Latest Updates
-
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - మంగళవారం, 28 ఏప్రిల్ 2026 -
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రెగ్నెన్సీ..మొదటి 3 నెలల్లో గ్రహించాల్సిన కొన్ని విషయాలు..!
మొదటి సారి గర్భం ధరించేవారికి గర్భం ధరించిన తర్వాత నిర్ధారించుకోవడానికి తికమకపడుతుంటారు. ఈ విషయం కరెక్టా కాదా? అని తెలుసుకొనేందుకు గందరగోళం చెందుతుంటారు. ఒక ప్రక్క వేవిళ్ళు మరియు వికారం మరియు మార్నింగ్ సిక్ నెస్(ఉదయం నిద్రలేవగానే అలసటగా ఉండటం)జరిగిపోతుంటాయి. ఇన్ని లక్షణాలున్నప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి కదా? మీరు మొదటి సారి గర్భం ధరించినట్లైతే మీకు గర్భాధారణ గురించి ఎటువంటి అనుభవం ఉండదు.
కానీ, మీరు గర్భం ధరించారని నిర్ధారించుకోవడానికి..మొదటి మూడు నెలల్లో మీరు ఎలా ఉండాలో తెలిపే కొన్ని మార్గదర్శాలను మీకు అందిస్తున్నాం. ఈ మార్గదర్శకాలు. ఈ గైడ్ లైన్స్ మీరు గర్భం ధరించిన సమయంలో చాల ఉపయోగపడుతాయి. గర్భం అనేది ఒక నిజమైన వైద్యఅనుభవం. కాబట్టి గర్భం ధరించాక వచ్చే వేవిళ్ళకు మరియు గర్భం నిలిచిందని (ప్రెగ్నెన్సీ లక్షణాలు)తెలుసుకోవడానికి పాతకాలపు పద్దతులు మీద ఆధారపడవల్సిన అవసరం లేదు. అందుకు కొన్ని వైద్య మరియు వ్యక్తిగత సలహాలను పాటించిటం లేదా తెలుసుకోవడం చేస్తే మొదటి మూడు నెలలు మీకు సులభంగా ఉంటుంది.
గర్భం ధరించిన తర్వాత వాటి లక్షణాలు ఒక్కో స్త్రీలో ఒక్కో విధంగా ఉంటాయి. అయినా కూడా అందరిలోనూ కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి.
గర్భం ధరించిన తర్వాత మొదటి మూడు నెలల్లో మీలో గందరగోళం మరియు ఆత్రుతగా ఉన్నట్టు అనిపిస్తుంటే.. వాటిని నుండి ఉపశమనం పొందడానికి..మొదటి మూడు నెలలూ మీరు సంతోషంగా గడపడానికి ఈ కొన్ని గైడ్ లైన్స్ సహాయపడుతాయి. మరి అవేంటో ఒక సారి చూసేద్దాం...

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో: ఆశించేవి ఏమిటి
వేవిళ్ళు: గర్భం ధరించారని తెలిపే మొదటి లక్షణం తరచూ వేవిళ్ళు. మార్నింగ్ సిక్ నెస్..వేవిళ్ళకు కు కొన్ని మందులు కొంత వరకు మాత్రమే సహాయపడుతాయి.

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో: ఆశించేవి ఏమిటి
అసిడిటి: గర్భాధారణ సమయంలో మీ జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఈ సమయంలో మీకు అజీర్ణం మరియు యాసిడ్ రిఫ్లెక్సన్ అనేవి అనుభపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఈ సమస్యకు డాక్టర్లు యాంటిఆసిడ్ ను తీసుకోమని చూచిస్తుంటారు. కానీ ఇవి ప్రతి రోజూ వేసుకోవడానికి అలవాటు చేసుకోకూడదు.

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో: ఆశించేవి ఏమిటి
ఆహార కోరికలు: గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో మీరు ప్రతి ఒక్కటీ వాసనను ఇట్టే పట్టేయగలరు అంతే కాదు సువాసనలు వల్ల మీరు ఆ ఆహారాలను తినాలనే కోరిక పెంచుతుంది. ఇది సాధరణంగానే అనిపించినా మీకు కొన్ని ఇష్టమైన ఆహారాల మీద విరక్తి చెంది ఉంటారు. అందుకు ఎక్కువ ఘాటైన సువాసనలు లేని ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. గర్భాధారణ సమయంలో బంగాళదుంప, పప్పులు వంటివి ఆరోగ్యకరమైన ఆహారాలు.

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో: ఆశించేవి ఏమిటి
గర్భం ధరించలేదేమోనన్న ఫీలింగ్: మొదటి సారి గర్భంధరించినప్పుడు ప్రస్తుత లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించి కూడా ప్రెగ్నెన్సీ నిర్ధారణ కాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ కిట్ లో చూపించే డార్క్ లైన్ ఒక్కటే గర్భాధారణ జరిగిందని నిర్ధారించడానికి సరిపోదు.

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో: ఆశించేవి ఏమిటి
కడుపు నొప్పి: గర్భం ప్రారంభంలో మీ గర్భాశయ ప్రాంతంలో కొంత నొప్పితో కూడి బాధ కలగవచ్చు. ఇది గర్భాశయ కండరాలు విస్తరించడానికి మరియు మలబద్దకానికి గురైయనప్పుడు ఇటువంటి నొప్పి తరచూ వస్తుంటుంది. కాబట్టి మీ డాక్టర్ తో సంప్రదించి అందుకు గల కారణం ఏంటో కనుక్కోవాలి.

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో: ఆశించేవి ఏమిటి
హార్మోన్ టెస్ట్: ప్రెగ్నెన్సీకి హార్మోన్ టెస్ట్ లేదా హెచ్ సిజి టెస్ట్ చాలా అవసరం. ఈ టెస్ట్ ను మీరు గర్భం ధరించిన 5 లేదా 6వ వారంలో జరపబడుతుంది. ఈ టెస్ట్ వల్ల మీరు గర్భం ధరించి ఎన్నరోజులైందని నిర్ధారించవచ్చు.

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో: ఆశించేవి ఏమిటి
స్కానింగ్: ఈ స్కానింగ్ మీరు గర్భం ధరించిన 7-8వారాల్లో చేయించాలి. దీని వల్ల గర్భంలో పిండం యొక్క అమరిక మరియు కరెక్ట్ పొజీషన్ లో ఉన్నదా లేదా అని తెలుపుతుంది. దాంతో పాటు శిశువు యొక్క హార్ట్ బీట్ ను కూడా కనుగొనవచ్చు.

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో: ఆశించేవి ఏమిటి
రక్త పరీక్ష: యాంటినేటల్ బ్లడ్ టెస్ట్ లో 6 డిఫరెంట్ టెస్టులు ఉన్నాయి. అవి మీ రక్తం యొక్క గ్రూపును, రక్తంలోని యాంటీబాడీస్ ను, హెచ్ ఐవి, వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ మరియు సిఫిలిస్ తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ లు చేస్తారు.

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో: ఆశించేవి ఏమిటి
భయం మరియు మానసిక రుగ్మతలు: గర్భం ధరించాక భయం లేదా మానసిక రుగ్మతలు హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్లనో లేదా స్కానింగ్ కారణంగానో లేదా బ్లడ్ టెస్ట్ కారణంగానో అలా అనిపించవచ్చు. ఈ భావోద్వేగాలు గర్భాధారణలో సాధారణంగా భరించవలసి ఉంటుంది. కాబట్టి మీ డాక్టర్ మీద నమ్మకం పెట్టి, వారి సూచించే సలహాలను తప్పక పాటించాలి.

గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో: ఆశించేవి ఏమిటి
గర్భధారణ స్వీకరించడం: ఇవన్నీ తెలుసుకొన్నాక మీరు గర్భవతి అని స్వీకరించాలి. అందుకు అనుకూలంగా మీ మనస్సు మార్చుకోవడం చాలా అవసతరం. మాట్లాడుతూ మెట్లు ఎక్కడ మానుకొని లిప్ట్ ను ఉపయోగించాలి, ఆత్రుతగా నడవకూడదు, గర్భధారణ సమయంలో సౌకర్యవంతమైన పాదరక్షలు ధరించాలి.



Click it and Unblock the Notifications