Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
గర్బిణికి అత్యవసరం...గర్భం వదులయ్యే సంకేతాలు..!
గర్భధారణ చివరి దశలో పిండం పొత్తికడుపులోకి దిగినప్పుడు శరీరం జన్మనివ్వడానికి సిద్ధమయ్యే ప్రక్రియ వదులవ్వడం జరుగుతుంది - దీన్నే కొన్నిసార్లు ఎంగేజ్ మెంట్ అనీ లేదా పిల్ల వాడు జారడం అని గానీ అంటారు. స్త్రీ బిడ్డకు జన్మ ఎప్పుడు ఇస్తుందనేది అది తెలియచేయ్యదు కానీ వేర్వేరు స్త్రీలలో వేర్వేరుగా జరిగే ఈ ప్రక్రియను కొందరు స్త్రీలు గుర్తించను కూడా గుర్తించరు. అటువంటివి కొన్ని తెలుసుకుందాం...
కాల నియమం: ప్రసవ౦ జరిగే నాలుగు వారాల ముందే వదులవ్వడం మొదలవుతుంది. గతంలో గర్భం ధరించిన స్త్రీలలో వదులవ్వడం ప్రసవం మొదలయ్యే దాకా జరగక పోవచ్చు. మీరు వదులవ్వడం అనుభవించి వుంటే , ప్రత్యేకంగా మీకు పొత్తికడుపు లో వట్టిడిగా అనిపిస్తే, మీ ప్రసవ సమయం నాలుగు వారాల కన్నా ఎక్కువ దూరం ఉన్నట్టే. ఒకవేళ గడువుకు ముందే ప్రసవం అయ్యే అవకాశాలున్నాయేమో పరిశీలించడానికి మీ వైద్యుడిని సంప్రదించండి. (ప్రస్తావన1)
సంకేతాలు: వదులవ్వడం జరిగినప్పుడు స్త్రీలకు అనుభవమయ్యే తేలిక తనం లేదా విశ్రాంతి వల్ల ఆ ప్రక్రియకు వదులవ్వడం అనే పేరు వచ్చింది. (ప్రస్తావన 3). బిడ్డ పక్కటెముకల నుంచి పొత్తికడుపు లోకి చేరేసరికి, మీకు ఊపిరి తీసుకోవడం తేలికవుతుంది, దీర్ఘ శ్వాసలు తీసుకోగలుగుతారు, ఒకే సారి కడుపు బరువుగా అనిపించకుండా ఎక్కువ తినగాలుగుతారు, గుండెల్లో మంట నుంచి విశ్రాంతి పొందుతారు. (ప్రస్తావన 1). మీ రెండు వక్షోజాల మధ్యా, గర్భాశయంలోను మరింత చోటు వుండడం కూడా మీరు గమనిస్తారు (ప్రస్తావన 2) లేదా మీ బిడ్డ ఆకారంలో మార్పు కూడా గమనిస్తారు.

అసౌకర్యం: వదులవ్వడం జరిగాక, మీ పొత్తికడుపులో ఎక్కువ వత్తిడి అనిపిస్తుంది, నడిచేటప్పుడు అసౌకర్యంగా వుంటుంది, బిడ్డ మీ మూత్రాశయం మీద వత్తిడి పెంచడం వల్ల తరచుగా మూత్ర విసర్జన అవసరమౌతుంది (ప్రస్తావన 2). చాలా మంది నడిచేటప్పుడు చిన్న చిన్న అడుగులతో ఇబ్బందిగా నడుస్తున్నట్టుగా అనిపిస్తున్నట్టు చెప్తారు (ప్రస్తావన1) లేదా మలాశయం మీద అదనపు వత్తిడి వల్ల బిడ్డ ఏ నిమిషం లోనైనా జారిపోవచ్చని అనిపిస్తున్నట్టు (ప్రస్తావన 3). ఐతే, ఈ సంకేతాలు లేకుండా లేదా మార్పు జరిగినట్టు తెలియకుండా కూడా వదులవ్వడం అనుభవం లోనికి రావచ్చు
విశ్రాంతి: వదులవ్వడం మీకు నచ్చని గర్భధారణ సంకేతాల నుంచి విముక్తి కల్పించినా, మరికొన్ని కొత్త వాటిని తీసుకు రావచ్చు. వదులవ్వడం మొదలయ్యాక మీకు పొత్తికడుపులో అసౌకర్యం అనిపిస్తే, మీ పిరుదుల క్రింద దిండు ఉంచుకుని పడుకోండి లేదా పొత్తికడుపును అటూ ఇటూ ఊపండి; నడిచే బదులు ఈత కొడితే మీ పొత్తికడుపు మీద వత్తిడి తగ్గుతుంది.
పరిశీలనలు: మీ ప్రసవ సమయం దగ్గరపడినా, మీ బిడ్డ పొత్తికడుపు లోకి జారినట్టు అనిపించకపోయినా కంగారు పడకండి. అంత మాత్రాన మీ ప్రసవ సమయానికి ఇంకా వారాల వ్యవధి ఉందని కాదు, ఎందుకంటే ఒక్కో గర్భధారణ విషయంలో ఒక్కోలా జరుగుతుంది - ఎప్పుడు జరుగుతుందో చెప్పడానికి ఎలాంటి దారీ లేదు. వదులవ్వడం మీకు తెలియకుండా క్రమంగా జరుగుతుంది లేదా ఒక్కో రోజులోనే జరిగిపోవచ్చు. (ప్రస్తావన 2).



Click it and Unblock the Notifications