Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీకి సహాయపడే హెర్బ్స్
గర్భధారణ సమయం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో చాలా మరింత ఏకాగ్రత, కేరింగ్ అవసరం. ఎందుకంటే మొదటి మూడునెల్లో పిండం పూర్తిగా ఏర్పడి ఉండదు కాబట్టి, గర్భిణీ స్త్రీ తీసుకొనే ప్రతి ఒక్క ఆహారం మీద ఒక కన్నేసి ఉంచాలి. తినే ఆహారం వల్ల పిండానికి ఎలాంటి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గర్భణీ తీసుకొనే ఆహారాలు బేబీ డెవలంప్ మెంట్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది . అయితే గర్భిణీ స్త్రీలకోసం అనేక రకాల మందులు, చికిత్సలున్నప్పుటికీ వాటిని ఎక్కువగా వాడటం వల్ల గర్భధారణ మొదటి మూడు నెలల్లో సైడ్ ఎఫెక్ట్ కూడా అదికంగా ఉంటాయి . అందువల్ల, నేచురల్ హేర్బల్ రెమెడీస్ ను తీసుకోవడం ఉత్తమం . గర్భధారణ సమయంలో ఇవి సురక్షితమైనవని కూడా సలహాలిస్తున్నారు ఆరోగ్య నిపుణులు
గర్భిణీలకు ఇతర మందులతో పోల్చినప్పుడు ప్రక్రుతి పరంగా మనకు అందుబాటులో ఉండే హెర్బ్స్ ఆరోగ్యానికి ఉత్తమమైనవి మరియు చౌకైనవి కూడా. ప్రస్తుతం ఔషధాలు, పౌడర్లు, సప్లిమెంట్స్, క్యాప్స్యూల్స్, టీ అండ్ ఇన్ఫ్యూషన్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి సహాయపడుతాయి . హెర్బ్స్ లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ గర్భధారణ సమయంలో వచ్చే స్ట్రెస్, వికారం, మరియు మజిల్ క్రాంప్స్ వంటి ఎన్నో సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
ఇంకా, హెర్బ్స్ సహజమైనవి, అన్ని రకాల హేర్బ్స్ సురక్షితమైనవి కావు. గర్భిణీ స్త్రీలు ఎలాంటి హేర్బల్స్ తీసుకోవాలన్నా ముందు డాక్టర్ ను సంప్రదించి వారి సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది . ఈ ఆర్టికల్లో కొన్ని హేర్బల్ రెమెడీస్ గర్భిణీలకు సురక్షితమైనవి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మరి వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

అల్లం:
గర్భిణీ స్త్రీలు తీసుకొనే హెర్బ్స్ టాప్ లిస్ట్ లో అల్లం మొదట ఉంటుంది . అల్లం వికారానికి విరుగుడు వంటింది. గర్భధారణ సమయంలో వికారం అనేది సాధారణ లక్షణం . అల్లంలో వికారాన్ని తగ్గించే ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి . వికారంగా ఉన్నప్పుడు, అల్లంను నమలడం లేదా కొద్దిగా టీ రూపంలో తీసుకోవడం మంచిది.

పెప్పర్ మింట్ :
పుదీనా ఆకుల్లో గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి . ముఖ్యంగా గర్భిణీలకు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది వికారంను తగ్గించి పొట్టకు ఉపశమనం కలిగిస్తుంది . అంతే కాకుండా పొట్ట ఉదరంలోని గ్యాస్ మరియు ప్రెజర్ ను తగ్గిస్తుంది . ఛాతీలో మంటన్ తగ్గిస్తుంది మరియు శరీరం యొక్క వాల్ ను శుభ్రం చేస్తుంది.

నాటిల్ లీఫ్:
దీన్నే స్టింగింగ్ నాటిల్ అనికూడా పిలుస్తారు. ఈ ఆకుల్లో విటమిన్ ఎ,డి, సి మరియు కెలు అధికంగా ఉన్నాయి . ఇది క్యాల్షియం, పొటాషియం, మరియు ఐరన్ లు కూడా పుష్కలంగా ఉన్నాయి . ఐరన్ లోపం వల్ల వచ్చే అలసట, ఆందోళన, జీర్ణవాహికలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది . ఇంకా హెమరాయిడ్స్ ను తగ్గిస్తుంది మరియు లేబర్ పెయిన్స్ తగ్గిస్తుంది మరియు పాల ఉత్పత్తిని పెంచుతుంది.

చమోమెలీ టీ:
చమోమెలీ టీ గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు తీసుకొనే హెర్బ్స్ లో ఇది కూడా ఒక బెస్ట్ హెర్బ్ . ఇందులో ఉపశమనం కలిగించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి , వీటి వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రలేమి మరియు మలబద్దక సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

రాస్బెర్రీ లీవ్స్:
వీటిలో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికం. రాస్బెర్రీస్ లో అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. యూట్రస్ ను హెల్తీగా ఉంచుతుంది. మరియు పాల ఉత్పత్తిని పెంచుతుంది ప్రసవ నొప్పులను తగ్గిస్తుంది . ఫస్ట్ సెమిస్టర్లో రాస్బెర్రీ లీవ్స్ ను తీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications