Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రతి గర్భిణీ స్త్రీ చేయవలసిన 4 శ్వాస వ్యాయామాలు !!
గర్భం ధరించి వున్నప్పుడు సరిగా శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎదిగే మీ బిడ్డ అవసరాలు తీర్చడానికి, మీ శరీరం సజావుగా పని చేయడానికి సరిపడా ప్రాణవాయువు అవసరం. సరైన మోతాదులో ప్రాణ వాయువు అందితే గర్భస్థ పిండం చక్కగా ఎదుగుతుంది, దానికి అవసరమైన పోషణ లభిస్తుంది. అందువల్ల మీ శ్వాస ప్రక్రియను, విధానాలను సరి చేసుకోవడం చాలా అవసరం. మీ శరీరంలో అవసరమైనంత ప్రాణ వాయువును నింపే నాలుగు సరళమైన శ్వాస వ్యాయామాలు ఇవిగో :

మీ ఉదరం నుంచి శ్వాస పీల్చడం :
దీన్నే సాధారణంగా నాభి నుంచి శ్వాస తీసుకోవడం అంటారు. సౌకర్యవంతంగా వుండే చోట కాళ్ళు మడుచుకుని కూర్చోండి. మీ దవడలు, భుజాలు, తొడలతో సహా మీ శరీరం మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఒక చేయి మీ ఉదరం క్రింద ఒకటి ఉదరానికి పై వైపు వుంచండి. ఇప్పుడు మీ నాభి క్రింది నుంచి శ్వాస పీల్చండి, ఎనిమిది లేక మీకు సౌకర్యంగా వుండే వేరే సంఖ్య లెక్కకు సరిపడా కడుపు నిండా గాలి పీల్చుకోండి. అదే సంఖ్య లెక్కకు గాలి బయటకు వదలండి. ఇది మీకు సునాయాసంగా చేయడం సాధ్యం అయ్యేదాకా రోజూ కనీస౦ పది నిమిషాల పాటు చేయండి. మీ గర్భం ఇంకా పైకి కనపడక పొతే, మీ మోకాళ్ళ మీద అరచేతులు వుంచి ఇదే ప్రక్రియ పాటించండి.
గుండె నుంచి గాలి పీల్చడం :
నిటారుగా నిలబడి మీ రెండు కాళ్ళు సమాంతరంగా వుంచండి. నోరు మూసి వుంచి, పది లెక్క పెట్టె వరకు దీర్ఘ శ్వాస తీసుకోండి. అరచేతులు గుండె మీద ఉంచుకోండి. అయితే మీ గుండెల మీద చేతులు బలంగా అదిమి పెట్టకండి. లోపలి గాలి పీల్చేటప్పుడు మీ ఊపిరితిత్తులు బయటకు విస్తరించడం వల్ల మీ చేతులు గుండెల మీద నుంచి బయటకు కదులుతున్నట్లు భావించండి. శ్వాస కొద్ది సేపు ఆపి వుంచి బయటకు మెల్లిగా వదలండి. మీరు లోపలి తాజా గాలి ఎంత సేపు పీల్చారో అంతే సేపు గాలి బయటకు వదలడానికి కూడా తీసుకోండి. లోపలి పీల్చేటప్పుడు, బయటకు వదిలేటప్పుడు ఒకటే అంకె వరకు లెక్కి౦చడం ఒక తేలికైన పని. దీని ప్రయోజనాలు పొందడానికి ఈ ప్రక్రియ అంతటినీ పది సార్లు పునరావృతం చేయండి. కానీ గుర్తుంచుకోండి, ఏడో నెల తరువాత ఈ ప్రక్రియ చేయడం మీకు కష్టంగా అనిపించవచ్చు, అయినా మీకు సౌకర్యంగా వున్నన్ని సార్లు ఈ ప్రక్రియ రోజూ కొనసాగించండి.
పై పైన గాలి పీల్చడం :
గుర్తుంచుకోండి, పై పైన గాలి పీల్చడం అంత మంచి పద్ధతి కాదు, ఎందుకంటే అది ప్రాణవాయువు ప్రసరణను నోరిదిస్తుంది, బిడ్డకు అందే ప్రాణవాయువును తగ్గిస్తుంది. అయితే ఇలా పైపైన రోజూ కొద్ది సేపు గాలి పీల్చడం వల్ల మీ ఊపిరితిత్తులు బలంగా, ఆరోగ్యంగా వుంటాయి. ఇది సరిగా చేయాలంటే, మోకాళ్ళు మడిచి వెల్లకిలా పడుకోండి లేదా వెన్ను నిటారుగా వుంచి, కాళ్ళు రెండు సమాంతరంగా వుంచి నేల మీద నిలబడండి. ఇప్పుడు, మీ నోరు బాగా తెరిచి, త్వరగా, పైపై శ్వాసలు పీల్చండి. ఇది మీ ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం. ఈ ప్రక్రియ రోజూ కనీసం అయిదు నిమిషాల పాటు చేయండి.
దీర్ఘ శ్వాస, పై పై శ్వాస మార్చి మార్చి చేయడం :
సౌకర్యంగా ఉండేలా కాళ్ళు మడిచి కూర్చోండి లేదా రెండు కాళ్ళూ సమాంతరంగా వుంచి నిలబడండి. మీ దవడలు, చేతులు, మోకాళ్ళు, తొడలు, భుజాలతో సహా మీ శరీరం అంతటినీ రిలాక్స్ చేయండి. అంతే సమయం తీసుకుని గాలి బయటకు వదలండి. ఇప్పుడు మీ నోరు బాగా తెరిచి నోటి ద్వారా అయిదు అంకెలు లెక్క పెట్టినంత సేపు గాలి లోనికి పీల్చండి, తరువాత నోరు మూసి వుంచి దీర్ఘ శ్వాస ప్రక్రియ కొనసాగించండి. ఈ మొత్తం ప్రక్రియను ఏకధాటిగా అయిదు సార్లు చేయండి.
ఈ శ్వాస వ్యాయామాలు మీరు ప్రాణవాయువు గ్రహించడానికి సహకరిస్తాయి, రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి, మీ శరీరం చక్కగా పంచి చేసి మీ బిడ్డకు అవసరమైన పోషణ, ప్రాణవాయువు అందిస్తాయి. అయితే ఈ శ్వాస ప్రక్రియల ప్రయోజనం ప్రాణాయామం, యోగా తో కలిపి చేస్తే ఇంకా ద్విగుణీకృత౦ అవుతుందని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications