Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీలకు మెంతులతో బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్
గర్భధారణ సమయం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో చాలా మరింత ఏకాగ్రత, కేరింగ్ అవసరం. ఎందుకంటే మొదటి మూడునెల్లో పిండం పూర్తిగా ఏర్పడి ఉండదు కాబట్టి, గర్భిణీ స్త్రీ తీసుకొనే ప్రతి ఒక్క ఆహారం మీద ఒక కన్నేసి ఉంచాలి. తినే ఆహారం వల్ల పిండానికి ఎలాంటి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గర్భిణీలకు ఇతర మందులతో పోల్చినప్పుడు ప్రక్రుతి పరంగా మనకు అందుబాటులో ఉండే హెర్బ్స్ ఆరోగ్యానికి ఉత్తమమైనవి మరియు చౌకైనవి కూడా. ప్రస్తుతం ఔషధాలు, పౌడర్లు, సప్లిమెంట్స్, క్యాప్స్యూల్స్, టీ అండ్ ఇన్ఫ్యూషన్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి సహాయపడుతాయి . హెర్బ్స్ లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ గర్భధారణ సమయంలో వచ్చే స్ట్రెస్, వికారం, మరియు మజిల్ క్రాంప్స్ వంటి ఎన్నో సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అలాంటి హేర్బల్ రెమెడీస్ లో మెంతి ఆకులు లేదా మెంతులు కూడా ఒకటి.
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీకి సహాయపడే హెర్బ్స్
వంటకాలలో వేసే మెంతులు గర్భవతులకు అద్భుత ప్రయోజనాలు చేకూరుస్తాయి. ప్రసవం తర్వాత స్తనాలలో పాలు బాగా పడేలా చేస్తాయి. స్తనాలు పెద్దవి కాకుండా నియంత్రిస్తాయి. ప్రసవం తర్వాత వచ్చే అనేక సమస్యలకు జవాబుగా నిలుస్తాయి. మెంతుల ప్రయోజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలిస్తే....

షుగర్ లెవెల్ -
గర్భవతి మెంతులు తినేటపుడు జాగ్రత్తగా వుండాలి. రక్తంలో షుగర్ స్ధాయి తగ్గించే గుణం వీటికి వుంది. వాస్తవానికి వైద్యుని సలహాపై వీరు మెంతులు తినాలి.

స్తనాలు పెద్దవైపోకుండా నియంత్రిస్తాయి
హార్మోన్లను నియంత్రించి స్తనాలు పెద్దవైపోకుండా నియంత్రిస్తాయి. మెంతుల రసాన్ని డికాషన్ లా తాగాలి. ప్రసవం తర్వాత ప్రతిరోజూ వైద్యుల సలహాపై 3 నుండి 4 గ్రాముల మెంతులు తినడం మంచిది.

బిడ్డ తేలికగా పుడతాడు.
- వైద్యుని సలహాపై ప్రతిరోజూ కొద్దిపాటి మెంతులు తింటే, ప్రసవం తేలికవుతుంది. గర్భాశయ సంకోచ వ్యాకోచాలు
నియంత్రించబడతాయి.

తల్లిపాలు వృద్ధి అవుతాయి -
మెంతులు తింటే...స్తనాలలో పాలు 500 శాతం పెరిగినట్లు పరిశోధకులు చెపుతున్నారు. రోజుకు మూడు సార్లు అతి కొద్దిగా తింటే చాలని చెపుతారు.

గర్భ విచ్ఛిన్నం -
మెంతులు తింటే గర్భాశయ సంకోచ వ్యాకోచాలుంటాయి కనుక అది గర్భ విచ్ఛిన్నానికి కూడా తోడ్పడగలదు. కనుక వైద్యుల సలహాపై మాత్రమే గర్భవతులు మెంతులు తినాలి.

ప్రీమెచ్యుర్ బేబి
గర్భవిచ్చిన్నం: గర్భిణీ స్త్రీలు మోతాదుకు మించి మెంతులు తీసుకోవడం వల్ల గర్భస్రావం జరుగుతుంది. ప్రీమెచ్యుర్ లేబర్ లేదా మిస్కరేజ్ కు కారణం అవుతుంది కాబట్టి మోతాదుకు మించి తీసుకోకూడదు.

అజీర్తి:
గర్భధారణ సమయంలో మెంతులును ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్యలున్నవారిలో పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి వికారం, గ్యాస్, బ్లోటింగ్ లేదా డయోరియా తగ్గించుకోవాలంటే మితంగా తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకోకూడదు

అలర్జీ రియాక్షన్స్ :
గర్భిణీ స్త్రీలకు మెంతులు అలర్జీని కలిగిస్తాయి . ముఖంగా మోతాదుకు మించి తీసుకుంటే ముక్కుదిబ్బడ, శ్వాసలో ఇబ్బంది, దగ్గు మరియు వాపులు కనబడుతాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను కలవండి.



Click it and Unblock the Notifications