Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీలు డార్క్ చాక్లెట్ ఖచ్చితంగా తినడానికి గల కారణాలేవి
మీరు గర్భం పొందారా?మీకు చాక్లెట్స్ తినడం అంటే మహా ఇష్టమా?అయితే మీకు ఒక శుభవార్త!గర్భధారణ సమయంలో గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందుతారని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి. డార్క్ చాక్లెట్ గర్భిణీలకు చాలా బారీగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈఆర్టికల్లో గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడానికి గల 5 ముఖ్య కారణాలను వివరించింది.
గర్భిణీ స్త్రీలు గర్భధారన సమయంలో ఎదుర్కొనే కొన్ని సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా డార్క్ చాక్లెట్ తినడం వల్ల నివారించుకోవచ్చని నిర్ధారించారు. వాటిని గురించి గర్భిణీలు తెలుసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా, గర్భిణీల్లో స్ట్రెస్ లెవల్స్ ను తగ్గించి ప్రశాంత పరిచే కొన్ని అతి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ ఈ చాక్లెట్ లో ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే ఇది గర్భిణీ స్త్రీలలో డిప్రెషన్ కూడా తగ్గిస్తుంది.
మరి గర్భిణీస్త్రీలు, డార్క్ చాక్లెట్ తినడానికి గల కారణాలను ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని తెలుసుకొని గర్భాధారణ సమయంలో డార్క్ చాక్లెట్ తినడానికి ప్రయత్నించండి.,...

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది
డార్క్ చాక్లెట్ ను కోకోతో తయారుచేస్తారు. ఇందులో థియోబ్రొమైన్ కలిగి ఉండి ఇది రక్తప్రసరణను పెంచుతుంది. మరియు ఈ థియోబ్రోమైన్ కడుపులో పెరిగే శిశువుకు కూడా అవసరం అయ్యే రక్తప్రసరణను అందిస్తుంది. గర్భిణీ స్త్రీలకు డార్క్ చాక్లెట్ వల్ల ఇది ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఆరోగ్యప్రయోజనం.

యాంటీఆక్సిడ్స్
డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతాయి. అలాగే కడుపులో పెరిగే శిశువు కూడా హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి రక్షింపబడుతుంది. ఇది కూడా ఒక మంచి కారణం.

ఐరన్ అండ్ మెగ్నీషియం
డార్క్ చాక్లెట్ లో ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండి, గర్భిణీలో ఇది హీమోగ్లోబిన్ కౌంట్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మెగ్నీషియం ఖచ్చితంగా ఫ్యాటీయాసిడ్స్ యొక్క మెటబాలిజం రేటు పెంచుతుంది.

హార్ట్ డిసీజ్
డార్క్ చాక్లెట్ తినడం వల్ల గర్భిణీ స్త్రీ యొక్క గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఎలాంటీ గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఎదుర్కొంటుంది. కాబట్టి, గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడానికి ఇది కూడా ఇక ఖచ్చితమైనటువంటి కారణంగా ఉంది.

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది
డార్క్ చాక్లెట్ లో షుగర్ మరియు ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల గర్భిణీలలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

ఒత్తిడి తగ్గిస్తుంది
గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ రెగ్యులేషన్ వల్ల మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండుట వల్ల మహిళల్లో స్ట్రెస్ లెవల్స్ తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications