Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
మహిళల్లో పిల్లలు కలగకపోవడానికి 10 కారణాలు
గణాంకాల ప్రకారం ప్రతి ఏడు జంటలలో ఒక జంట సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. మీరు ఒక సంవత్సరం పాటు సాధారణ అసురక్షిత సెక్స్ లో పాల్గొన్న సంతానం కలగకపోతే మీకు సంతానోత్పత్తి సమస్య ఉన్నదని చెప్పవచ్చు.
మీరు కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న సరే సంతాన ప్రాప్తి లేకపోవటం భాదకరముగా ఉంటుంది. వంధ్యత్వంను నిర్ధారించడం చాలా బాధాకరముగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి 7 జంటలలో ఒక జంటకు వంధ్యత్వం నిర్ధారణ అయింది. అందువలన ఇప్పుడు సంతానోత్పత్తి సమస్యల గురించి అవగాహన కల్పించటం ముఖ్యంగా మారింది.
చాలా మంది జంటలకు వంధ్యత్వానికి అనేక సహజ చికిత్స మార్గాలు ఉన్నాయని తెలియదు. వంధ్యత్వంలో రెండు రకాల ఉన్నాయి. ప్రాథమిక మరియు సెకండరీ వంధ్యత్వం అని పిలుస్తారు.
మహిళల్లో వంధ్యత్వానికి కారణాలు హార్మోన్ స్థాయిల నుండి ఇతర అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మహిళల్లో వంధ్యత్వానికి 10 అతి సాధారణ కారణాలు ఉన్నాయి.
అండోత్సర్గంలో లోపాలు
వంధ్యత్వం అనేది సాధారణంగా నెలవారీ గుడ్డు విడుదల మీద ఆదారపడి ఉంటుంది. కొంతమందికి అండోత్సర్గము సమస్యలు కారణం అయితే, ఆ స్త్రీ పూర్తిగా గుడ్డు విడుదలను నిలిపివేయాలి. కొంతమందికి గుడ్డు కొన్ని చక్రాల సమయంలోను విడుదల కాదు. అండోత్సర్గము సమస్యలకు క్రింది కారణాలు ఉండవచ్చు.

1. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోం : ఈ వైద్య పరిస్థితిలో అండాశయాలు గుడ్డును ఉత్పత్తి చేయటం కష్టం.
ప్రిమెచ్యూర్ అండాశయ వైఫల్యం: ఈ వైద్య పరిస్థితిలో ఆమె 40 సంవత్సరాల వయస్సుకు వచ్చినప్పుడు ఓవరీల పనితనం కోల్పోతుంది.
థైరాయిడ్ సమస్యలు: ఈ వైద్య పరిస్థితిలో అసాధారణ క్రియారహితంగా లేదా అతి చురుకుగా థైరాయిడ్ గ్రంథి ఉండుట వలన గుడ్డు విడుదలను నిరోదిస్తుంది.
2. ధూమపానం
ధూమపానం అనేది పురుషులు మరియు స్త్రీల ఇద్దరిలోను వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు వంధ్యత్వానికి చికిత్స చేయించుకోవాలని అనుకుంటే,ధూమపానం చికిత్స ప్రభావాలు తగ్గించాలి. స్త్రీ విజయవంతంగా గర్భం పొందినా,ఆమెకు గర్భస్రావ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
3. వయసు
ఒక స్త్రీకి 32 సంవత్సరాలు వచ్చే సరికి,ఆమె సంతానోత్పత్తి స్థాయిల క్షీణత ప్రారంభం అవుతుంది. 20 సంవత్సరాల మహిళ కంటే 35 సంవత్సరాల మహిళలో సంతానోత్పత్తి స్థాయి తక్కువగా ఉంటుంది.
4. ఆల్కహాల్ వినియోగం
మద్యం అధికంగా తీసుకోవడం ద్వారా గర్భం మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మద్యపానం మిత స్థాయిలో ఉన్న వంధ్యత్వం స్థాయి తక్కువ చూపించదు. కానీ ఇప్పటికే సంతానోత్పత్తి తక్కువ స్థాయి కలిగిన మహిళలు మరింత మద్యం తాగితే వారి అవకాశాలు మరింత తగ్గుతాయి. అలాగే, ఒకవేళ స్త్రీ గర్భం పొందితే కనుక ఆమె లోపాలతో ఉన్న బిడ్డకు జన్మనిస్తారు.
5. ఊబకాయం
పారిశ్రామీకరణ చెందిన దేశాల్లో,ఒక నిశ్చల జీవనశైలి కలిగిన ఉండుట వలన అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న మహిళల్లో వంధ్యత్వం కనపడుతుంది. ఒక నిశ్చల జీవనశైలి కారణంగా అధిక బరువు మరియు వంధ్యత్వం అనేవి వస్తాయి.
6. ఈటింగ్ డిజార్డర్స్:
చాలా బరువు లేదా ఒక ఈటింగ్ డిజార్డర్ ఫలితంగా,మహిళలకు గర్భం అసమర్థత బాధ పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
7. శాకాహారి కావడం
ఇది ఒక విస్తృతమైన చర్చకు లోబడి ఉండవచ్చు. సైన్స్ ప్రకారం,ఒక ఖచ్చితమైన శాకాహారి ఎవరైనా వారు మాంసాహార ఆహారాలలో ఉండే పోషకాలను కోల్పోవటం వలన వంధ్యత్వ ప్రమాదం ఉంటుంది. ఆ పోషకాలలో ఇనుము, జింక్,ఫోలిక్ ఆమ్లం,విటమిన్ బి 12 మొదలైనవి ఉంటాయి. శాకాహారులు వాటిని మందులు రూపంలో తీసుకోవటం మరియు వారి ఆహారంలో ఈ పోషకాలు ఉండేలా ప్రయత్నించాలి. అయితే మీరు మందులు తీసుకునే ముందు మీరు మీ డాక్టర్ ని సంప్రదించాలి.
8. వ్యాయామం లేకపోవడం
ఒక నిశ్చల జీవనశైలి కారణంగా పురుషులు మరియు మహిళల్లో వంధ్యత్వానికి కారణం అవుతుంది. అందువల్ల వ్యాయామంను రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి.
9. ఓవర్ గా చేయడం
వ్యాయామం మరియు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండే ప్రయత్నంలో,మీ శరీరాన్ని ఓవర్ గా వినియోగిస్తారు. రోజుకు 7 గంటలు వ్యాయామం చేసే మహిళలలో అండోత్సర్గము సమస్యలు ఉండవచ్చు.
10. ఒత్తిడి:
స్త్రీ అండోత్సర్గము అనేది మానసిక ఒత్తిడి వల్ల ప్రభావితం కావచ్చు.కాబట్టి,వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించటానికి ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications











