Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అధికబరువు ఉన్నవారు గర్భంపొందితే పాటించాల్సిన చిట్కాలు
అధిక బరువు కలిగి ఉండటం వల్ల గర్భం పొందడం చాలా మందిలో కష్టం అవుతుంది. అధిక బరువు(ఊబకాయం)ఉన్నవారిలో గర్భం పొందడంలో ఎక్కువగా ఆటంకాలు కలిగించేవి గర్భస్రావం జరగడం , రక్తం గడ్డకట్టడం, పుట్టకలో లోపాలు, ప్రసవంలో సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి, పిల్లలకోసం ప్రయత్నించేటప్పుడు ముందుగా బరువు తగ్గాలని చాలా మంది డాక్టర్స్ సలహాలిస్తుంటారు .
ఒకప్పుడు 30ఏళ్ళ తర్వాత సరైన బరువు, శరీరానికి తగ్గ బరువు కనుక్కోవడానికి బాడిమాస్ ఇండిక్స్ ను ఉపయోగించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో 15-20శాంత మంది బాడీ మాస్ ఇండక్స్ ను ఉపయోగిస్తున్నారు. అధిక బరువు వుండటం ఫలదీకరణ అవకాశాలను తగ్గిస్తుంది.గర్భవతి అయ్యే అవకాశాలు తక్కువగా వుంటాయి.లేదా కష్టతరం అవుతుంది. కనుక గర్భం ధరించాలంటే, మొదటగా మీ శారీరక బరువుపై దృష్టి పెట్టండి. శరీర బరువు తగ్గించుకుంటే గర్భధారణ సమయంలో కూడా మీకు తేలికగా వుంటుంది. కాబట్టి, పిల్లలకోసం ప్రయత్నించేవారు, గర్భం ధరించడానికి ముందు బరువు తగ్గండి.
కానీ, మీరు ఇప్పటికే గర్భం పొందిఉంటే, బరువు తగ్గడం సాధ్యం కాదు, అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

గర్భిణీలు స్థూలకాయులైతే పాటించాల్సిన చిట్కాలు
ఇప్పుడున్న బరువు కంటే ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి: అధిక బరువు ఉన్నవారు ముందుగా గుర్తించుకోవల్సిన ఒక ముఖ్య విషయం. ఇప్పుడున్న బరువుకు అదనపు బరువు చేరకుండా కంట్రోల్ చేసుకోవాలి. గర్భధారణ సమయంలో క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.

గర్భిణీలు స్థూలకాయులైతే పాటించాల్సిన చిట్కాలు
మిమ్మల్ని మీరు యాక్టివ్ గా ఉంచుకోవాలి: మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యకరమైన గర్భధారణ కాలంను పూర్తి చేయవచ్చు. మీరు స్థూలకాయంతో ఉన్నప్పుడు నీరసంగా కనబడుతారు. గర్భం పొందిన తర్వాత కొన్ని సురక్షితమైర వ్యాయామాలు చేయడం ఉత్తమం.

హెల్తీ ఫుడ్ తీసుకోవాలి:
తల్లికి మరియు తల్లి కడుపులో పెరుగుతున్న బేబికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం అవుతుంది. అందుకోసం కాల్షియం, ప్రోటీన్స్ మరియు మంచి కొవ్వులున్న ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

కోరికలు:
గర్భం ధరించిన స్త్రీలలో ఆహారం మీద కోరికలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఆల్రెడీ మీరు స్థూలకాయంతో బాధపడుతుంటే మీలో స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నట్లైతే మీకున్న ఆహారపు కోరికలను అదుపు చేసుకోగలుగుతారు.

అధిక ప్రోటీలను తీసుకోవాలి:
స్థూలకాయంతో ఉన్నప్పుడు, మీరు అధిక ప్రోటీలను ప్రాధాన్యత ఇవ్వండి. అది మీకు ఎక్కువ శక్తిని అందిస్తుంది.

ఫ్యాట్స్ పూర్తిగా నివారించాలి:
మరో ముఖ్యమైన ప్రెగ్నెన్సీ చిట్కా ఫ్యాట్స్ అధికంగా కలిగి ఉన్నఅన్ని రకాల ఆహారాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి.

శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేషన్ లో ఉంచుకోవాలి:
ఆకలిని కంట్రోల్లో ఉంచుకోవడానికి నీళ్ళు బాగా సహాయపడుతాయి. కాబట్టి, మీరు ఆకలిగా ఉన్నప్పుడు ఒక బౌల్ హెల్తీ స్నాక్స్ తో ఒక గ్లాస్ నీళ్ళు త్రాగండి.

తేలికపాటి వ్యాయామాలు:
గర్భధారణ సమయంలో మీఅంతట మీరు చురుకుగా మరియు హెల్తీగా ఉండటం చాలా అవసరం. గర్భధారణ సమంయలో డాక్టర్ సలహా తో తేలికపాటి వ్యాయామాలు చేయడం చాలా అవసరం. అలాగే యోగా కూడా చేయవచ్చు.

మోటివేషన్:
గర్భాధారణలో ఉన్నప్పుడు ప్రేరణ కలిగి ఉండటం. ఇది ఒక ఉత్తమ గర్భధారణ చిట్కా. ప్రేరణ మైండ్ ను స్ట్రాంగ్ గా ఉండేందుకు సమాయపడుతుంది.

డైట్ :
గర్భిని స్థూలకాయంతో ఉన్నప్పుడు డైటింగ్ చేయకండి. గర్భిణీలు డైటింగ్ చేయడం వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం ఏర్పడవచ్చు.



Click it and Unblock the Notifications