ప్రసవ సమయంలో పురుషుని యొక్క పాత్ర

By Super

గర్భధారణ, కాన్పు సమయంలో పాత్ర గురించి అందరికీ తెలుసు కానీ కాన్పు రోజున పురుషుడు తప్పక తన పాత్ర పట్ల శ్రద్ధ వహించాలి. నిజానికి ఆ రోజు తండ్రి శ్రద్ధ, సహనం అవసరం, సహాయం చేయడానికి అందుబాటులో ఉండాలి. స్త్రీ జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయమైన కాన్పు సమయంలో తోడ్పాటుగా ఉండడం చాలా మంచిది.

ఒక తండ్రిగా మీ భార్యకు మీకు చేతనైనంత చేయగలిగితే, ఆమె కాన్పు నుండి చాలా తేలికగా బైటపడుతుంది. అంతేకాకుండా, అలంటి కష్ట సమయంలో మీరు ఆమెను నిర్లక్ష్యం చేయలేదని చాలా ప్రాధాన్యతను ఇచ్చారని భావిస్తుంది. కాన్పు సమయంలో భయ౦తో ఉన్న ఏ భార్యకైనా, ఆమె మనసుకి ధైర్యం చెప్పగల వాడు భర్త ఒక్కడే. నొప్పి ఎక్కువగా ఉంటె, ఏం ఫరవాలేదు, త్వరగా కోలుకు౦టావు అని భర్త ధైర్యం చెప్పాలి. ఇప్పుడు, కాన్పు సమయంలో భర్త పాత్రను గురించి మరికొంత చర్చించుకుందాం.

Man's Role During Labor

తికమకగా ఉండడం
కాన్పు సమయంలో ఉద్వేగంగా, అలాగే ఎంతో కష్టంగా కూడా ఉంటుంది. ఎన్నో గంటలు ఎదురు చూడాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో మీ భార్య మనసుని వేరే విషయంపై మళ్ళించి, నీ మానసిక స్థితి బాగుంది అని చెప్పడం ముఖ్యం. నొప్పుల సమయంలో ఆమె ఉద్రేకంతో లేదా ఒత్తిడితో ఉండకూడదు. ఆ సమయంలో మీ దగ్గర ఒక ఐ పాడ్ లేదా ఇతర వస్తువులేమన్నా ఉండడం మంచిది, అందులో ఆమె సంగీతం వినడం లేదా గేమ్స్ ఆడడంతో సమయాన్ని గడుపుతుంది.

Man's Role During Labor

సహనాన్ని కోల్పోవద్దు
పురిటి నొప్పులు ఎంత ధైర్యవంతురలినైనా భయపెడుతుంది. అందువల్ల, ఒక భర్తగా, ఆ రోజు మీరు అలంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి. మీ భార్య మిమ్మల్ని అరిచినా, కేకలేసినా, చేదుగా అనుకోవద్దు, నొప్పులు ఆమెను అలా చేస్తాయి. మిమ్మల్ని అవమానించడం ఆమె ఉద్దేశ్యం కాదు. అందువల్ల, కాన్పు సమయంలో భర్త చాలా సహనంగా ఉండాలి.

Man's Role During Labor

మీ ఆలోచనలను పైకి చెప్పండి
అనువుగా ఉండడం చాలా అవసరం. కాన్పు సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నిపుణులు కూడా గ్రహించలేక పోయారు. అందువల్ల మీ ఆలోచనలను పైకి తెలియచేయండి దానివల్ల అవసరాలను బట్టి మీరు వాటిని మార్చుకోవచ్చు. కాన్పు సమయంలో అనువుగా ఉండడం అనేది తండ్రి పాత్ర.

Man's Role During Labor

సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి.
కాన్పు రోజు, అవసరమైన వస్తువుల కోసం మీరు అటూ ఇటూ వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ డాక్టర్ మిమ్మల్ని కొన్ని మందులు త్వరగా తీసుకురమ్మంటే, మీరు పరిగెట్టడం అవసరం. లేదా మీ భార్యకు ఆకలిగా ఉంటె, మీ భార్య కోసం డాక్టర్ ఏదైనా ఆహరం తీసుకు రమ్మంటే, అవి మీరు త్వరగా చేయాలి. ఇలాగే, ఆరోజు మీరు ఏదైనా త్వరగా చేయడానికి అందుబాటులో. సిద్ధంగా ఉండాలి. ఇది కాన్పు సమయంలో తండ్రి పాత్ర.

Story first published: Saturday, February 7, 2015, 16:06 [IST]
Desktop Bottom Promotion