గర్భిణీస్త్రీ మొదటి త్రైమాసికంలో తీసుకోవల్సిన హెల్తీ ఫుడ్స్

సాధారణంగా మహిళలకు గర్భధారణ ఒక ప్రకృతి ప్రసాధించిన ఒక వరం. ఈ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్బ పొందారని నిర్ధారించుకొన్న వెంటనే మీ లైఫ్ స్టైల్ తో పాటు, కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా గర్భం పొందిన మహిళ మొదటి మూడు నెలలు తీసుకొనే ఆహారం చాలా ప్రధానమైనది. అలాగే మొదటి మూడు నెలల్లో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను కూడా నివారించాల్సి ఉంటుంది. కొన్ని హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి ఆహారాలను క్రింది లిస్ట్ లో ఇవ్వబడింది. ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్లో మీరు తీసుకొన్నట్లైతే మీరు మొదటి త్రైమాసికంను సురక్షితంగా పూర్తి చేయవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భిణీ స్త్రీలు ఏది కూడా అధికంగా తీసుకోవకూడదు. ఎందుకంటే, అది పొట్టలో పెరగిగే పిండం(శిశువు)కు అంత మంచిది కాదు. మరియు ఇతర సమయాల్లో తీసుకొన్న ఆహారాల్లో కొన్ని ఆహారాలు గర్భధారణ సమయంలో తీసుకోవడం, గర్భిణీ స్త్రీకి అంత ఆరోగ్యకరమైనవి కావు. అటువంటి ఆహారాలు, కడుపులో పెరుగుతున్న శిశువు మీద క్రమంగా ప్రభావాన్ని చూపుతుంది.

గర్భం ధరించిన మొదటి మూడు నెలలో చాలా ముఖ్యమైన దశ. గర్భం ధరించిన ప్రారంభ దశలో శరీరానికి కావల్సిన పోషకాహారాల అవసరాలను గుర్తించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ప్రత్యేకంగా నిబంధనలతో ప్రెగ్నెన్సీ డైయట్ ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో గర్భం ప్రోటీన్ మరియు క్యాల్షియం ఆహారాలను ప్రధానంగా చేసుకుంటుంది. ఇవి గర్భంలోని బిడ్డ వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. మొదటి మూడు మాసాల్లో తీసుకొనే ఆహారంలో ప్రోటీనులు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీనులు ఒక జీవికి ప్రాణం పోస్తుందనడంలో ఆశ్చర్యం కలిగిస్తుంది.

అంతే కాదు మొదటి మూడు నెలల్లో కడుపులో బిడ్డ పరిమాణం కూడా వేగంగా పెరుతుంది. మొదటి మూడు నెలల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారం చాలా అవసరం. కడుపులో బిడ్డ తల్లి యొక్క రక్తం శోషణ ద్వారా పెరుగుతుంది. అందుచేత మీరు మీ గర్భం ధరించిన ప్రారంభ దశలో అంటే మొదటి త్రైమాసికంలో పూర్తి పోషకాంశాలతో నిండిన హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి మొదటి మూడు నెల్లో తీసుకోవల్సినటువంటి అత్యుత్తమ ఆహారాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించండి....

1. గ్రీన్ లీఫ్స్:

1. గ్రీన్ లీఫ్స్:

ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియం మరియు ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.

2. లెంటిల్స్(చిరుధాన్యాలు):

2. లెంటిల్స్(చిరుధాన్యాలు):

కాయధాన్యాలు, దాదాపు అన్ని రకాల కాయధాన్యాలను గర్భధారణ సమయంలో తీసుకోవచ్చు. కాయధాన్యాలలో ప్రోటీలను పుష్కలంగా ఉంటాయి. ఇది ఫీటస్ మరియు మజిల్స్ పెరుగుదలకు బాగ సహాయపడుతాయి.

 3. ఆరెంజ్:

3. ఆరెంజ్:

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని పెంపొంధిస్తుంది. మరియు ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది. సిట్రస్ పండ్లలో విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అలసట నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన పానీయాలు అంటే ఆరెంజ్ జ్యూస్ వంటివి సేవించాలి.

4. బాదం:

4. బాదం:

బాదాంలో విటమిన్ ఇ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా బాగా సహాయపడి గర్భిణీ స్త్రీ మరికొన్ని అదనపు ప్రోటీనులను మొదటి మూడు నెలల్లో పొందుతుంది.బాదాంలో యాంటిఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండి, బాడీ మెటబాలిజంను పెంచుతుంది, ఆకలి కోరికను తగ్గిస్తుంది మరియు కడుపు పిండం ఆరోగ్యంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది.

5. పనీర్:

5. పనీర్:

మీకు కాటేజ్ చీజ్ ఇష్టమైతే మీరు మొదటి త్రైమాసికంలో ఎంజాయ్ చేవచ్చు. పనీర్ లో పుష్కలమైన క్యాల్షియం ఉంటుందంటారు. ఇది శిశువు ఎముకలకు మరియు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి.

6. ఆస్పరాగస్:

6. ఆస్పరాగస్:

మీకు తెలిసే ఉంటుంది. డి విటమిన్ వల్లే మన శరీరంలో క్యాల్షియం ఉత్పత్తి అవుతుందని. ఆస్పరాగస్ లో డి విటమిన్ పుష్కలంగా ఉండి. మరియు ఇందులో ఉండే ఆరోమాటిక్ ఫ్లేవర్ మార్నింగ్ సిక్ నెస్ ను పోగొడుతుంది.

7. గుడ్డు:

7. గుడ్డు:

అత్యధిక శాతం న్యూట్రిషియన్స్ కలిగినటువంటి గుడ్లలో విటమిన్ డి మరియు విటమిన్ బి12 మరియు ప్రోటీనులు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ ఆహారంతో తీసుకోవడం చాలా ముఖ్యం.

 8. బ్రొకోలీ:

8. బ్రొకోలీ:

బ్రొకోలీ గ్రీన్ సూపర్ ఫుడ్. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని మొదటి మూడు నెలలు తీసుకోవడం చాలా మంచిది. దీని తినడం వల్ల తల్లికి కావల్సిన ఐరన్ అంధించడమే కాకుండా అధిక రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

 9. బీన్స్:

9. బీన్స్:

అన్ని రకాల బీన్స్ ప్రెగ్నెంట్ మహిళకు చాలా మంచిది . ఇది మొదటి త్రైమాసిక గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది. బీన్స్ లో ప్రోటీనులు అధికం మరియు ఇది తగినంత ఎనర్జీని అంధిస్తుంది. మరియు మొదడు పెరుగుదలకు సహాయపడుతుంది.

10. పెరుగు:

10. పెరుగు:

డైరీ ప్రొడక్ట్స్ లో అధిక శాతంలో క్యాల్షియం ఉంటుంది. సాధారణంగా పాలు తీసుకొనే కంటే పెరుగు, మజ్జిగా తీసుకోవడం చాలా మంచిది. కొంత మందికి పాలు త్రాగడం ఇష్టం ఉండదు. అటువంటి వారు మజ్జిగ పెరుగు తీసుకోవడం వల్ల కడుపు ప్రశాంతంగా ఉంటుంది. పెరగులో క్యాల్షియం మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పెరగులో ఉండే ప్రొబైటిక్ బ్యాక్టీరియా అలసటతో పోరాడుతాయి మరియు జీవక్రియను శుభ్రం చేస్తాయి.

11. బెండకాయ:

11. బెండకాయ:

బెండకాయ అరుదుగా తింటారు. అయితే ఇందులో ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. బెండకాయలోని ఫోలిక్ యాసిడ్స్ పుట్టుకతో లోపాలను నిరోధిస్తుంది. మరియు ఇది గర్భధారణ సమయంలో మధుమేహానికి గురైయ్యే మహిళలకు చాలా మంచి చేస్తుంది థ ఫోలిక్ యాసిడ్.

12. లీన్ మీట్:

12. లీన్ మీట్:

గర్భధారణ సమయంలో తీసుకొనే మంచి మాంసాహారం అంటే చికెన్. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం తగినంత ఆక్సిజన్ గ్రహించేలా చేస్తుంది. అంతే కాదు, మార్నింగ్ సిక్ నెస్(కడుపులో తిప్పడం, నీరసంగా ఉండటం, వాంతి వచ్చేట్లు ఉండటం) ఉన్నట్లైతే చికెన్ బెస్ట్ ఆప్షన్ గా చెబుతారు. ఇందులో అధిక శాతంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిని నిర్వహించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.

13. కాలే/సేజ్:

13. కాలే/సేజ్:

కాలేలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది.

14. సాల్మన్: చేపలు:

14. సాల్మన్: చేపలు:

గర్భాధారణ సమయంలో చాలా మంది సీ ఫుడ్ (ఫ్రాన్, క్రాబ్స్) తినడానికి ఇష్టపడరు. అయితే సీ ఫిష్ లో సాల్మన్, తున మరియు క్యాట్ ఫిష్ వీటిలో విటమిన్ డి మాత్రమే కాదు కాల్షియం, ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మొదటి మూడు నెలలు చేపలు తినడం మంచిది.

15. బీఫ్:

15. బీఫ్:

బీఫ్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు, అయితే, మొదటి త్రైమాసికంలో లీన్ బీఫ్ తీసుకోవచ్చే. ఐరన్ పుష్కలంగా అందుతుంది.

Story first published: Wednesday, November 27, 2013, 14:04 [IST]
Desktop Bottom Promotion