For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ నార్మల్ డెలివరీ కోసం కొన్ని ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ టిప్స్

|

గర్భిణీ అయినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు, అపోహలు స్త్రీని చుట్టుముడతాయి. కుటుంబసభ్యులు, ఇంట్లో ఉండే పెద్దవారు చాలావరకు ఆ అనుమానాలు తీర్చగలిగినా అందరి దృష్టి తొమ్మిది నెలలు నిండాక అయ్యే ప్రసవం మీదే కేంద్రీకృతమై ఉంటుంది. డాక్టర్ని కలిసినప్పుడల్లా ‘డెలివరీ ఎలా అవుతుంది?'అనే ప్రశ్న ఏదో ఒక సందర్భంలో తప్పక అడుగుతుంటారు. ఈ ప్రశ్నకు చాలాసార్లు డాక్టర్ దగ్గర కూడా జవాబు ఉండదు.

పది శాతం మంది స్త్రీలలో మాత్రమే తొమ్మిదో నెల నిండకముందే నార్మల్‌గా డెలివరీ అవడం కష్టమని, ఆపరేషన్ ద్వారా మాత్రమే బిడ్డను తీయగలుగుతామని డాక్టర్ స్పష్టంగా చెప్తారు. పెల్విస్ లేదా స్పైనల్‌కార్డ్‌లో లోపాలు, గర్భసంచికి పూర్వం జరిగిన ఆపరేషన్, ఇన్ఫెక్షన్ సోకడం, కుట్లు బలహీనంగా ఉండటం, బిడ్డ ఎదురు కాళ్లతో ఉండటం, మాయ కిందకు ఉండటం, వెజైనాలో ఇన్ఫెక్షన్లు ఉండటం... వంటివి ఆపరేషన్‌కి కొన్ని కారణాలు. మిగిలిన తొంభై మంది స్త్రీలలో తొమ్మిది నెలలు నిండాక వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా డాక్టర్ బిడ్డ వచ్చే దారిని ఎసెస్ చేస్తారు.

అయితే చాలా మంది స్త్రీలు సిజేరియన్ కంటే నార్మల్ డెలవరీనే ఎక్కువగా కోరుకుంటారు. నార్మల్ డెలివరీ కోరుకొనే వారు గర్భందాల్చినప్పటి నుండి సరైన జాగ్రత్తలు, డైట్, ప్రెగ్నెన్సీ వ్యాయామం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ సాధ్యం అవుతుంది. మొదటిసారి గర్భం ధరించే స్త్రీలకు డాక్టర్స్ ఖచ్చితంగా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్స్ ను తీసుకోమని సలహాలిస్తుంటారు. గర్భణీలు, గర్భధారణ సమయంలో అదనపు బరువు పెరగకుండా, నార్మల్ డెలివరీ జరగనివ్వకుండా చేసే కొన్నిరకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. గర్భిణీలు నార్మల్ డెలివరీ గురించి తెలుసుకోవాలి నేచురల్ మరియు సైకలాజికల్ ప్రొసెస్ అని, ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో ఇది సహజం అని తెలుసుకోవాలి. అలా కాకుండా, పరిస్థితి విషమించినప్పుడు మాత్రమే సిజేరియన్ కు సిద్దపడుతారు లేదంటే నార్మల్ డెలివరీ సాద్యమే...

నార్మల్ డెలివరీ పొందడానికి కొన్ని హెల్తీ ప్రెగ్నెన్సీ టిప్స్..

హెల్తీ డైట్:

హెల్తీ డైట్:

మీరు గర్భం ధరించారని నిర్దారించగానే, మొదట మీరు చేయవల్సిన ముఖ్యమైన పని, హెల్తీ డైట్ ను పాటించడమే. అందులో ముఖ్యంగా జింక్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం.

అరగంట నడక:

అరగంట నడక:

నార్మల్ డెలివరీ కోరుకొనే వారు హెల్తీ డైట్ తో పాటు మరో ముఖ్యమైన ప్రెగ్నెన్సీ చిట్కా ప్రశాంతమైన నడక. ప్రతి రోజూ అరగంట నడవడం వల్ల, సిజేరియన్ కు అవకాశం ఉండదు. లేదంటే మీ డ్యూడేట్ కంటే ముందే సిజేరియన్ కు సిద్దపడాల్సి ఉంటుంది.

ఎక్కువ సమయం నిలబడాన్ని నివారించండి :

ఎక్కువ సమయం నిలబడాన్ని నివారించండి :

గర్బిణీలు ఎక్కువ సమయం నిలబడటం వల్ల కడుపులో ఉన్న శిశువు గురుత్వాకర్షణకు గురి అవుతారని, దాంతో పెల్విస్ వద్దకు చేరుకుంటారని కొందరు నిపుణులు చెప్పడం జరిగింది. ప్రెగ్నెన్సీ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఎక్కువ సమయం నిలబడకపోవడం మంచిది. నార్మల్ డెలివరీ కోరుకొనే వారు గుర్తుంచుకోవల్సిన ముఖ్యమైన ప్రెగ్నెన్సీ చిట్కా ఇది.

యోగా చేసే మ్యాజిక్:

యోగా చేసే మ్యాజిక్:

యోగా సెషన్ లో మీ పేరు నమోదు చేసుకోవడానికి మాత్రమే పరిమితం అయితే, సీ సెసన్ కు మీరు సిద్దం అవుతున్నట్లే. కాబట్టి, యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల రెస్పిరేషన్ రెగ్యులేట్ చేయడానికి, హార్ట్ బీట్ మరియు మీ శరీరం విశ్రాంతి పొందడానికి బాగా సహాయడపడుతుంది. యోగానిపుణుల సమక్షంలో, రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల శరీరం మరింత ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది మరియు ఇది నార్మల్ డెలివరీకి సహాయపడుతుంది.

ప్రీనేటల్ క్లాస్:

ప్రీనేటల్ క్లాస్:

గర్భిణీ స్త్రీలు ప్రీనేటల్ క్లాసులకు హాజరవ్వడం వల్ల, డెలివరీ సమయానికి మీకు అవసరం అయ్యే ప్రెగ్నెన్సీ చిట్కాలన్నింటిని తెలుసుకోవచ్చు. ప్రీనేటల్ క్లాస్ లో కొన్ని ప్రెగ్నెన్సీ వ్యాయామాలు నేర్చుకోవడం వల్ల బేబీ పుట్టే సమయంలో నొప్పులను నివారించవచ్చు.

శరీరాన్ని హైడ్రేట్ లో ఉంచుకోవాలి:

శరీరాన్ని హైడ్రేట్ లో ఉంచుకోవాలి:

ప్రెగ్నెన్సీ సమయంలో ప్రెగ్నెన్సీ చిట్కా, ముఖ్యంగా నార్మల్ డెలివరీకి నీటి అవసరం ఎక్కువగా ఉంది. గర్భధారణ సమయంలో గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధక సమస్యను నివారించుకోడం కోసం అధికంగా నీరు, ద్రవాలు, తాజా జ్యూసులు తీసుకోవడం చాలా అవసరం.

జీవనశైలి:

జీవనశైలి:

కొంత మంది గర్భిణీలు, డాక్టర్ సలహా లేకుండానే బెడ్ రెస్ట్ తీసుకుంటుంటారు. అయితే, మీరు నార్మల్ డెలివరీ కోరుకుంటున్నట్లైతే , ఒక మంచి ప్రెగ్నెన్సీ చిట్కా మీ జీవన శైలి యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడి లేకుండా:

ఒత్తిడి లేకుండా:

గర్భాధారణ సమయంలో ఎటువంటి ఒత్తిడికి గురికాకుడదని మీఅంతట మీరు ప్రామిస్ చేసుకోవాలి. ఎంత ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే అంత ఎక్కువగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎల్లప్పుడు సంతోషంగా గడపడానికి తప్పక ప్రయత్నించాలి. మీ ప్రవర్తనే మిమ్మల్ని మరియు కడుపులో పెరిగే బిడ్డకు ఆరోగ్యకరం.

ఫ్యాషనబుల్:

ఫ్యాషనబుల్:

నార్మల్ డెలివరీకి మరో బెస్ట్ ప్రెగ్నెన్సీ టిప్...మీకు ఆశ్చర్యం కలగవచ్చు!ఎందుకు?ఎలా? అని. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పనిచేసే ఉద్యోగిణులు గాజులు వేసుకోవడం వల్ల గాజుల నుండి వచ్చే గళగళ శబ్ధాలు కడుపులోని శిశువుకు ధ్వని ప్రకంపనలు అందిస్తుందని చెబుతుంటారు. ఈ గణగణ మోగ్రే శబ్దాలు ప్రెగ్నెంట్ స్త్రీలకు ప్రశాంతతకు మరియు పెల్విక్ (కటి కండరాలు)మరయిు స్నాయువులు సడలింపుకు సార్మల్ డెలివరీ సులభతం చేస్తుంది.

సుగంధ ద్రవ్యాలు:

సుగంధ ద్రవ్యాలు:

మసాలా దినుసులు, స్పైసీ ఫుడ్ మితంగా తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీకి సహాయపడుతాయి. స్పైసీ ఫుడ్స్ వల్ల నార్మల్ డెలివరీ ఉద్దీపన చేయడానికి ప్రభావం చూపెడుతుంది.

English summary

Healthy Pregnancy Tips For Normal Delivery

One of the many fears pregnant women go through during pregnancy is the C section operation. There are many women who want to have a safe and normal delivery, but unfortunately it is the other around when it comes to the due date.
Story first published: Thursday, September 19, 2013, 16:32 [IST]
Desktop Bottom Promotion