంతానికి సహాయపడే ఒక గొప్ప ఫెర్టిలిటి ఫుడ్స్. గుడ్డు మరియు మష్రుమ్ లో ఉన్నటువంటి పుష్కలమైన జింక్ మరియు విటమిన్ డి పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థను పెంపొందించడానికి బాగా సహాపడుతాయి. ఈ ఆమ్లెట్ మరింత రుచికరంగా, పోషకాలు అందాలంటే ఇందులో పార్ల్సే మరియు థైమ్ వంటి గ్రీన్ లీఫ్ ను కలపాలి.

బాదం బక్ వీట్ పాన్ కేక్:
బాదంలో పుష్కలమైన విటమిన్ ఇ ఉంది. ఇది సంతానవ్రుద్దికి బాగా సహాయపడుతుంది. మరి బాదంతో మరో అద్భుతమ ఫెర్టిలిటి ఫుడ్ బక్ వీట్ తో పాన్ కేక్ తయారు చేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిల్లలకోసం ప్రయత్నం చేసే వారు ఇటువంటి ఆహారాలకు ప్రాధన్యం ఇవ్వడం మంచిది.

దానిమ్మ:
మేల్ ఫెర్టిలిటికి అద్భుతమైన ఆహారం దానిమ్మ. ఇందులో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. లోఫ్యాట్ మిల్క్ మరియు దానిమ్మ గింజలను స్మూతీగా తయారు చేసి ఉదయం పూట తాగడం వల్ల కడుపు నిండుగా మరియు నిడైన పోషకాలు అందుతాయి. ఇది సంతానప్రాప్తిని కలిగిస్తుంది.

సాల్మన్ ఫిల్లెట్:
సాల్మన్ ఫిష్ టాప్ ఫెర్టిలిట్ ఫుడ్. తాజా సాల్మన్ ను అల్లం తరుము, వెనిగర్ మరియు పెప్పర్ తో మ్యారినేట్ చేసి అరగంట పక్కన పెట్టి, తర్వతా గ్రిల్ చేసి లేదా పాన్ లో వేగించుకొని తినవచ్చు. సంతానాభివ్రుద్దికి ఇది బాగా సహాపడుతుంది.

కేలా కీసర్ సలాడ్:
కేలా గ్రీన్ లీఫ్ లో పుష్కలమైన విటమిన్ కె ఉంది. ఇది సంతానం కలిగించడానికి బాగా సహాయపడుతుంది. పచ్చికేలా మరియు సిట్రస్ పండ్లను ఉపయోగించి, చిలికిన లోఫ్యాట్ పెరుగు మిక్స్ చేసి సలాడ్ గా తయారు చేసి ఉదయం, మద్యహ్నా భోజనంలో తీసుకోవడం మంచిది.

చీజ్ తో తయారు చేసిన సాండ్విచ్:
చీజ్ లో క్యాల్షియం అధిక శాతంలో ఉంది. ఇది మహిళలకు చాలా అవసరమైనటువంటి పోషకాంశం. టమోటో, ఉల్లిపాయ, క్యారెట్ వంటివి మిక్స్ చేసి సాండ్ విచ్ ను తయారు చేసి, దాని మీద లోఫ్యాట్ చీజ్ రాసి, 60శాతం పవర్ లో 2నిముషాలు గ్రిల్ చేసి తర్వత తినాలి.

గ్రిల్డ్ గార్లిక్ ఓస్ట్రెయిస్:
ఓస్ట్రెయిస్ ఒక అద్భుతమైన ఫెర్టిలిటి ఫుడ్. పురుషుకు అవసరం అయ్యే జింక్ ఇందులో పుష్కలంగా అభ్యం అవుతుంది. ఈ ఓయిస్ట్రెస్ ను ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి పేస్ట్ తో మ్యారినేట్ చేసి, గ్రిల్ చేసి తినాలి. మీకు అవసరం అనుకుంటే పచ్చిమర్చి పేస్ట్ కూడా ఉపయోగించుకోవచ్చు.

గ్రీన్ హెర్బ్ జ్యూస్:
గర్భం కోసం ప్రయత్నించే వారు, కెఫిన్ ను నివారించాలి. కెఫినేటెడ్ ఆహారాలకు దూరంగా ఉండి తాజా జ్యూస్ లు మరియు ఆకుకూరలను తీసుకోడం ఉత్తమం.

గ్రీన్ లీఫ్ విత్ చికెన్ సలాడ్:
ఉడికించిన చికెన్ లో అధిక శాతంలో ప్రోటీనుల ఉంటాయి. మరియు చాలా తక్కువ పరిమాణంలో ఫ్యాట్స్ ఉంటాయి. గ్రీన్ లీఫ్ అంటే కేలా, ఆకుకూరలు లెట్యూస్ వంటివాటిని చికెన్ తో మిక్స్ చేయడం వల్ల మీకు సరిపడే విటమిన్ కే మరియు ఐరన్ లభిస్తుంది. ఈ రెండూ కూడా స్త్రీలకు చాలా అవసరం. ఆలివ్ ఆయిల్ తో తయారు చేసి ఈ సలాడ్ ను తీసుకోవడం వల్ల ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను కూడా పొందవచ్చు.

లెమన్ ప్రాన్స్:
ఫ్రాన్స్ లో తాజా సీ మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు జిక్ పుష్కలం. ప్రాన్స్ ను నిమ్మరసం, వెల్లుల్లిపేస్ట్, రోజ్ మెరీ ఆయిల్ తో మ్యారినేట్ చేసి తక్కువ మంట మీద ఫ్రై చేసితినాలి.



Click it and Unblock the Notifications











