Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
గర్భిణీలు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి
గర్భం దాల్చిన దగ్గరనుంచి ప్రసవమయ్యే వరకు గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం చాలా కీలకమైనది. ఆహార నియమాలను కచ్చితంగా పాటించడంతో పాటు స్మోకింగ్, డ్రింకింగ్ వంటి కొన్ని రకాల వ్యసనాలకు దూరంగా ఉండటం ఉత్తమం. లేకపోతే ఈ వ్యసనాలు పుట్టబోయే బిడ్డపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలున్నాయి. కాబట్టి బిడ్డ పుట్టబోయే ఆరోగ్యంగా ఉండేందుకు గర్భిణీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కెఫైన్
కెఫైన్ ని అవాయిడ్ చేయడం ఉత్తమం. ఒక వేళ, కెఫైన్ లేకుండా ఉండలేకపోతే కనీసం తీసుకునే శాతాన్ని తగ్గించండి. సోడా, కోలా, స్పోర్ట్ డ్రింక్స్ లో కెఫైన్ శాతం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రెగ్నన్సీ సమయంలో కెఫైన్ ను తీసుకోవడం వల్ల గర్భ స్రావమయ్యే ప్రమాదం అధికం. ఈ ప్రమాద తీవ్రత ఫస్ట్ ట్రిమిస్టర్ లో అధికంగా ఉంటుంది. గర్భస్థ శిశువుకు కూడా ప్రమాదాలు ఏర్పడవచ్చు. కెఫైన్ ను అధికంగా తీసుకుంటే శిశువు అతి తక్కువ బరువుతో పుట్టే ప్రమాదంతో పాటు నెలలు నిండకుండానే ప్రసవమయ్యే ఛాన్స్ లు అధికమని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తద్వారా, వివిధ కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనా ప్రకారం కెఫైన్ ను 300మిల్లీ గ్రాముల కంటే తక్కువగా తీసుకుంటే గర్భిణులలో ఎదురయ్యే అనారోగ్యాలను కొంత మాత్రం తగ్గించవచ్చు.

2. పచ్చి మాంసం - చేపలు
ఉడకని, వండని ఆహార పదార్థాలను గర్భిణులు తీసుకోకపోవడమే మంచిది. పచ్చి గుడ్లు, పచ్చి మాంసం, చేపలను పూర్తిగా అవాయిడ్ చేయాలి. సరిగ్గా ఉడకని, పచ్చి సీ ఫుడ్ ని తీసుకోవడం వల్ల తల్లికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంతే కాకుండా, కొన్ని రకాల వ్యాధులకు కూడా గురయ్యే అవకాశాలు ఎన్నో. ఇటువంటి ఆహార పదార్థాల ద్వారా గర్భిణికి ఇన్ఫెక్షన్ సోకినట్లయితే గర్భస్థ శిశువుకు కూడా ప్లాసేంటా ద్వారా ఈ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. వీటివల్ల శిశువు నెలలు నిండకుండానే పుట్టే ప్రమాదం ఉంది. శిశువులో మానసిక అనారోగ్యాలు కూడా చేరతాయి.

3. అన్ పాశ్చరైజ్డ్ చీజ్ లేదా మిల్క్
ప్రెగ్నన్సీలో రోగ నిరోధక శక్తి మందగిస్తుంది. ఆహారంతో పాటు వ్యాధులకు గురయ్యే ప్రమాదాలు ఎక్కువ. లిస్టేరియస్ కి గురయ్యే ప్రమాదం గర్భిణిలలో ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి పచ్చి ఆహరంగాని అన్ పాశ్చరైజ్డ్ చీజ్ లేదా మిల్క్ గాని తీసుకోవడాన్ని అవాయిడ్ చేయాలి.
అన్ పాశ్చరైజ్డ్ చీజ్ లేదా మిల్క్ లో ఉండే బాక్టీరియా ప్లాసెంటాని దాటుకుని గర్భస్థ శిశువు వరకు చేరి మిస్ క్యారేజ్ ను కలిగించే అవకాశం కలదు. ముందు జాగ్రత్తగా మిల్క్ ను, ఛీజ్ ను కొనుక్కునే ముందు లేబుల్స్ ను చెక్ చేసుకోవడం మంచిది. వీటిని గర్భిణులు తీసుకోవచ్చా లేదానన్న విషయాన్ని తప్పకుండా పేర్కొనవలసిన అవసరం ఉందని ఎఫ్డీఏ స్పష్టం చేసింది.

4. స్ట్రీట్ ఫుడ్స్
వీధిలో దొరికే ఆహారాలను తీసుకోకూడదు. స్ట్రీట్ ఫుడ్స్ ని తింటే గర్భిణులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అనారోగ్యకర వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తారేమోనన్న భయంతో గర్భిణులు వీటిని తీసుకోకపోవడం మంచిది. స్ట్రీట్ ఫుడ్స్ ను అమితంగా తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. అనారోగ్యానికి మందులు తీసుకోవలసి వస్తుంది. ఆ మందులు గర్భస్థ శిశువుపై దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి, వీలైనంత వరకు స్ట్రీట్ ఫుడ్స్ కు దూరంగా ఉండడం ఉత్తమం. గర్భిణీలలో రోగనిరోధక శక్తి మందగిస్తుంది కాబట్టి త్వరగా అనారోగ్యానికి గురవుతారు. కొద్ది పాటి జాగ్రత్తల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.

5. ఆల్కహాల్
అప్పుడపుడూ ఆల్కహాల్ ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తకపోవచ్చు. అయితే, మితిమీరి సేవిస్తే ప్రమాదాలు వెంటాడుతాయి. గర్భస్థ శిశువు అవయవాలు సరిగ్గా ఎదగకపోవడం, వారి మెదడు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వంటి దుష్ప్రభావాలుంటాయి. అంతే కాదు, అసాధారణ ముఖ లక్షణాలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
ఇవన్నీ ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండేందుకు కారణాలుగా మీకు సరిపోకపొతే, ఆల్కహాల్ ని గర్భిణీలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై జరిగిన అధ్యయనం గురించి మాట్లాడుకుందాం. గర్భిణులు ఆల్కహాల్ ను సేవిస్తే గర్భస్థ శిశువుకు చైల్డ్ హుడ్ అక్యూట్ ల్యుకేమియా సోకే ప్రమాదం ఉంది. ఇంకొక అధ్యయనం ప్రకారం, ఆల్కహాల్ సేవనం ప్లాసేంటా పై తీవ్రంగా ఉంటుదని. ఫెటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కు గర్భస్థ శిశువు గురయ్యే ప్రమాదం అత్యధికం.

6. సిగరెట్స్
గర్భిణులపై సిగరెట్స్ వల్ల దుష్ప్రభావం చూపుతాయి. సిగరెట్ తాగే అలవాటున్న గర్భిణీలు ఈ అలవాటు నుంచి వీలైనంత త్వరగా బయటపడడం ఉత్తమం. వీటిలో ఉండే నికోటిన్, కార్బన్ మోనో ఆక్సైడ్, తార్ గర్భస్థ శిశువుకు చేరి శిశువుకు ఆక్సిజన్ సప్లయ్ ను తగ్గిస్తాయి. బర్త్ డిఫెక్ట్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. తక్కువ బరువుతో పుట్టడం వంటి ప్రభావాలు ఎన్నో. ఒక అధ్యయనం ప్రకారం దాదాపు 10 సిగరెట్స్ ను ఒక రోజులో తీసుకుంటే నెలలు నిండకుండానే ప్రసవమయ్యె అవకాశాలు ఎక్కువ.

7. గ్రీన్ టీ
గర్భిణీలకు గ్రీన్ టీ మంచిదని కచ్చితంగా తెలిపే ఆధారాలు ఏవీ లేవు. గ్రీన్ టీకి గర్భిణీలు దూరంగా ఉంటే మంచిది. గర్భిణీలలో సహజ సిద్ధంగా మెటబాలిక్ రేట్ అధికంగా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిక్ రేట్ మరింత పెరుగుతుంది. అత్యధికంగా మెటబాలిక్ స్థాయిలు పెరగడం ఆనందించదగ్గ పరిణామం కాదు. అంతే కాదు, గ్రీన్ టీలో ఉండే కొద్ది పాటి కెఫైన్ కూడా సాధారణ టీ వల్ల దుష్ప్రభావలతో సమానంగా ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీను అత్యధికంగా సేవించడం వల్ల గర్భిణీలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ తక్కువవుతుంది. పుట్టబోయే పిల్లల్లో ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కలిగే వ్యాధులు సోకే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications











