Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీ స్త్రీల్లో ఫైల్స్ నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు...

లక్షణాలు ఎలా ఉంటాయి: మల విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి, మంట ఉంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మలవిసర్జన తర్వాత కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జ సమయంలో మొలలు(పైల్స్) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.
తీసుకోవల్సిన జాగ్రత్తలు:
1. ప్రతి రోజూ పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకొంటుండాలి.
2. నీరు ఎక్కువగా (కనీసం రోజుకు ఎనిమిది నుండి పది గ్లాసులు)తాగాలి. ఫ్రూట్ జ్యూసులు తీసె
3. రోజు మల విసర్జన సాఫీగా జరుగునట్లు చూసుకోవాలి. రెస్ట్ రూమ్ కు వెళ్ళాలి అనిపించినప్పడు వెంటనే వెళ్ళాలి.
4. ఫాస్ట్ ఫుడ్స్, వేపుల్లు, మాంసాహరాలు, చిరుతిళ్ళు తినటం మానుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి.
5. నిద్రపోయే సమయంలో ఎడమవైపుకు తిరిగి నిద్రించడం వల్ల కొంత ఉపమశమం పొందవచ్చు.
గర్భిణీ స్త్రీల్లో ఫైల్స్ నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు:
ఆహారపరంగా: నూనెలో వేయించిన మాంసము, పిండివంటలు, బిర్యాని, బంగాళదుంప, చామగడ్డ, వంటివి తరచూ తింటున్నపుడు సమస్య తీవ్రమవుతుంది. ఉప్పు, పులుపు, నిల్వ పచ్చళ్లు, కారము,ఆవాలు అధికంగా తీసునే వారికి ఈసమస్య ఎక్కువవుతుంది.
పొడిగా ఉండే ఆహారమే తీసుకుని పీచు పదార్దాలు తినని వారికి కూడా ఫైల్స్ వచ్చే అవకాశం ఉంది. నీరు తక్కువ, ఎండు ఆకుకూరలులను ఎక్కువగా తీసుకోవడం, పదే పదే కాఫీ, టీ అధికంగా సేవించడం కుడా ఈ సమస్యకుదారితీస్తుంది.
గర్భిణీ స్త్రీలల్లో గర్భస్రావము జరిగునపుడు, విషమ ప్రసవము వల్ల మహిళలకు ఫైల్స్ రావడానికి అవకాశముంది. అధిక వేడి ప్రదేశంలో పనిచేసేవారు, దృఢమైన ఆసనంపై కూర్చునే వారు, ఎక్కువ ప్రయాణాలు చేస్తూ సరైన ఆహారం తీసుకోని వారు ఈ సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి అధికం గా ఉన్న వారికి ఇవి వచ్చే సూచనలు ఎక్కువ.
ఆహార నియమాలు: మొలలతో బాధపడే వారు మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం అన్నిటికంటే ప్రధానం. రోజు ఆహారంలో పీచుపదార్దము ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బీరకాయ, ఆనప, పొట్ల, కంద, బచ్చలి, అరటిపండ్లు, సిట్రస్ పండ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి.
కొబ్బరి నీళ్లు, పాలు, వట్టివేళ్ళు తీసుకోవడం వల్ల శరీరానికి చలవచేస్తుంది. మెత్తటి పరుపుమీద కూర్చోవడం, వేడినీళ్ళతో స్నానం చేయడం వల్ల కొంతవరకు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం ఎక్కువగా చేయడం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రించటం వంటి అలవాట్లు మానుకోవాలి.



Click it and Unblock the Notifications