Latest Updates
-
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే!
గర్భిణీలకు పైనాపిల్ సురక్షితమా, కాదా?
మహిళ గర్భం ధరించినప్పుడు, ఆమె ఎటువంటి ఆహారాలు తీసుకుంటుందని గమనిస్తుండాలి. గర్భిణీ స్త్రీ తను తీసుకొనే ఆహారాల మీద కొంత అజాగ్రత్త వల్ల గర్భాశయంలో పెరిగే పిండం మీద ప్రభావాన్ని చూపుతుంది. గర్భిణీ స్త్రీల కొరకు కొన్ని మంచి ఆహారాలు మరియు చెడు ఆహారాలు కూడా ఉన్నాయి. మీరు గర్భిణీ అయితే, మీకు పెద్దలు మరియు అనుభవం ఉన్న స్త్రీలు, మీరు ఎలా ఉండాలి మరియు ఏం తినాలని సలహాలిస్తుంటారు. ఉదాహరణకు: నట్స్ తినడం మరియు సింపుల్ వ్యాయామాలు చేయడం గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.
అయితే, కొన్నిఆహారాలు గర్భిణీ స్త్రీలకు మంచి మరియు కొన్ని ఆహారాలు చెడు చేస్తాయి. ఉదాహరణకు: బాగా పండని బొప్పాయి గర్భధారణ సమయంలో తీసుకొంటే మంచిదని భావిస్తారు. కానీ, చాలా మంది గర్భిణీ స్త్రీలు, అనుభవం ఉన్న మహిళలు అభిప్రాయం ప్రకారం బొప్పాయి పండు, గర్భిణీలో గర్భ స్రావానికి దారితీస్తుంది. మరియు నెలలు నిండక ముందే ప్రసవించే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. అదేవిధంగా పైనాపిల్ కూడా. అయితే పైనాపిల్ గర్భిణీ విషయంలో మిశ్రమ స్పందన లభించింది. మరి గర్భధారణ సమయంలో పైనాపిల్ మంచా లేదా చెడా? అని తెలుసుకోవాలంటే..ఈ క్రింది విషయాలు చదవాల్సిందే...

నెలలు నిండక ముందే ప్రసవానికి కారణం: గర్భిణీ స్త్రీ గర్భధారణ ప్రారంభ దశలో అధికంగా పైనాపిల్ తినడం లేదా పైనాపిల్ జ్యూస్ త్రాగడం చేయకూడదు. గర్భవతిగా ఉన్నవారు ప్రసవం అయ్యే వరకు పైనాపిల్‌కి దూరంగా ఉండాల్సిందే. ఇందుకు ముఖ్యకారణం ఇందులో అధికంగా ఉండే బ్రొమెలైస్ అనే పదార్థం గర్భాశయాన్ని శుభ్రపరిచే గుణం కలది. దీంతో గర్భవిచ్ఛిన్నం కావటమో, నెలలు నిండక ముందే ప్రసవం జరిగి బిడ్డ అనారోగ్యంగా పుట్టడమో జరుగుతాయి. ఇంకా అధికంగా పైనాపిల్ తినడం వల్ల గర్భిణీలో డయేరియాకు కారణం అవుతుంది. అందుకే గర్భవతులు తినే పళ్లలో ఇది పూర్తిగా నిషేధించిన పండు.
గర్భస్రావం: పాతకాలపు వారు చెప్పే మాటలను బట్టి, పైనాపిల్ తినడం వల్ల అది గర్భస్రావానికి గురిచేస్తుందని అంటారు. ప్రోటీస్ ఎంజైమ్ మరియు బ్రొమోలైన్ రెండూ, బొప్పాయలోని పెపిన్ వంటిదే అని అంటారు . బ్రొమెలైన్ స్కర్విక్స్ ను సాఫ్ట్ గా చేస్తుంది దాంతో గర్భస్రావం జరుగుతుంది. పైనాపిల్ ముఖ్యంగా గ్రీన్ మరియు బాగా పండని పైనాపిల్ గర్భాశయ సూచించే మరియు ఒక స్థిరమైన గర్భానికి హాని చేస్తుంది. అందువల్ల, మహిళలు ఈ ట్రోపికల్ ఫ్రూట్ ను గర్భధారణ సమయంలో ముఖ్యంగా, గర్భం ప్రారంభ దశలో నివారించడం ఉత్తమం.
ఇతర ఆరోగ్య సమస్యలు: గర్భిణీ అధికంగా పైనాపిల్ తినడం వల్ల డయేరియా మరియు హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది. ఈ అసిడిక్ ట్రోపికల్ ఫ్రూట్ హార్ట్ బర్న్ ను మరింత తీవ్రతరం చేస్తుంది . గర్భిణీ స్త్రీ తరచూ హార్ట్ బర్న్ తో బాధపడుతుంటుంది దాంతో పైనాపిల్ మరింత ప్రమాధకరంగా మారుతుంది .
ఇంకా పైనాపిల్లో విటమిన్ సి మరియు డైజెస్టివ్ ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో గర్భిణీకి చాలా అవసరం అవుతాయి . కాబట్టి, గర్భిణీ, ఈ ఫ్రూట్ తీసుకోవడానికి ముందే డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం. అయితే కొంత మంది మహిళలు మాత్రం గర్భిణీ ప్రారంభ దశలో కాకుండా మూడవ త్రైమాసికంలో తినడంలో ఆరోగ్యకరమైన ప్రసవాన్ని పొందామని చెబుతుంటారు. ఏదైమైనప్పటకీ పైనాపిల్ తినాలనే కోరిక కలిగి గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం మరియు ముఖ్యం.



Click it and Unblock the Notifications