For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు సీతాఫలం తింటే పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ..!!

|

సీతాఫలం: శీతాకాలం వచ్చిందంటే చాలు, మనందరికీ సీతాఫలాలు గుర్తుకొస్తాయి. సీతాఫలాలు ప్రకృతి వరాలు. చలికాలంలో విరివిగా లభించే ఫలాలలో సీతాఫలం ఒకటి, సీతాఫలాన్ని రకరకాలుగా పిలుస్తారు. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. పచ్చి సీతాఫలం తినడానికి పనికిరాదు. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. బాగా పండినతర్వాత మాత్రమే తినడానికి వీలవుతుంది. సీతాఫలం చుట్టూ కళ్లులాగా బెరడులాంటి పధార్థం ఉంటుంది. పండిన సీతాఫలంపై ఈ కళ్లను విడదీస్తే లోపల ఒక్కొక్క గింజ చుట్టూ తెల్లటి గుజ్జు మధురంగా ఉంటుంది.

కాలానుగుణంగా ఉత్పత్తి అయ్యే పండ్లలో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఏ పండు అయినా, శరీరానికి కేలరీలుతోపాటు తగిన మోతాదులో మాంసకృత్తులను సైతం అందించగలవు, అయితే సీతాఫలం మాత్రం ఇందుకు భిన్నమైనదనక తప్పదు. ఎందుకంటే ఇందులో ఉత్తమ పోషక విలువలుంటాయి. ప్రకృతి సిద్ధమైన ఖనిజ లవణాలు, ప్రక్టోజు, కార్బోహైడ్రేట్లు వీటిలో సమృద్ధిగా లభిస్తాయి. పోషకాలు రక్తంలో త్వరగా కలిసిపోయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, ఆయాసం ఉన్న వారు వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఆహార పధార్థాంగా ఆకలిని తీర్చడం మాత్రమేగాక, ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఇందులో దాగివున్నాయంటే ఆశ్ఛర్యం కలగక మానదు.

సాధారణ వ్యక్తులకు మాత్రమే కాదు, ఎక్స్ పెక్టెడ్ మదర్స్ కూడా సీతాఫలాలను తినవచ్చు. కాబోయే తల్లికి మాత్రమే కాదు, పుట్టబోయే పిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. గర్భిణీ స్త్రీలలో మార్నింగ్ సికె నెస్, మూడ్ స్వింగ్స్ ను నివారించే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, గర్భిణీలు సీతాఫలం తినడం వల్ల మరిన్ని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి . అవేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

విటమిన్ ఎ మరియు విటమిన్ సి:

విటమిన్ ఎ మరియు విటమిన్ సి:

విటమిన్ ఎ మరియు సిలు సీతాఫలాల్లో అధికంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ ప్రెగ్నెంట్ లేడీస్ కు చాలా అవసరమవుతాయి. అంతే కాదు గర్భిణీ పొట్టలో పెరిగే ఫీటస్ డెవలప్ మెంట్ కు కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. సీతాఫలాలను తినడం వల్ల పుట్టబోయే బిడ్డలో నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది . బేబీ గ్రోత్ బాగుంటుంది.

క్యాలరీలు ఎక్కువ:

క్యాలరీలు ఎక్కువ:

సీతాఫలంలో క్యాలరీలు అధికంగా ఉంటాయి, ఇది గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. కాబోయే తల్లులకు క్యాలరీలు అధికంగా అవసరమవుతాయి. కాబోయే తల్లిల్లో శారీరకంగా ఫిట్ గా హెల్తీగా ఉండటానికి సహాయపడుతాయి. గర్భధారణ సమయంలో బరువు పెరగడానికి సహాయపడుతుంది.

మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

సీతాఫలంలో ఉండే హై ఫైబర్ కంటెంట్ మలబద్దకం నివారిస్తుంది. మరియు ఇది ఎనర్జీని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది మలబద్దకం నివారించడంలో సహాయపడుతుంది . బలహీనతను పోగొడుతుంది. అలసట తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది.

 శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది:

శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది:

సీతాఫలంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది మార్నింగ్ సిక్ నెస్ , తిమ్మెర్లు, మరియు మూడ్ స్వింగ్స్ నివారిస్తుంది. మరియు ప్రెగ్నెంట్ మహిళల్లో ఫుడ్ కర్వింగ్స్ కంట్రోల్ చేస్తుంది.

దంత సమస్యలను నివారిస్తుంది :

దంత సమస్యలను నివారిస్తుంది :

గర్భధారణ సమయంలో డెంటల్ సమస్యలు సాధారణంగా ఉంటాయి. గర్భిణీస్త్రీలలో దంతక్షయం, దంతాల నొప్పి సమస్యలతో బాధపడుతుంటారు, ఈ సమస్యలను నివారించడంటో గమ్ డిసీజ్ లను మరియు దంతాల నొప్పిని తగ్గించడంలో సీతా ఫలం గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి అవుతుంది

బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి అవుతుంది

గర్భిణీ స్త్రీలు సీతాఫలంను రెగ్యులర్ గా తినడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి అవుతుంది,

లాబెర్ పెయిన్ తగ్గిస్తుంది:

లాబెర్ పెయిన్ తగ్గిస్తుంది:

సీతాఫలంను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గర్భస్రావం నివారిస్తుంది. ల్యాబర్ పెయిన్స్ తగ్గిస్తుంది .

బేబీ డెవలప్ మెంట్ :

బేబీ డెవలప్ మెంట్ :

సీతాఫలం ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బేబీలో ఇమ్యూన్ సిస్టమ్, నాడీవ్యవస్థ, మరియు బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది .

ప్రీమెచ్యుర్ సమస్యలను తగ్గిస్తుంది :

ప్రీమెచ్యుర్ సమస్యలను తగ్గిస్తుంది :

సీతాఫంలో కాఫర్ అధికంగా ఉంటుంది. గర్భిణీలకు రోజుకు 1000మైక్రోగ్రాముల కాపర్ అవసరమవుతుంది. లోకాపర్ వల్ల ప్రీమెచ్యుర్ బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి . కాబట్టి, ఈ ఫ్రూట్స్ తినడం నిజంగా హెల్ఫ్ అవుతుంది.

సీతాఫలంలో విటమిన్ ఎ మరనియు సిలు

సీతాఫలంలో విటమిన్ ఎ మరనియు సిలు

సీతాఫలంలో విటమిన్ ఎ మరనియు సిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పొట్టలో పెరిగే బిడ్డకు కళ్ళు, స్కిన్, హెయిర్ మరియు బ్లడ్ టిష్యులు ఏర్పడటానికి సహాయపడుతాయి.

English summary

10 Health Benefits Of Eating Custard Apple During Pregnancy

8 Health Benefits Of Eating Custard Apple During Pregnancy,Pregnancy is very special time for a woman; you are not only eating for your health, but also for the development of your unborn baby. That’s why everyone advises expecting moms to include healthy vegetables and fruits in their diet.
Story first published: Tuesday, July 19, 2016, 12:34 [IST]
Desktop Bottom Promotion