Latest Updates
-
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే!
గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబు నివారించే మార్గాలు
ప్రతి ఒక్క మహిళకు తన జీవితంలో ప్రెగ్నెన్సీ చాలా ఎక్సైటింగ్ సమయం. మహిళ మొదటి సారి గర్భం పొందడం ఒక మధురానుభూతి . ఇది మహిళకు ఒక కొత్త అనుభూతి. అనుభూతితో పాటు మనస్సులో అనేక అపోహాలు అందోళనలు . ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు, మెడిసిన్స్ తీసుకోవాలన్న ఆలోచనలు కలుగుతాయి. ముఖ్యంగా గర్భం పొందిన తర్వాత ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ 6నెలల్లో 2వ ట్రైమిస్టర్ పూర్తి అవుతుంది . మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే మూడవ టైమిస్ట్రర్స్ లో మొదలవుతుంది. ఈ సమయంలో గర్బంలోని బేబీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
గర్భం పొందిన తర్వాత పొట్టలో పెరిగే బిడ్డకు ఒక కొత్త జీవితాన్ని అందివ్వడంలో తల్లి యొక్క శరీరంలో వ్యాధినిరోధక శక్తిలోహెచ్చుతగ్గులుంటాయి . అటువంటి పరిస్థితుల్లో బేబీ సురక్షితంగా ఉండటం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, దగ్గు మరియు జలుబుకు కారణం అవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే అత్యంత సాధారణ జబ్బుల్లో జలుబు దగ్గు ఒకటి.
READ MORE:గర్భిణీలు దగ్గు నివారణ మందులు తీసుకోవడం సురక్షితమేనా?
మరి గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందడానికి నివారించుకోవడం ఎలా అని ఆందోళ చెందుతుంటారు. అందుకు హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. గర్భధారణ సమయంలో డాక్టర్స్ సూచించన మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు గురికావల్సి ఉంటుంది . మరియు ఎలాంటి సెల్ఫ్ మెడికేషన్స్ ను ఉపయోగించకపోవడం మంచిది . ఇలా చేయడం వల్లపొట్టలో పెరిగే బేబీకి హాని కలిగిస్తుంది.
READ MORE: బేబీ తెలివితేటలతో పుట్టాలంటే ఖచ్చితంగా ఇవి తినాల్సిందే...
జలుబు మరియు దగ్గు నివారించడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఉపయోగపడుతాయి. అయితే కాస్త ఆలస్యం అయినా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. . అయితే పిల్లలు సురక్షితంగా ఉంటాయో లేదా తెలుసుకొని మరి వాడాలి. ఆరు నెలల్లో వచ్చే జలుబు మరియు దగ్గు నివారించడానికి కొన్ని సాధారణ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం....

సెలైన్ నాజల్ డ్రాప్స్:
జలుబు చేస్తే శ్వాసనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల శ్వాస పీల్చడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి, సెలైన్ నాజల్ డ్రాప్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు ఇది సురక్షితమైనది. ఇది బేబికి ఎలాంటి హాని కలిగించదు . ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు జలుబు మరియు దగ్గు నివారించడానికి దీన్ని ప్రయత్నించవచ్చు.

స్టీమింగ్
స్టీమిక్ చాలా ఎఫెక్టివ్ మరియు నాజల్ బ్లాకేజ్ ను క్లియర్ చేయడానికి స్టీమింగ్ సిస్టమ్ ను సిఫారస్సు చేయబడినది. కానీ ఎలాంటి మందులైనా నీటిలో కలిసిపోతాయి, కాబట్టి డాక్టర్ ను కలవకుండా ఎలాంటి మెడిసిన్స్ స్టీమింగ్ చేసే హాట్ వాటర్లో మిక్స్ చేయకూడదు

విశ్రాంతి తీసుకోవాలి
గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గు నివారించడం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ కు మరింత కష్టంగా ఉంటుంది . అయితే శరీరం ఈ సమస్య నుండి తేరుకోవడానికి కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. శరీరానికి స్ట్రెయిన్ అయ్యే పనుల నుండి దూరంగా ఉండాలి.

సాల్ట్ వాటర్ తో గార్గిలింగ్ చేయాలి:
జలుబు ద్వారా గొంత నొప్పి కూడా వస్తుంది. దీన్ని ఉప్పునీటితో గార్గిలింగ్ చేయడం ద్వారా కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా ఉప్పును గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి గొంతులో పోసి గార్గిలింగ్ చేయాలి. రోజూ మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆ నీటిలోనే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి.

అల్లం టీ:
గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గు నివారించడానికి అల్లం టీ మరో ఉత్తమ పద్దతి.ఇది సాధారణంగా వచ్చే జలుబును చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . దీన్నీ రెగ్యులర్ గా త్రాగుతుంటే మూడు, నాలుగు రోజుల్లో ఉపశమనం కలిగిస్తుంది .

తేనె:
దగ్గు మరియు గొంతు నొప్పి నివారించడంలో తేనె ఆల్ టైమ్ ఫేవరెట్ . ఒక టీస్పూన్ తేనెను తీసుకొని నేరుగా తీసుకోవడం లేదా టీలో మిక్స్ చేసుకొని తీసుకోవడం మంచిది . అలాగే తేనె మరియు నిమ్మరసం తీసుకోవడం కూడా గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబును తగ్గిస్తుంది.

పుదీనా
గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబును ఎలా నివారించుకోవాలనుకుంటే, జలుబు, దగ్గకు పుదీనా ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ . పుదీనాలో ఉండే మెంతాల్ గొంతు నొప్పి మరియు దగ్గును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పుదీనా రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు!



Click it and Unblock the Notifications