Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గర్భధారణ సమయంలో జలుబు: నేచురల్ హోం రెమెడీస్
గర్భధారణ సమయంలో జలుబు తగ్గించడానికి నేచురల్ రెమెడీస్
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీకి జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు అవి తప్పనిసరిగా గర్బిణీ స్త్రీ ఆరోగ్యం మీద ఆందోళన కలిగిస్తాయి. అయితే గర్భిణీ స్త్రీలు మందులు తీసుకొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి, సాధరణ జలుబు, ఇది సింపుల్ హెల్త్ కండీషన్ కాదు. ప్రెగ్నెన్సీ సమయంలో దీన్ని చాలా సులభంగా నివారించవచ్చు. దగ్గు, జలుబు గర్భిణీ రెగ్యులర్ గా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే, తప్పనిసరిగా గైనకాలజిస్ట్ ను కలవాలని సలహా. పరిక్ష చేసి, వైద్యుడు, అనేక మందులు మాత్రలు ప్రిస్ర్కిప్షన్ గా రాసి ఇస్తారు. మీరు చాలా ఎక్కువగా జలుబు మరియు దగ్గుతో బాధపడుతుంటే, కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ను ప్రయత్నించండి. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా సురక్షితం.
మెడికేషన్స్ తెలుసుకొనే ముందు, గర్భధారణ సమయంలో జలుబు చేసినప్పుడు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ను ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు, గర్భధారణ సమయంలో జలుబు, దగ్గు తగ్గించుకోవడానికి గోరువెచ్చని మరియు హాట్ గా ఉండే ద్రవాలను త్రాగడం ఒక ఉత్తమ మార్గం. అంతే కాదు, జలుబుతో పాటు అనుసంధానంగా వచ్చే ఇతర జబ్బులు అంటే, తలనొప్పి, మరియు మెడనొప్పి కూడా తగ్గిస్తుంది.
లక్షణాలు: జలుబు, ముక్కు మూసుకుపోవడం, డిస్చార్జ్, తుమ్ములు మరియు గొంతు నొప్పి, వంటి సమస్యలు సాధారణ జలుబుతో పాటు వస్తాయి. వీటిని నివారించడానికి నేచురల్ హోం రెమెడీస్ గర్భధారణ సమయంలో జలుబు దగ్గును నివారిస్తుంది.
గర్భిణీ స్త్రీలో జలుబు తగ్గించడానికి చిట్కాలు:

ద్రవాలు త్రాగాలి:
గర్భధారణ సమయంలో జలుబు పట్టడం చాలా సాధారణం. మీకు జలుబు చేసినప్పుడు, ఎక్కువగా ద్రవాలను త్రాగాల. అయితే, చాలా చల్లగా ఉన్న నీటిని త్రాగడం మానేయాలి . జలుబు చేసినప్పుడు గోరువెచ్చని నీళ్ళు త్రాగడం వల్ల శాస్వనాళం చాలా సులభంగా తెరుచుకొనే చేస్తుంది. దాంతో మీకు పూర్తి శ్వాస అందుతుంది. మరియు హైడ్రేషన్ లో ఉంచుతుంది.

సూప్స్:
సూప్స్ త్రాగడం వల్ల శరీరానికి వెచ్చదనం కలిగించడం మాత్రమే కాదు, ఇవి గర్భణీ స్త్రీలో జలుబు, మరియు దగ్గును కూడా నివారించడానికి సహాయపడుతాయి. సూప్స్ ద్రవాలుగా ఉండటం వల్ల ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.

ఆవిరి పట్టడం:
గర్భధారణ సమయంలో జలుబు నివారించడానికి ఒక ఉత్తమ హోం రెమెడీ స్టీమింగ్. మీ ముక్కు మూసుకుపోయినప్పుడు, ఎక్కువ రోజుల నుండి జలుబుతో బాధపడుతూ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లైతే మీరు ఆవిరి పట్టడం చాలా ఉత్తమ పద్దతి . ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళం ఫ్రీ అవుతుంది.

మసాలా టీ:
ఇండియన్ మసాలాలు, లవంగాలు, తులసి మొదలగునవి మీ రెగ్యులర్ టీలో తీసుకోవాలి. మీరు గర్భిణీగా ఉన్నప్పుడు మీరు తీసుకోవల్సిన ఒక బెస్ట్ ట్రెడిషినల్ హోం రెమెడీ ఇది.

విశ్రాంతి తీసుకోవాలి:
గర్భధారణ సమయంలో జలుబు చేయడం వల్ల శరీరం యొక్క వ్యాధినిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది. కాబట్టి, అటువంటి సమయంలో జలుబు మరియు దగ్గును నివారించుకోవడానికి క్రమంగా సరైన సమయంలో రెస్ట్ తీసుకోవాలి.

అదనంగా మరో దిండును వేసుకోవాలి:
జలుబుతో ముక్కు బ్లాక్ అయినప్పుడు, నిద్రించేటప్పుడు మీ తలక్రింది మరో దిండును చేర్చుకోవాలి. ఇది శ్వాస తీసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తుంది. మరియు నాజల్ పాసేజ్ ను క్లియర్ చేస్తుంది.

ఉమ్మివేయాలి:
మ్యూకస్ ను మింగడానికి బదులు ఎప్పటికప్పుడు దాన్ని బయటకు ఉమ్మివేయడం మంచిది . ఈ మ్యూకస్ ను మింగడం వల్ల ఇది మరో ఆరోగోయ సమస్యగా ఏర్పడుతుంది.



Click it and Unblock the Notifications