For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలకు "కాఫీ, టీ" ల కంటే జింజర్ టీ ఆరోగ్యకరమైనది..సురక్షితమైనది..!

|

పెళ్లైన తర్వాత ఒక సంవత్సరంలోపు మహిళ గర్భం పొందితే , ఆక ఆ ఇంట సంతోషాల వెల్లువలే, ఎందుకంటే జీవితంలో ఆనందంగా గడపాల్సిన ఒక మధుర ఘట్టం.ఇంట్లో వారందరినీ సంతోషపరిచే ఒక మంచి అవకాశం. అయితే గర్భధారణ అత్యంత సున్నితమైన అంశం. అందుకే ఈ సమయంలో గర్భం పొందిన మహిళలకు ఎన్నో ఆంక్షలు పెడుతుంటారు, కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, సూచిస్తుంటారు . ఇలా సెడన్ గా కొన్ని మార్పులు చేర్చులు చేసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో మహిళ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

కొన్ని మంచి విషయాలను అలవాటు చేసుకోవాలి? ఆల్కహాల్, టీ, కాఫీ వంటివి పూర్తిగా నివారించాలి? అలా కాకుండా టీ లేకుండా ఉండలేము, అనుకునే వారికోసమే ఈ ప్రత్యేక కథనం !

టీకి ప్రత్యామ్నాయంగా జింజర్ టీ తీసుకోవడం సురక్షితం? ఖచ్చితంగా అవునే అంటున్నారు పోషహాకర నిపుణులు. ఎందుకంటే జింజర్ టీలో కెఫిన్ ఉండదు కాబట్టి, గర్భధారణ సమయంలో జింజర్ టీ తాగడం వల్ల తల్లి, బిడ్డకు సురక్షితమైనది. అంతే కాదు, మంచి రుచి, ఆరోమా వాసన కలిగి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం గర్భిణీలు అల్లం టీ తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలేంటో ఒక సారి తెలుసుకుందాం..

1. క్యాన్సర్ నివారిణి :

1. క్యాన్సర్ నివారిణి :

అల్లంలో ఓవేరియన్ క్యాన్సర్ ను నివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక కప్పు జింజర్ టీ తాగడం వల్ల , గర్భధారణ సమయంలో గర్భిణీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది మరియు ఓవేరియన్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

2. ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ను నివారించడానికి సహాయపడుతుంది:

2. ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ను నివారించడానికి సహాయపడుతుంది:

గర్భణిలో ఐబిఎస్ (ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ )లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది,. గర్భిణీలు బౌల్ సిండ్రోమ్ సమస్యలతో బాధపడుతున్నట్లైతే, లక్షణాలు, సమస్య మరింత తీవ్రం కాకముందే జింజర్ టీతో ఉపశమనం పొందాలి. ఐబిఎస్ లక్షణాల, సమస్యలను నివారించడంలో తక్షణ ఉపశమనం కలిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

3. అలసిన కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది:

3. అలసిన కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది:

గర్భధారణ సమయంలో మహిళ శరీరంలో బోన్స్, మజిల్స్ మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, రోజూ ఒక కప్పు అల్లం టీ తాగడం వల్ల మజిల్ పెయిన్ బోన్ పెయిన్ నివారించుకోవచ్చు .

4. గ్లూకోజ్ లెవల్స్ మ్యానేజ్ చేస్తుంది :

4. గ్లూకోజ్ లెవల్స్ మ్యానేజ్ చేస్తుంది :

గర్భిణీ స్త్రీలో ప్రతి రోజూ జింజర్ టీ తాగడం వల్ల ఇన్సులిన్ లెవల్స్ ను తగ్గించి, జస్టేషనల్ డయాబెటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి, ఆల్రెడి డయాబెటిస్ ఉన్నట్లైతే జింజర్ టీ ఇన్సులిన్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

5. న్యూట్రీషియన్స్ అబ్సార్బ్ చేస్తుంది:

5. న్యూట్రీషియన్స్ అబ్సార్బ్ చేస్తుంది:

గర్భం పొందిన మహిళల్లో శరీరంలో పోషకాల్లో అనేక మార్పులు జరుగుతాయి.కాబట్టి, గర్భిణీలు తీసుకునే ఆహారంలో ప్రతి ఒక్కటీ ఇప్పుడు తీసుకునే దానికంటే అదనంగా తీసుకోవాలి. గర్భిణీ తీసుకునే ఆహారంను బాడీ పూర్తిగా గ్రహించడంలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది.

6. మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది:

6. మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది:

గర్భిణీల్లో వేధించే సమస్య మార్నింగ్ సిక్నెస్ . ఈ సమస్య నుండి బయటపడాలంటే అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయం అల్లం టీ తాగడం వల్ల వికారం , వాంతుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

7. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది:

7. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది:

తరచూ నీరసంగా, అలసటగా ఫీలవుతుంటే, జింజర్ టీ గ్రేట్ గా హెల్ఫ్ అవుతుంది. అల్లం టీ ఇన్ స్టాంట్ ఎనర్జీ అందిస్తుంది. రోజంతా ఉత్సాహన్ని అందిస్తుంది. క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో కూడా అల్లం టీ అలసటను నివారిస్తుంది. !

8. గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది:

8. గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది:

గర్భిణీల పిండం పెరిగేకొద్ది, యూట్రస్ కూడా పెరుతుంది, దాంతో పొట్టలో ఫ్లూయిడ్స్ పెరగడం వల్ల , జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది, ఇది ఎక్సెస్ గ్యాస్ కు కారణమవుతుంది. ఈ సమయంలో అల్లం టీ సహాయపడుతుంది. పొట్టలో గ్యాస్ సమస్యను, ఆపానవాయువు సమస్యను నివారిస్తుంది .

9. ఇమ్యూనిటి పెంచుతుంది:

9. ఇమ్యూనిటి పెంచుతుంది:

గర్భధారణ సమయంలో వ్యాధినిరోధకను పెంచడంలో జింజర్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది,. గర్భధారణ సమయంలో కామన్ గా వచ్చే డయోరియా, దగ్గు, జలుబు వంటి సాధారణ జబ్బులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. సాధారణ జబ్బును ఎదుర్కోవడానికి శరీరంలో ఇమ్యూనిటి పవర్ పెంచడానికి అల్లం టీ గ్రేట్ గా సహాయపడుతుంది.

10. స్ట్రెస్ తగ్గిస్తుంది:

10. స్ట్రెస్ తగ్గిస్తుంది:

గర్భధారణ సమయంలో మానసికంగా, శారీరకంగా స్ట్రెస్ పెరుగుతుంది? శరీరంలో జరిగే మార్పుల వల్ల స్ట్రెస్ పెరగడం సహజం , ప్రెగ్నెన్సీ హార్మోనులు కారణంగా సమస్య మరింత తీవ్రం అవుతుంది. ఈ సమయంలో వచ్చే స్ట్రెస్ ను తగ్గించడానికి అల్లం టీ గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

10 Amazing Healthy Benefits Of Ginger Tea During Pregnancy

Is ginger tea safe during pregnancy? We did some sleuthing, and came up with an interesting answer! Read on to find out more about the pros and cans of drinking ginger tea during pregnancy.
Story first published:Monday, October 24, 2016, 11:53 [IST]
Desktop Bottom Promotion