Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
గర్భదారణ సమయంలో ఫిట్ గా మరియు అందంగా కనిపించడం ఎలా
సాధారణంగా చాలా మంది స్త్రీలు గర్భధారణ అంటే భయపడుతుంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో శరీరంలో హార్మోనుల్లో అనేక మార్పులు, కొన్ని సమస్యలు మరియు ప్రసవ నొప్పులు మరియు ప్రసవం వంటి వాటికి భయపడుతుంటారు. అలాగే గర్భం పొందిన తర్వత కడుపులో పెరిగే బిడ్డవల్ల తల్లిలో బరువులో మార్పులు, చర్మంలో మార్పులు మరియు బేబీ బంప్ వల్ల మార్పులు సహజం. అటువంటప్పుడు గర్భిణీలు ఒక పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ తో మరియు ఆత్మగౌరవం కలిగి ఉండటం చాలా అవసరం. దాంతోనే గర్భధారణ పూర్తికాలంలో సంతోషంగా మరియు ఆరోగ్యకరమైన గర్భదారణ కాలంను పూర్తి చేయగలరు.
అలాగే అందం విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కానీ వారు కూడా ఉంటారు. గర్భం పొందగానే అన్ని సింపుల్ గా, డల్ గా మరియు అన్ ఫ్యాషనబుల్ గా ఉండాల్సిన పనిలేదు, వీటికి బదులుగా మీ స్త్రీత్వం మరియు మాతృత్వంతో సంతోషంగా గడపగలిగే వాతావరణంను ఏర్పరుచుకోవాలి . అయితే గర్భధారణ సమయంలో సహజంగానే గర్భిణీలు చూడటానికి ఫిట్ గా మరియు సెక్సీగా కనబడాలంటే? ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి...

వర్కౌట్:
వర్కౌట్: మీ గర్భధారణ సమయంలో వారంలో రెండు రోజులు వ్యాయం చేయడం మంచిది. వ్యాయామం అంటే నడక, స్విమ్మింగ్, యోగా మరియు వాటర్ ఏరోబిక్ వంటివి డాక్టర్ ను సంప్రధించి చేసుకోవచ్చు. వ్యాయామం చేయడం ద్వారా గర్భం పొందడానికి ముందు మీరు ఎలా ఉన్నారో అలాగే చురుకుగా ఉండేవిధంగా సహాయపడుతుంది.అలాగే వ్యాయామం చేసే సమయంలో ఎక్కువ నీళ్ళు త్రాగాలి . ఇది మీ ఫీలింగ్స్ ను రిఫ్రెష్ చేయడమే కాకుండా మీ శరీరానికి పూర్తి హైడ్రేషన్ ను అంధిస్తుంది మరియు మీ చర్మాన్ని ఆరోగ్యంగా మెరుస్తుండేట్లు చేస్తుంది.

మెటర్నిటీ దుస్తులు ఎంపిక చేసుకోవడం
మెటర్నిటీ దుస్తులు ఎంపిక చేసుకోవడం వల్ల మీరు సౌకర్యవంతంగా మరియు చూడటానికి అందంగా కనబడుతారు. ప్రస్తుత రోజుల్లో కొంత మంది గర్భిణీ స్త్రీలో పెద్ద సైజు దుస్తులను టీ షర్ట్స్ మరియు ఓల్డ్ ఫ్యాషనబుల్ మెటర్నిటీ స్కర్ట్ వేయడాన్ని మీరు గమనించే ఉంటరు. అటువంటి సెలక్ట్ చేసుకోవాలి. అవి మీకు సౌకర్యవంతంగా మరియు సెక్సీగా కనబడేలా చేస్తాయి. స్టైల్ అండ్ కంఫార్టబుల్ దుస్తులను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తర్వాత కొనుగోలు చేయాలి. అలాగే వాటి మీదకు ఫర్ ఫెక్ట్ ఫేవరెట్ యాక్సెసరీస్ ధరిస్తే మరింత అందంగా కనబడుతారు. పర్ ఫెక్ట్ షూ, ఫ్లాట్ గా ఉండేవాటిని ఎంపిక చేసుకోవడం వల్ల సౌకర్యవంతంగా ఉంటాయి.

హెల్తీ ఫుడ్ బ్యాలెన్డ్స్ డైట్ తీసుకోవాలి:
హెల్తీ ఫుడ్ బ్యాలెన్డ్స్ డైట్ తీసుకోవాలి: గర్భిణీలు వారి రెగ్యులర్ డైట్ లో తాజా పండ్లు మరియు కూరగాయలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. వాటి వల్ల మీకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ అందుతాయి . ఫయాట్ ఫుడ్స్ కు దూరంగా ఉండి, లీన్ మీట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. కాఫీకి అలవాటు పడినట్లైతే కాఫీని మానకోవాలి. కాఫీ వల్ల స్కిన్ డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. మరియు నిద్రలేకుండా విశ్రాంతి లేకుండా చేస్తుంది. అలాగే మీ పొట్టలో పెరిగే శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

హెయిర్ స్టైల్:
హెయిర్ స్టైల్: గర్భం పొందిన తర్వాత శరీరంలో హార్మోనులు మార్పలు వల్ల షైనీ, మందమైన జుట్టును పొందుతారు?వాటిని మీరు కట్ చేయకండి మరియు పోనీటైల్ గా బిగించి వేయకండి. కేవలం వాటిని మేనేజ్ చేస్తే సరి. మీకు కష్టంగా ఉంటే మీ హెయిర్ స్టైలిస్ట్ ను కలవండి మీకు ఎటువంటి స్టైల్ నప్పుతుందో చెబుతారు. హెయిర్ స్టైల్ అందంగా ఉన్నప్పుడుమీరు మరింత సెక్సీగా కనబడవచ్చు.

మేకప్ మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ ను స్కిప్ చేయకండి:
మేకప్ మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ ను స్కిప్ చేయకండి: గర్భం ధరించిన తర్వాత ఎన్నో అభ్యంతారలుంటాయి. వాటిలో ముఖ్యంగా కెమికల్స్ ఉపయోగించకూడదని, అవి బేబీకి చెడు ప్రభావాలు చూపెడుతాయని అంటారు . అయితే మీరు అలంకరణకు దూరంగా ఉండాలని కాదు, కానీ, గర్భిణీలకోసం ప్రత్యేకమైన బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి . వాటిని ఉపయోగించే ముందు మీ డాక్టర్ ను సంప్రధించడం అవసరం. మినిరల్ పౌడర్ ఉపయోగించడం చాలా సులభం దీన్ని అప్లై చేస్తే చాలా లైట్ గా ఉంటుంది. అలాగే మీ చర్మానికి మ్యాచ్ అయ్యే పౌడర్ ను ఎంపిక చేసుకోవాలి . మీ ఐపాప్స్ కు మ్యాచ్ అయ్యే ఐ షాడోష్ ను అప్లై చేసుకోవచ్చు . అలాగే పెదాలకు మాయిశ్చరైజర్ లిప్ కలర్ లిప్ స్టిక్స్ వంటివి అప్లై చేసుకోవచ్చు.

మీ ప్రవర్తనే మిమ్మల్ని మరింత సెక్సీగా కనబడేలా చేస్తుంది.
మీ ప్రవర్తనే మిమ్మల్ని మరింత సెక్సీగా కనబడేలా చేస్తుంది. మీరు మంచిగా, సంతోషంగా, ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటే మరింత అందంగా కనబడేలా చేస్తుంది. మంచి ఆలోచనలను కలిగి ఉండాలి.



Click it and Unblock the Notifications











