గర్భిణీ స్త్రీలకు అత్యవసరం అయిన నాలుగు స్కానింగ్స్

బిడ్డ పుట్టటం ప్రక్రుతి సహాజ ప్రక్రియ. చాలా మంది విషయంలో ఇది సజావుగానే జరుగుతుంది కానీ..నూటికి ఒకరికి మాత్రం తీవ్రమైన మానసిక లేదా శారీరక లోపాలు తెలత్తే అవకాం ఉందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. వీటిలో డౌన్ సిండ్రోమ్ వంటివి క్రోమోజోముల లోపాల కారణంగా తలెత్తితే..

మరికొన్ని తల్లి నుంచి బిడ్డకు రక్తప్రసరణ సరిగా లేకపోవటం, దానికి సంబంధించిన రకరకాల లోపాల వల్ల కూడా తలెత్తవచ్చు. గర్భిణికి నిర్ధిష్ట సమయాల్లో చేసే స్కానింగ్ వల్ల ఇలాంటి లోపాల గురించి ముందే తెలుసుకోవడం వీలవుతుంది. ఈ క్రమం గర్భం ధరించిన తర్వాత ఎప్పుడు స్కానింగ్ చేయాలి? ఎన్ని సార్లు చేయాలి? మొదలైన వివరాలు తెలుసుకుందాం...

మొదటి స్కానింగ్

మొదటి స్కానింగ్

గర్భం పొందిన తర్వాత మొదటగా 7-10వారాల్లో ఒకసారి స్కానింగ్ చేసి...అసలు పిండం గర్భాశయంలోనే పెరుగుతోందా? లోపల ఎన్ని పిండాలు పెరుగుతున్నాయి?వంటి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుంటారు.

మూడో నెల స్కానింగ్:

మూడో నెల స్కానింగ్:

మూడో నెల చివర్లో అంటే ...11-13 వారాల మధ్యలో చేసే ఈ స్కానింగ్ ను ‘న్యూకల్ ట్రాన్స్ల్యుసెన్సీ స్కాన్ ’ అంటారు. ిపండం మెడ దగ్గరి ముడతల మందాన్ని కొలిచి, దాన్ని తల్లి వయస్సు వంటి ఇతరాత్రా వివరాలతో క్రోడీకరిస్తూ లెక్కించటం ద్వారా పిండంలో ఏవైనా జన్యుపరమైన, క్రోమోజోముల లోపాలు తలెత్తుతున్నాయేమో అంచాన వేయడం దీని లక్ష్యం. ముఖ్యంగా తీవ్రస్థాయి మానసిక లోపమైన డౌన్ సిండ్రోమ్’ ముప్పును అంచనా వెయ్యటానికి ఇది చాలా కీలకరమైన స్కానింగ్. పైగా ఇదే సమయంలో బిడ్డలో ప్రాథమికమైన శారీరక నిర్మాణాలు ఎలా ఉన్నాయన్నదీ చూడొచ్చు. ముఖ్యంగా పుర్రె ఎముక ఎలా ఉంది, గుండె గదులు ఏర్పడటం, వెన్ను లేకపోవటం, ఉన్నా సరిగా పూడకపోవటం, కిడ్నీల్లేకపోవటం, ఇలాంటివేమైనా ఉంటే ఈ స్కానింగ్ లో పసిగట్టవచ్చు. సత్వరమే గుర్తించటం ద్వారా తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన మిగలకుండా చూడవచ్చు.

ఐదోనెల స్కాన్:

ఐదోనెల స్కాన్:

ఐదోనెలలో చివర్లో ...అంటే సాధారణంగా 2-23వారాల మధ్యలో చేసే ఈ ‘అనామలీ స్కానింగ్’లో బిడ్డలో పుట్టుకతోనే ఏవైనా శారీరక అవకరాలు వస్తున్నాయోమో క్షుణ్ణంగా గమనిస్తారు. ఈ సమయానికిల్లా బిడ్డకు సంబంధించిన చాలా అవయవాలు ఏర్పడి ఉంటాయి. కాబట్టి వాటిలో నిర్మాణపరమైన లోపాలుంటే గుర్తించటం సులభమవుతుంది. ఈ స్కానింగ్ లో చేతులు, కాళ్లు, ఐదు వేళ్ళు, మెదడు, దానిలోని నిర్మాణాలు, వెన్నుపాము, ముఖం , పెదాలు చీలి మొర్రెలా ఉన్నాయా? ఇవన్నీ స్పష్టంగా చూస్తారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, జీర్ణాశయం, పేగులు, ఎముకలన్నీ చక్కగా పెరుగుతున్నాయ? లేదా గమనిస్తారు. ముఖ్యంగా ఈ సమయానికి గుండె చాలా వరకూ ఏర్పడి ఉంటుంది. కాబట్టి 4 గదుల మధ్య గోడల్లో రంధ్రాలేమైనా ఉన్నాయా? గదుల మధ్య రక్తస్రావ ఎలా ఉంది, గుండె చుట్టూ నీరు చేరిందా? వంటివి కూడా చూడవచ్చు.

ఐదోనెల స్కాన్:

ఐదోనెల స్కాన్:

కొన్ని సార్లు నిర్మాణపరంగా చూస్తుంటే, ఒకటి, రెండు, మూడు లోపాలు కనబడుతుంటే ఏదైనా క్రోమోజోములు సమస్యలున్నాయోమో మరోసారి సరిచూసుకోవచ్చు. అదే సమయంలో బిడ్డ చుట్టూ ఉమ్మనీరు ఎంత ఉందో కూడా చూస్తారు. తల్లికి హైబీపి, తద్వారా గర్భవాతంఅవకాశంఉందా? అన్నది తెలుసుకోవటం చాలా అవసరం. అది తల్లికి ముప్పు తెచ్చిపెట్టటమే కాకుండా బిడ్డ ఎదుగుదలను కూడా దెబ్బతీస్తుంది. అందుకే ఈ సమయంలో గర్భాశయానికి రక్తం సరఫరా చేసే ధమని, దానిలో రక్త స్రసరణ ఎలో ఉందో ‘యూటరిన్ ఆర్టీ డాప్లర్' ద్వారా గమనిస్తారు. దీనిలో రక్త ప్రసరణ బాగుంటే ఆ తల్లికి హైబీపిగానీ, బిడ్డలో ఎదుగుదల లోపాలుగాని వచ్చే అవకాశాలు తక్కువని భావించవచ్చు. ఒక వేళ రక్తప్రసరణ అస్తవ్యస్తంగా ఉంటే అప్పటి నుంచే జాగ్రత్తగా గమనించటం ఆరంభిస్తారు. ఈ స్కానింగ్ లోనే...నెలలు నిండకుండానే కాన్పు జరిగే ముప్పు ఉందేమో అంచనా వేసేందుకు గర్భశయ ముఖద్వారం పొడవును కూడా చూస్తారు. ఈ చిన్నపాటి స్కానింగ్ పరీక్షతోనే ఇన్ని రకాల అంశాలను క్షుణ్ణంగా గమనించే వీలుంటుంది.

ఎనిమిదో నెల స్కాన్:

ఎనిమిదో నెల స్కాన్:

30-32 వారాల్లోమరోసారి స్కానింగ్ చేస్తే (గ్రోత్ స్కాన్)లోపల బిడ్డ ఎదుగుదల ఏ తీరులో సాగుతోందన్నది చక్కగా తెలుస్తుంది. ఒకవేళ బిడ్డ ఆశించినంతగా ఎదగలేదనుకుంటే...ఒక్కసారి వెనకటి పరీక్షల వివరాలు చూసి...ఉమ్మనీరు ఎలా ఉంది, తల్లి నుండి రక్తప్రసారం ఎలా ఉందన్నది మరోసారి పరిశీలించవచ్చు. పిండ ఎదుగుదల సహజంగా ఉందా లేదా బయట లేదా లోపలో ఏదైనా లోపం ఉందా? కారణమేమిటన్నది పరిశీలిస్తారు.

అవసరాన్ని బట్టి మరో స్కానింగ్

అవసరాన్ని బట్టి మరో స్కానింగ్

అంతా బాగుండి 40 వారాలు నిండినా నొప్పులు రావటం లేదంటే అప్పు మరో సారా స్కాన్ చేసి ఉమ్మనీరు ఎంత ఉందో చూస్తారు. నీరు బాగుంటే మాయ బాగుందని అర్ధం. నీరు తగినంత లేకపోతే క్రుత్రిమంగానైనా నొప్పులు తెప్పించటం మంచిదేమో పరిశీలిస్తారు. అలాగే తల్లి ఊబకాయంతో ఉంటే లోపల బిడ్డ ఏ భంగిమలో ఉందో చూసేందుకు కూడా కొన్ని సార్లు కాన్పుకు ముందు మరోసారి స్కానింగ్ చేస్తారు.

Story first published: Monday, August 17, 2015, 17:09 [IST]
Desktop Bottom Promotion