For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో అలర్జీలకు గుడ్ బై చెప్పే హోం రెమెడీస్

By Super
|

సహజంగా చాలా మంది ఉన్నట్లుండి అలర్జీల బారీన పడుతుంటారు. వాతావరణంలో వచ్చే మార్పులతో కొంత మంది అలర్జీలకు గురైతే, మరికొందరు, ఆహారాలు, పానీయాలు, పువ్వుల వల్ల అలర్జీకి కారకులవుతుంటారు. ఇక ఇల్లల్లో డస్ట్, గార్డెన్ లోని పాలెన్స్, పొల్యూషన్, నట్స్, వంటివన్నీ కూడా అలర్జీలకు కారణమే . ముఖ్యంగా గర్భణీ స్గ్రీలు ఇటువంటి పరిస్థితిలో శారీరకంగా మరియు మానసికంగా అనేక మార్పులను ఎదుర్కొంటుంటారు . శరీరంలో మార్పులే కాకుండా, బాడీ పెయిన్ కూడా సహజమే. అయితే, ప్రస్తుతం ఉన్న మార్పులకు, బాడీపెయిన్స్ కు తోడు అలర్జీలు తోడైతే ఇక పరిస్థితి ఏంటిం? ముఖ్యంగా గర్భావస్థ దశలో అలర్జీలకు గురికాకూడదు. అలర్జీల వల్ల శ్వాసలో ఇబ్బందులు, ఇది గర్భిణీ స్త్రీలలో చాలా సాధారణంగా వచ్చే లక్షణాలు. ఇవి గర్భిణీలో హార్మోనులు పెరుగుదల మరియు బ్లడ్ వాల్యూమ్ వల్ల వస్తుంది.

అందువల్ల, ప్రెగ్నెన్సీలో అలర్జీలను నివారించుకోవడానికి హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఇవి సుక్షితమైనవి మరియు నేచురల్ వి, వీటి వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, సైడ్ ఎపెక్ట్స్ కానీ ఉండవు . అయితే, ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల పొట్టలో పెరిగే బేబీకి హాని కలుగుతుంది . కాబట్టి, అలర్జీలకు గర్భిణీలో హోం రెమెడీల మీద ఆధారపడటం మంచిది, ఉదాహరణకు, సెలైన్ ద్రవాన్ని ముక్కులో వేసుకోవడం అలర్జీని తగ్గిస్తుంది .

గర్భధారణ సమయంలో అలర్జీలను నివారించడానికి మరికొన్ని హోం రెమెడీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లోని డస్ట్ చేరే కార్పెట్ మరియు మ్యాట్స్ ను తరచూ శుభ్రపరుస్తుండాలి. కార్పెట్, లేదా రగ్ మ్యాట్ రెగ్యులర్ గా ఇంట్లో వేసుకొని ఉండాలంటే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలి. దుమ్ముదులిపి సన్ లైట్ లో ప్రతి రోజూ ఒక గంట పాటు వేయాలి . ప్రతి వారం బెట్ సీట్లను మార్చాలి. వేడి నీటిలో వేసి శుభ్రం చేయడం వల్ల అలర్జీలకు కారణం అయ్యే బ్యాక్టీరియా, పోలెన్ ను నివారిస్తుంది. మరియు వాతావరణం పొడిగా ఉన్నప్పుడు విండోస్, డోర్స్ క్లోజ్ చేసి ఉండాలి . అలాగే గర్భిణీలు తీసుకొనే ఆహారాల మీద కూడా ఓకన్నేసుండాలి . ముఖ్యంగా వంకాయలు మరియు పీనట్ బటర్ వంటి ఎక్కువ అలర్జీకి కారణం అవుతాయి . ఇంకా కొంత మందికి పాలు కూడా పడవు. కాబట్టి ఎలాంటి ఆహారాలు అలర్జీలకు కారణం అవుతున్నాయో వాటికి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి . మరి గర్భధారణ సమయంలో అలర్జీ నివారణకు కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

1. సెలైన్ నాజల్ స్ప్రే:

1. సెలైన్ నాజల్ స్ప్రే:

ప్రెగ్నెట్ ఉమెన్ నోస్ అలర్జీకి సెలైన్ నాజల్ స్ప్రే సురక్షితమైనది.

2. ముఖానికి ఆవిరి పట్టడం

2. ముఖానికి ఆవిరి పట్టడం

గర్భిణీ స్త్రీలలు ఆవిరి పట్టడం వల్ల అలర్జీల నుండి ఉపశమనం కలిగించడంతో పాటు బ్యాక్టీరియా నివారిస్తుంది. శ్వాస ఫ్రెష్ గా , క్లీన్ గా మరియు స్మూత్ గా ఉంటుంది. ఎలాంటి సైనస్ సమస్యలుండవు.

3. ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి:

3. ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి:

రోజులో అప్పుడప్పుడు ముఖం గోరువెచ్చని నీటితో కడుక్కోవడం వల్ల చర్మానికి స్మూతింగ్ ఎఫెక్ట్ ను అందివ్వడంతో పాటు, అలర్జీల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

4. హాట్ క్లాత్:

4. హాట్ క్లాత్:

శుభ్రంగా ఉండే కాటన్ క్లాత్ ను వేడినీటిలో డిప్ చేసి , ఎక్స్ వాటర్ ను స్క్వీజ్ చేసి, ముక్కుమీద, ముక్కు పక్కల్లో, కంటి వద్ద, కనుబొమ్మల వద్ద ప్రెస్ చేస్తూ మసాజ్ చేసుకోవాలి.

5. పెప్పర్ మింట్ టీ

5. పెప్పర్ మింట్ టీ

గర్భిణీ స్త్రీలలో హేర్బల్ టీలు గ్రేట్ గా సహాయపడుతాయి . మరియు ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగించి అలర్జీలను దూరం చేస్తాయి.

6. కిటికీలు మూసి ఉండాలి

6. కిటికీలు మూసి ఉండాలి

గాలి నుండి ఇంట్లోకి ప్రవేశించే బ్యాక్టీరియా అలర్జీలకు కారణం అవుతుంది. అవుట్ డోర్ ఎయిర్ వల్ల అలర్జీలకు గురి అయితే విండో డోర్స్ క్లోజ్ చేయాలి. అవుట్ ఎక్కువగా వెళ్లడాన్ని తగ్గించాలి . అప్పుడప్పుడు క్లీన్ గా ఉండే కాటన్ క్లాత్ తో మూతి, ముక్కు తుడుచుకుంటుండాలి.

7. కర్టెన్లు, బెడ్ షీట్స్ ను శుభ్రపరుచుకోవాలి

7. కర్టెన్లు, బెడ్ షీట్స్ ను శుభ్రపరుచుకోవాలి

ప్రతి వారం కర్టెన్లు, మరియు బెడ్ షీట్స్ ను హాట్ వాటర్లో వేసి వాష్ చేయాలి . వాష్ చేయడం కష్టం అయితే కర్టెన్లకు మిట్ స్ప్రే వల్ల బ్యాక్టీరియాను నివారించుకోవచ్చు.

8. పెట్ కేర్:

8. పెట్ కేర్:

ఇంట్లో పెట్స్ ఉన్నట్లైతే అలర్జీలకు కారణం అవుతాయి. కాబట్టి పెంపుడు జంతువులు శుభ్రంగా ఉండేలా చేసుకోవాలి. వాటికి ఎప్పటికప్పుడు గ్రూమ్ చేస్తుండాలి.

9. కార్పెట్స్ అండ్ రగ్స్ అవసరం లేదు

9. కార్పెట్స్ అండ్ రగ్స్ అవసరం లేదు

గర్భాధారణ సమయంలో కార్పెట్ మరియు రంగ్స్ మ్యాట్స్ లేకుండానే ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. ఎందుకంటే కార్పెట్ , మ్యాట్స్ లో కంటికి కనిపించని మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా దాగి ుంటుంది. ఇవి అలర్జీలకు ఎక్కువ కారణం అవుతాయి . కాబట్టి ఫ్లోర్ ను అలాగే క్లీన్ గా ఉంచుకోవాలి.

10. కారణాలను గుర్తుంచుకోవాలి:

10. కారణాలను గుర్తుంచుకోవాలి:

డస్ట్ అలర్జీకి గురి అవుతుంటే, ముఖాన్ని కవర్ చేసుకోకుండా బయటకు వెళ్లకూడదు. పెట్స్ వల్ల అలర్జీకి గురి అవుతుంటే వెంటను డాక్టర్ కలవాలి. మరియు పెట్స్ ఉన్న ఫ్రెండ్స్ ఇల్లకు వెళ్ళకూడదు.

English summary

TOP 10 Home Remedies For Allergy In Pregnancy

House dust, pollens in the garden, pollution, specific foods, nuts etc can cause allergies. When you are pregnant, you are already facing lots of changes both physical and mental. Apart from changes, body pain is common. But, allergies during pregnancy is just an addition to the existing condition.
Desktop Bottom Promotion